చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి

పాల్గొన్న మంత్రులు అనిత, కొల్లు, దుర్గేష్‌

by చైతన్యరధం
Jul 5, 2025 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జయంతి వేడుకల్లో స్పీకర్‌ అయ్యన్న
  • ఎంపీ సీఎం రమేష్‌ రూ.30 లక్షల విరాళం
  • ఎంపీలు అప్పలనాయుడు, మస్తాన్‌రావు చెరో రూ.10 లక్షలు
  • పాల్గొన్న మంత్రులు అనిత, కొల్లు, దుర్గేష్‌

గొలుగొండ (చైతన్యరథం): బ్రిటీష్‌వారిని ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు ధైర్యం, శౌర్యం అందరికీ స్ఫూర్తి దాయకమని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్‌, ఎంపీలు సీఎం రమేష్‌, కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌, ఎస్పీ తుహీన్‌ సిన్హా , తదితరులు హాజరయ్యారు. తొలుత అల్లూరి సీతారామరాజు, మల్లుదొర సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన సభలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు గెజిట్‌ జారీ చేసిన సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరి పార్కును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రికి కోరినట్టు వెల్లడిరచారు. పార్కు అభివృద్ధికి గతంలో మాజీ ఎంపీ మేరీ విజయ్‌కుమారి నాంది పలికినట్టు గుర్తు చేశారు. అప్పట్లో రూ.20 లక్షలతో అభివృద్ధి చేసినా, తర్వాత గత ప్రభుత్వం నుంచి నిధులు అందలేదన్నారు. దాతల సహకారంతో ఇప్పటివరకు అభివృద్ధి చేశామని, ఈ దఫా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మస్తాన్‌రావు యాదవ్‌ రూ.10 లక్షలు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రూ.10 లక్షలు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ రూ.30 లక్షలు పార్క్‌ అభివృద్ధికి నిధులు ప్రకటించడంతో వారికి స్పీకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సోలార్‌ వ్యవస్థ ద్వారా విద్యుత్‌ సరఫరా, శిథిలమైన ప్రొజెక్టర్‌ రూమ్‌ స్లాబ్‌కు మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వారికి అధికారికంగా ఇప్పటివరకు జీతభత్యాలు లేవని, దాతల సహకారంతోనే వారికి జీతాలు అందిస్తున్నట్లు తెలిపారు. వారికి పర్యటకశాఖ తరుపున జీతాలు అందేలా చూడాలని స్పీకర్‌ కోరారు.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ మాట్లాడుతూ, పార్కు అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు సమీకరించి సహాయం చేస్తానని తెలిపారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, అల్లూరి పోరాటం యువతకు స్పూర్తిగా నిలవాలని, పార్కు అభివృద్ధికి తన వంతుగా ఇచ్చిన రూ.10 లక్షలు బాధ్యతగా వినియోగించాలని ఆకాంక్షించారు.
హోం మినిస్టర్‌ వంగలపూడి అనిత మాట్లాడుతూ, అల్లూరి పోరాట స్ఫూర్తిని యువతకు చేరవేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గంజాయి వినియోగాన్ని ప్రోత్సహించేవారికి పథకాలు నిరాకరించే అంశం పరిశీలనలో ఉందన్నారు. పార్కు అభివృద్ధికి తన నిధుల నుంచి రూ.5 లక్షలు ప్రకటించారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అల్లూరిని రియల్‌ హీరోగా అభివర్ణించారు. యువతకు ఆయన ఆదర్శమన్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి నాయకత్వంలో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన పోరాట ప్రదేశాన్ని స్మారకంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడిరచారు. జిల్లా పర్యాటక ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌ మాట్లాడుతూ, అల్లూరి బ్రిటిష్‌ వారిని ఎదిరించిన మహోన్నత యోధుడని పేర్కొన్నారు. సీఎం ప్రవేశపెట్టిన పీ4 కార్యక్రమం పేదలకు అండగా నిలుస్తుందని అన్నారు.
జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్‌ఛారి, రాజన్న సూర్య చంద్ర, సర్పంచ్‌ లోచుల సుజాత, టీడీపీ మండల అధ్యక్షుడు అడిగర్ల నాని బాబు, మాజీ జెడ్పీటీసీ వేణు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

Previous Post

నీచ రాజకీయాలు జగన్‌ రెడ్డి నైజం

Next Post

ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist