చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని సంతకం యువగళం!

రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిన యువనేత

by చైతన్యరధం
January 27, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని సంతకం యువగళం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లు
  • తప్పుడు కేసులు, అణిచివేతను ఎదుర్కొంటూ 3,132 కిమీ పాదయాత్ర
  • ఎండ, వాన, తుపానులను లెక్కచేయకుండా అలుపెరగని యాత్ర
  • ప్రజల గొంతుకనే తన గళంగా వినిపించిన లోకేష్‌
  • పదునైన ప్రసంగాలు, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు
  • రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిన యువనేత

అమరావతి (చైతన్యరథం): ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించి, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ప్రారంభమై సోమవారానికి రెండేళ్లు పూర్తవుతుంది. రాష్ట్రంలో 5కోట్లమంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి 2023, జనవరి 27వ తేదీన పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లిన యువనేత నారా లోకేష్‌ యువగళంతో రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్నే మార్చేశారు. ఉద్యోగాల్లేక నిరాశ,నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత ఒకవైపు…ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా తిరిగివస్తామనే నమ్మకం లేక భయాందోళనలతో మహిళలు మరోవైపు, అడ్డగోలు బాదుడుతో బతుకుభారంగా మారిన జనసామాన్యం ఇంకోవైపు.. ఇలా అడుగడుగునా అభద్రతాభావం, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ యువనేత నారా లోకేష్‌ ఆనాడు జనంలోకి వెళ్లారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగళం పాదయాత్ర ప్రజాచైతన్యంతో సంపూర్ణ విజయం సాధించింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో యువగళం కీలకపాత్ర పోషించింది.

ప్రతికూల వాతావరణంలోనూ అడుగు ముందుకే!
యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ఎంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. యువగళం యాత్ర జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర మాదిరి శని, ఆదివారాల్లో వారాంతపు సెలవులతో ఆషామాషీగా సాగలేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామం లేకుండా యువగళం పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం లోకేష్‌ పాదయాత్రను ఆపలేదు. ఎండ, వాన, తుపానులను సైతం లెక్కచేయకుండా లోకేష్‌ పాదయాత్రను కొనసాగించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరు వర్షంలో సైతం యాత్రను కొనసాగించారు. పాదయాత్ర నంద్యాల చేరుకున్న సమయంలో అభిమానుల తాకిడికి చేయినొప్పితో బాధపడుతున్న సమయంలో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా యువనేత లెక్క చేయలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉక్కుసంకల్పంతో లక్ష్యంగా దిశగా సాగారు యువనేత లోకేష్‌. యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్‌ 70 బహిరంగసభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. కుటుంబసభ్యుడిలా భావించి తమ బాధలు చెప్పుకుంటూ యువనేతకు జనం నీరాజనాలు పట్టారు. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మందికి పైగా ప్రజలు యువనేతతో కనెక్ట్‌ అయ్యారు.

అరాచక పాలకుల్లో వణుకు పుట్టించిన యువగళం
యువనేత లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించడంతో అప్పటి ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం నుంచి నిలబడే స్టూల్‌ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. లోకేష్‌ ఏ మాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తన గళంగా వినిపిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగారు. కుప్పంలో మొదలైన యువగళం పాదయాత్ర తంబళ్లపల్లె నియోజకవర్గం చేరేసరికి ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 25కేసులు బనాయించారు. ఇందులో యువనేత లోకేష్‌ పై 3 కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్‌ సిస్టమ్‌, మైక్‌, స్టూల్‌ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్‌ చేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా క్రమశిక్షణకు మారుపేరైన లోకేష్‌ నేతృత్వంలో యువగళం బృందాలు మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగాయి. యువగళాన్ని స్వాగతిస్తూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా పసుపు సైనికులు ఎక్కడా సంయమనం కోల్పోలేదు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసీపీ ముష్కరమూకలు, పోలీసులు కలిసి యువగళం వాలంటీర్లను రెచ్చగొట్టి తిరిగే వారిపైనే తప్పుడు కేసులు పెట్టారు. 40మంది యువగళం వాలంటీర్లను నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితో సహా 46 మంది కీలకనాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అప్పటి అధికారపార్టీలో నెలకొన్న భయానికి అద్దం పట్టింది.

రాయలసీమలో రికార్డు సృష్టించిన యువగళం
యాత్రను అడ్డుకునేందుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటూ పట్టువదలని విక్రమార్కుడిలా లోకేష్‌ ముందుకు సాగిన తీరు టీడీపీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి వరకు యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ చేయని కుట్రలు లేవు. అయితే ఉక్కు సంకల్పంతో యజ్ఞంలా సాగిన యువగళాన్ని అడ్డుకోవడం వైసీపీ ముష్కరమూకల వల్లకాలేదు. చైతన్యానికి మారుపేరైన విజయవాడ వంటి నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తెల్లవారుజాము 3.30వరకు ఎదురుచూడటం యువనేత లోకేష్‌పై నెలకొన్న అభిమానంతోపాటు అప్పటి అరాచక ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతకు అద్దం పట్టింది. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 పట్టబద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయదుందుభి మోగించడంతో అధికారపార్టీలో ప్రకంపనలు చెలరేగాయి. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో యువనేత లోకేష్‌ రికార్డు సృష్టించారు. 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కి.మీ మేర సీమలో యువగళం పాదయాత్ర కొనసాగింది. అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ యువనేత పాదయాత్ర సాగింది. రాయలసీమలో యువగళానికి లభించిన అపూర్వస్పందన అధికారపార్టీ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉక్కుసంకల్పంతో సాగిన యువగళాన్ని అడ్డుకోవడం వారి తరం కాలేదు.

ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జేజేలు
చైతన్యానికి మారుపేరైన ఉభయగోదావరి జిల్లాల్లో 17 నియోజకవర్గాల పరిధిలో 23 రోజుల పాటు సాగిన యువగళం పాదయాత్ర జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాలు, 11రోజులు, 225.5 కి.మీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9 నియోజకవర్గాలు, 12 రోజులు 178.5 కి.మీ.లు కలిపి మొత్తం 404 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలు యువనేతకు ఆత్మీయస్వాగతం పలికారు. రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, పెద్దాపురం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యువగళం ముందుకు సాగింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో 79 రోజుల పాటు సుదీర్ఘ విరామానంతరం రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద నవంబర్‌ 27న పునఃప్రారంభమైన యువగళం 2.0లో ప్రజలు గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్రను యువనేత లోకేష్‌ అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా అగనంపూడి వద్దే ముగించాల్సి వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 7రోజులు, 113 కి.మీ.లు మాత్రమే యాత్ర కొనసాగినప్పటికీ ప్రజలు అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం పట్టారు. లక్షలాది ప్రజలు, అభిమానులు, మహిళలు, టీడీపీ-జనసేన కార్యకర్తలు యువనేతకు నీరాజనాలు పట్టారు.

పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు
యువనేత లోకేష్‌ తాను పాదయాత్ర నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బహిరంగసభలు నిర్వహించి మాటల తూటాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. యువగళం పాదయాత్ర సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 చోట్ల యువనేత లోకేష్‌ బహిరంగసభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్‌ రెడ్డి పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమేగాక, ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేయడంతో అధికారపార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టాయి. సమాధానం చెప్పలేని అధికారపార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడికి దిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏం చేస్తామనేది స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరిన తీరు ప్రజలను ఆకట్టుకుంది. యువగళం పాదయాత్ర దారిలో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల తాలుకూ విజయగాథలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేష్‌ విసిరిన సెల్ఫీ ఛాలెంజ్‌లు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వైసీపీ పాలనలో సాగిన విధ్వంసం, అవినీతిని సెల్ఫీలతో వివరిస్తూ ప్రజల్ని లోకేష్‌ చైతన్యవంతం చేశారు. పాదయాత్ర సాగే సమయంలో ఎక్కడ ఎవరి బండారాన్ని బయటపెడతారోనని ఆనాటి అధికారపార్టీ శాసనసభ్యులు భయపడేంతలా యువనేత లోకేష్‌ యాత్ర సాగింది.

అభిమానులు, పీడిత ప్రజలకు దగ్గరగా…
యువగళం పాదయాత్ర సందర్భంగా తమను కలిసే అభిమానులను నిరాశపర్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. యువనేతతో సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్‌ చేయించి, ఫేస్‌ రికగ్నషన్‌ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు ఫోటోలను అప్‌ లోడ్‌ చేశారు. సెల్ఫీ విత్‌ లోకేష్‌ కార్యక్రమంతోపాటు దారిపొడవునా తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా ఓపికగా ఫోటోలు దిగారు. ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్‌ లోకేష్‌ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభించింది. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో యువనేత లోకేష్‌ 3.5 లక్షల మందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగారు. నెల్లూరులో అత్యధికంగా ఒకేరోజు 2,500 మంది యువనేతతో సెల్ఫీ దిగారు. పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో యువనేత లోకేష్‌ను లక్షలాది ప్రజలు కలుసుకొని తమ సమస్యలను చెప్పుకున్నారు. ఇందులో కొందరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో యువనేత లోకేష్‌ వారిని ఊరడిరచి నేనున్నానంటూ అండగా నిలచారు. సమస్య తీవ్రతను బట్టి ప్రతి జిల్లాలోనూ యువనేత లోకేష్‌ వ్యక్తిగత నిధులతో సాయమందించారు. సంబంధిత బాధితుల వివరాలు తీసుకొని, వారికి సాయం అందించే వరకు సహాయకుల ద్వారా వాకబుచేస్తూ ఆపన్నుల్లో ధైర్యం నింపారు.

హామీల అమలుదిశగా ప్రజాప్రభుత్వం అడుగులు
సుదీర్ఘ యువగళం పాదయాత్రలో యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా యువనేత నారా లోకేష్‌ అనేక హామీలను ఇచ్చారు. ముఖ్యంగా సీమ ప్రజల కోసం కడపలో మిషన్‌ రాయలసీమ పేరుతో డిక్లరేషన్‌ను ప్రకటించారు. యువనేత లోకేష్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రతిబింబిస్తూ ఎన్‌డీఏ కూటమి సూపర్‌ సిక్స్‌ పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించింది. పాదయాత్రలో యువనేత నారా లోకేష్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్తప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజునే మెగా డీఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం చేశారు. అధికారంలోకి వచ్చాక యువతకు ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని యువనేత లోకేష్‌ ఇచ్చిన హామీ అమలుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల్లోనే రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4లక్షలమందికి పైగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. మంత్రి నారా లోకేష్‌ అవిశ్రాంత కృషితో ఆర్సెలర్స్‌ మిట్టల్‌ అండ్‌ నిప్పాన్‌ స్టీల్స్‌, గూగుల్‌, టీసీఎస్‌, వీడియోకాన్‌ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూకట్టాయి. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన యువనేత లోకేష్‌… ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. పోలీసు వలయాలు, పరదాల మాటున కాకుండా అనుక్షణం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వాడే ప్రజానాయకుడని ఆచరణాత్మకంగా నిరూపిస్తున్న యువకెరటం నారా లోకేష్‌ నేటితరం రాజకీయ నాయకులకు స్పూర్తిగా నిలుస్తున్నారు.

Previous Post

సీఐడీ కస్టడీలో..నాపై దాడి చేసిన వారిని గుర్తించా

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 27-01-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 27-01-2025

చైతన్యరధం ఈ పేపర్ 27-01-2025

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.