చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇక ఏకగవాక్ష విధానం

సీఎం సమీక్షా నిర్ణయాలను ప్రకటించిన మంత్రి నారాయణ

by చైతన్యరధం
Nov 26, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇక ఏకగవాక్ష విధానం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • డిశంబరు 31నుండి సింగిల్‌ విండో అనుమతులు
  • పలు శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
  • భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం
  • కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఏపీ సర్కార్‌
  • 15 మీటర్ల ఎత్తు భవనాలకు ప్లాన్‌ అనుమతులు అక్కర్లేదు
  • టీడీఆర్‌ అంశాలపై 15 రోజుల్లో పూర్తిస్థాయి సమీక్ష
  • అమృత్‌ 2.0 రెండేళ్లలో పూర్తికి ముఖ్యమంత్రి ఆదేశాలు
  • మెప్మా సభ్యుల అభ్యున్నతికి పి4 విధానంలో చర్యలు
  • రాజధానిలో త్వరలోనే ఐకానిక్‌ భవన నిర్మాణాల పనులు
  • సీఎం సమీక్షా నిర్ణయాలను ప్రకటించిన మంత్రి నారాయణ

అమరావతి (చైతన్య రథం): భవనాలు, లే అవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్ట్‌కు సీఎం ఆమోద ముద్ర వేశారు. 15 మీటర్ల ఎత్తువరకూ భవనాల నిర్మాణాల ప్లాన్‌లకు మున్సిపల్‌ శాఖ అనుమతి అవసరం లేదు. రాష్ట్రంలో వచ్చేనెల 31నుండి వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను మరింత సులభతరం చేయడం ద్వారా సింగిల్‌ విండో (ఏక గవాక్ష) విధానంలో అనుమతులిచ్చేదుంకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి మంత్రి పి నారాయణ వెల్లడిరచారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర మున్సిపల్‌ శాఖపై సమీక్ష నిర్వహించారని, సమావేశంలో ప్రధానంగా టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించిన అంశాలపై కీలక సూచనలు చేశారని తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ అనుమతులను వేగవంతంగా సులభంగా ఇచ్చే అంశంపై మున్సిపల్‌ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు.

వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న భవన నిర్మాణ అనుమతులు పరిశీలనకై ఏడు కమిటీలను ఏర్పాటు చేయగా, వారు 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించారని మంత్రి నారాయణ వివరించారు. భవన నిర్మాణ అనుమతులకై నిర్మాణదారులు వివిధ శాఖల అనుమతులకై రెవెన్యూ, రిజిష్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌, అగ్నిమాపక శాఖలతోపాటు గనులు, రైల్వే, విమానాశ్రయ ప్రాంతాల సమీపంలో అయితే ఆయా శాఖల చుట్టూ అనుమతులకై తిరిగడం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా అన్ని అనుమతులు ఒకేచోట సింగిల్‌ విండో విధానంలో పొందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల సర్వర్లను మున్సిపల్‌ పరిపాలనశాఖ సర్వర్‌తో ఇంటిగ్రేట్‌ చేయనున్నట్టు తెలిపారు. ఈవిధానం వచ్చేనెల 31నుండి అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ వివరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

గంగజాతర ముందే మొదలైంది!

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

లైసైన్స్‌డ్‌ సర్వేయర్లు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను అన్‌లైన్‌లో అప్లై చేస్తే అందుకు సంబంధించిన అనుమతులను సకాలంలో మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడిరచారు. ఈ అనుమతులు మంజూరుకు సంబంధించి ఎవరైనా లైసెన్సుడు సర్వేయర్లు అవకతలకు పాల్పడితే అలాంటి వారి లైసెన్సును రద్దు చేయడంతోపాటు వారిపై చట్టపరమైన క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై ఏర్పాటైన టాస్కుఫోర్సు కూడా ఆన్‌లెన్‌లో నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో వివిధ లే అవుట్లలో ప్రస్తుతం 12 అడుగుల వరకూ స్థలాన్ని రోడ్డుకు కేటాయించాల్సి ఉందని, అయితే వివిధ రాష్ట్రాల్లో అది 9 అడుగులుగా ఉందని అదే విధానాన్ని రాష్ట్రంలోనూ అనుసరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్‌ మంత్రి నారాయణ చెప్పారు.

అదేవిధంగా 500 చదరపు మీటర్లకంటే ఎక్కువ విస్తీర్ణలో నిర్మించే వాణిజ్య భవనాలు, నివాస భవనాలకు సంబంధించి సెల్లార్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. హైరైజ్‌ భవనాలకు సంబంధించి సెట్‌ బ్యాక్‌ ఏరియా ఎంత ఉండాలనే దానిపైనా స్పష్టమైన అనుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. టిడిఆర్‌ బాండ్లకు సంబంధించి కూడా సీయంతో జరిగిన సమావేశంలో చర్చకు రాడవడం జరిగిదని, దానిపై పూర్తి వివరాలు సేకరించి రావాలని 15 రోజుల్లో మరలా సమీక్షిస్తానని సీయం చెప్పారని అన్నారు. మెప్మాకు సంబంధించి ప్రస్తుతం సుమారు 28లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, వారి అభ్యున్నతికి పి-4 విధానంలో రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో అమృత్‌ 2.0ను రెండేళ్ళలో పూర్తి చేయాలని సీయం ఆదేశించారని, ఆ ప్రకారం తగిన చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి నారాయణ వెల్లడిరచారు.

అమరావతి రాజధానికి సంబంధించి మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతి అని పార్లమెంటులో కేంద్రం గతంలోనే స్పష్టంగా చెప్పిందని, కేంద్రం అధికారిక గెజిట్‌ను జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఐదు ఐకానిక్‌ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్‌ పోస్టర్‌ సంస్థ గతంలో రూపోందించిందని.. అయితే గత ప్రభుత్వం నార్మన్‌ పోస్టర్స్‌ సంస్థ టెండర్‌ను, వారి డిజైన్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. అందుకే మళ్లీ ఈ భవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలవగా.. ఆ టెండర్లు మరలా నార్మన్‌ పోస్టర్స్‌ సంస్థకే వచ్చాయని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు.

త్వరలోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామని, గత ప్రభుత్వం ఎలాంటి నోటీసు లేకుండా టెండర్లు రద్దు చేయటంతో నార్మన్‌ పోస్టర్స్‌ ఆర్బిట్రేషన్‌ వేసిందన్నారు. అందుకే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రంలో వారికి రూ.9 కోట్లు పరిహారం చెల్లించాల్సి వచ్చిందని ఆ కారణంగానే ఇప్పుడు మళ్లీ రీటెండర్‌ పిలవాల్సి వచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి పనులు త్వరలోనే మొదలవుతాయని, ప్రపంచబ్యాంకు రుణానికి ఎలాంటి ఇబ్బందీ లేదని.. దశలవారీగా రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ముందుకు వచ్చిందని మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ వివరించారు.

Previous Post

రహదారులకు సంక్రాంతి శోభ

Next Post

ఇంటింటా.. సౌర వెలుగు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

కార్యకర్త
@ February 2, 2026
గంగజాతర ముందే మొదలైంది!
ఆంధ్రప్రదేశ్

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని
ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!
చైతన్యరధం

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు
ఆంధ్రప్రదేశ్

కేంద్ర బడ్జెట్.. వికసిత భారతానికి ఊతం

చైతన్యరధం
@ February 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026

కార్యకర్త
@ February 1, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

కేంద్ర బడ్జెట్.. వికసిత భారతానికి ఊతం

చైతన్యరధం
@ February 2, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రాజెక్ట ల  పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

ప్రాజెక్ట ల పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

చైతన్యరధం
@ January 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

గంగజాతర ముందే మొదలైంది!

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist