అమరావతి (చైతన్యరథం) : ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత పది సంవత్సరాలుగా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గెస్ట్ ఉపకార వేతన అర్హత పరీక్ష వచ్చే నెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలియచేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకారవేతనం అందజేయ నున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడిరచారు. ఈ క్రమంలో మొదటి పది ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 5 వేల రూపాయల చొప్పున, తరువాతి పదిహేను ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 3 వేల రూపాయల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసే వరకు ఇవ్వనున్నట్లు భువనేశ్వరి స్పష్టం చేశారు. ఈ సదవకాశాన్ని పదవ తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.