చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అభ్యసన ఫలితాలే లక్ష్యంగా..పాఠశాల విద్యలో సంస్కరణలు

మంత్రి నారా లోకేష్‌ స్పష్టీకరణ

by చైతన్యరధం
Mar 4, 2025 at 6:54am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అభ్యసన ఫలితాలే లక్ష్యంగా..పాఠశాల విద్యలో సంస్కరణలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నెం.1గా తీర్చిదిద్దుతాం
  • సంస్కరణల అమలులో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి
  • జూన్‌ నాటికి సంస్కరణలు పూర్తి, అక్కడ నుంచి ఫలితాలపైనే దృష్టి
  • గతప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12లక్షల మంది విద్యార్థుల తగ్గుదల
  • లెర్నింగ్‌ ఎక్సలెన్స్‌, జీఓ 117 రద్దుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మంత్రి లోకేష్‌ సమావేశం

అమరావతి (చైతన్యరథం): అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా లెర్నింగ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఏపీ (లీప్‌), జీఓ 117 రద్దు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై కూటమి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేష్‌ 3గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యావ్యవస్థలో సమూలన ప్రక్షాళన చేసి, దేశంలోనే ఏపీ విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయానికి అనుగుణంగా విద్యాశాఖ మంత్రిగా తాను సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, తద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించవచ్చని తెలిపారు. విద్యావ్యవస్థ కోట్లాదిమంది జీవితాలపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో జీఓ 117 దుష్ఫలితాల గురించి అనేక మంది నాయకులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 12లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు. వారంతా ప్రైవేటు స్కూళ్లవైపు మళ్లారని తెలిపారు. గత పాలకుల వైఫల్యాన్ని అసర్‌ నివేదిక తేటతెల్లం చేసిందని చెప్పారు.
జాతీయ సగటుకంటే క్షీణత
నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌) నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ అన్ని తరగతుల్లోనూ గణనీయమైన అభ్యాస అంతరాన్ని ఎదుర్కొంటోంది. 3వ తరగతి విద్యార్థుల్లో లాంగ్వేజెస్‌లో 57 శాతం మంది, గణితంలో 54 శాతం మంది మాత్రమే అంచనా ప్రమాణాలను చేరుకుంటున్నారు. ఇది జాతీయ సగటు కంటే 5 నుంచి 8 శాతం తక్కువ. పై తరగతుల్లో ఈ అంతరం మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 70 శాతం జిల్లాలు జాతీయ సగటు కంటే తక్కువ పనితీరు కనబరుస్తున్నాయి. రాష్ట్రంలో ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) నైపుణ్యాల్లో క్షీణతను అసర్‌ `2024 నివేదిక తెలియజేస్తోంది. 8వ తరగతి విద్యార్థుల్లో 55 శాతం మంది విద్యార్థులు కనీసం భాగాహారం కూడా చేయలేకపోతున్నారు. 10వ తరగతిలో గ్రేడ్‌-3 విద్యార్థుల్లో 9 మందికి ప్రాథమిక సంఖ్యా నైపుణ్యాలు కూడా లేవు. పెర్ఫార్మెన్స్‌ గ్రేడిరగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ) 2021-22 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ విద్య శిక్షణ డొమైన్‌లో 60 పాయింట్లు సాధించింది. ఇది పెద్ద రాష్ట్రాల సగటు 66 కంటే తక్కువ. క్లాస్‌రూమ్‌ల్లో నాణ్యత మెరుగుపరచడానికి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని మంత్రి లోకేష్‌ వివరించారు.
గత ప్రభుత్వ పొరపాటును సరిదిద్దేందుకే జీఓ 117రద్దు
గత ప్రభుత్వం చేసిన పొరపాటును సరిదిద్దేందుకు జీఓ 117ను రద్దుచేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పాఠశాల విద్యలో స్కూల్‌ బ్యాగ్స్‌, గుడ్లు, చిక్కీలకు రూ.4,300 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. ఎటువంటి ముందస్తు వ్యూహం లేకుండా సిబిఎస్‌ఈ, ఐబిల పేరుతో హడావిడి చేశారు. సిబిఎస్‌ఇ విధానం ప్రవేశపెట్టిన పాఠశాలల విద్యార్థులకు మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తే 90శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఐబి నివేదిక పేరుతోనే రూ.5కోట్లు దుర్వినియోగం చేశారు. పిల్లల భవిష్యత్తుతో కూడుకున్న అంశమైనందున ప్రజాప్రతినిధులంతా పాఠశాలలపై దృష్టి పెట్టాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరం కలసికట్టుగా పనిచేస్తేనే సంస్కరణల అమలు సాధ్యమవుతుంది. అంతిమంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ఫలితాలను సాధించాలి. విలువలతో కూడిన విద్యాబోధన జరగాలని మంత్రి లోకేష్‌ అన్నారు.
ఉత్తమ పద్ధతుల అధ్యయనానికి విదేశాలకు టీచర్లు
అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై అధ్యయనం చేసేందుకు ఎంపికచేసిన ఉపాధ్యాయులను పోలాండ్‌ వంటి ఇతర దేశాలకు పంపిస్తాం. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో నియోజకవర్గానికి ఒక మోడల్‌ స్కూల్‌ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తాం. పాసివ్‌ లెర్నింగ్‌ నుంచి యాక్టివ్‌ లెర్నింగ్‌కు మారాలి. రాబోయే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్స్‌, బెంచీలు, తాగునీరు, టాయ్‌లెట్లు వంటివి పూర్తిస్థాయిలో ఏర్పాటుచేస్తాం. ప్రభుత్వ నిధులతో పాటు శాసనసభ్యులు నియోజకవర్గ స్థాయిలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులను సమీకరించి స్కూళ్లలో సౌకర్యాల మెరుగుదలకు కృషిచేయాలి. కేవలం అకడమిక్‌ అంశాలపైనే గాక విద్యేతర అంశాలపై కూడా దృష్టిపెట్టాలి. స్కూలు స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు స్పోర్ట్స్‌ లీగ్‌లు, సైన్స్‌ ఫేర్‌లు నిర్వహిస్తాం. స్కూళ్లలో ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, రెడ్‌ క్రాస్‌ సేవలు వంటి వాటిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తాం. గంజాయి, డ్రగ్స్‌ నివారణకు డ్రగ్స్‌ వద్దు బ్రో పేరుతో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు, ఈగల్‌ క్లబ్బులు ఏర్పాటుచేస్తున్నాం. ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జూన్‌ నాటికి సంస్కరణలు పూర్తిచేసి, ఆ తర్వాత రాబోయే నాలుగేళ్లు లెర్నింగ్‌ అవుట్‌ కమ్స్‌ పైనే దృష్టిసారిస్తామని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.
జీఓ 117 కారణంగా జరిగిన నష్టాలు, ప్రత్యామ్నాయ ముసాయిదాను పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌, కమిషనర్‌ విజయరామరాజు ప్రజాప్రతినిధులకు వివరించి, వారి అభిప్రాయాలను తీసుకున్నారు. సమావేశంలో ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్‌ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎండి గణేష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

Previous Post

పోసానికి 10 రోజుల రిమాండ్‌

Next Post

ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026

కార్యకర్త
@ June 21, 2026
భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

కార్యకర్త
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

చైతన్యరధం
@ June 20, 2026
ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist