- తెలుగు ప్రజల మధ్య చిచ్చుకు కుట్రలు
- హైదరాబాద్లో ఆస్తుల రక్షణ కోసం జగన్ దోస్తీ
- కరపత్రికల్లో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం
- రాష్ట్రం నాశనానికి కంకణం కట్టుకున్నారు
- స్వార్థ రాజకీయాలు..డ్రామాలు మానుకోవాలి
- రాయలసీమ లిఫ్ట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు
- ఎన్జీటీ అడ్డుకున్నప్పుడు ఎందుకు క్లియర్ చేయలేదు
- రూ.1000 కోట్లు పెద్దిరెడ్డి దోచుకున్నారు
- ఓడించినా ఆ రెండు పార్టీలకు బుద్ధి రాలేదు
- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): తెలుగు రాష్ట్రాలు బాగుండాలి.. రైతులు బాగుండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానం అయితే.. తెలుగు రాష్ట్రాలు నాశనం కావాలన్న ఆలోచన లో వైసీపీ, బీఆర్ఎస్ లు వ్యవహరిస్తున్నాయని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు అన్న స్టేట్స్ మెన్ చంద్రబాబు. మన స్వార్ధ రాజకీయాలు మనకు ముఖ్యం తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలకు కాదు అన్న విధంగా వైసీపీ-బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. పోలవరం ఒక మీటర్ తగ్గించుకుంటే ఏం మునిగిపోతుందని అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతాడు. కేసీఆర్ వ్యాఖ్యలను అప్పటి సీఎం జగన్ ఖండించాల్సింది పోయి.. అసెంబ్లీలో పొగడ్త లతో ముంచెత్తుతాడు. కేసీఆర్కు ఉన్న మెగ్నానమిటీపై జగన్ అసెంబ్లీలో మాట్లాడుతారు. నేడు అదే జగన్రెడ్డి రాయలసీమ లిఫ్ట్ డ్రామా పేరుతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు కలిసి పని చేస్తే అది మంచి కోసం జరగాలి కానీ స్వార్ధ రాజకీయాల కోసం జగన్, బీఆర్ఎస్లు పనిచేస్తున్నాయి. ఏపీలో మళ్లీ జగన్ వస్తాడంటూ ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. జగన్ వస్తే ఎన్ని కుట్రలు అయినా ఏపీలో చేయవచ్చనేది బీఆర్ ఎస్ కుట్రలో భాగం. జగన్ పుట్టినరోజు నాడు తాడేపల్లి ప్యాలెస్ గేటు బయట కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫొటోలతో ఫ్లెక్సీలు పెడతా రు. జగన్ నాంపల్లికి వెళితే బీఆర్ఎస్ నాయకులు స్వాగత బ్యాన ర్లు కడతారు. కేటీఆర్ ఖమ్మం వస్తే వైసీపీ నాయకులు బ్యానర్లు కట్టి స్వాగతం పలుకుతారని వ్యాఖ్యానించారు.
విద్వేషాలు రెచ్చగొట్టేలా సాక్షి, నమస్తే తెలంగాణలో కథనాలు
రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రాజెక్టులపై నమస్తే తెలంగాణ, సాక్షిలు తప్పుడు కథనాలు రాస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేలా సాక్షి, నమస్తే తెలంగాణ వ్యవహ రిస్తున్నాయి. తెలంగాణ నీటికి చంద్రబాబు అడ్డుపడుతున్నాడంటూ నమస్తే తెలంగాణ తప్పుడు కథనం ప్రచురిస్తుంది. సీమకు బాబు ద్రోహం చేస్తున్నాడు. తెలంగాణకు న్యాయం చేస్తున్నాడంటూ సాక్షి లో తప్పుడు కథనం రాస్తారు. సాక్షి, నమస్తే తెలంగాణలో ఒకే రకమైన తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయి. రెండు పత్రికలు, రెండు పార్టీలు, రెండు కుటుంబాలు కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజ లను మోసం చేస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ను ఆపింది మేమే అంటూ హరీష్ రావు మాట్లాడిన వార్తను నమస్తే తెలంగాణలో రాస్తారు. సీమ లిఫ్ట్ను నేనే ఆపించానంటూ సీఎం రేవంత్ మాట్లా డినట్టు సాక్షిలో రాస్తారు. వాళ్లని నిలదీయకుండా జగన్రెడ్డి తప్పుడు కథనాలతో ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాడు. నీ రాష్ట్రంలో నీ డ్రామా నువ్వు ఆడు, నా రాష్ట్రంలో నా డ్రామా నేను ఆడుతా అంటూ జగన్, కేసీఆర్ు వ్యవహరిస్తున్నారు. గత వారం రోజులుగా నమస్తే తెలంగాణ, సాక్షి రెండు తెలుగు రాష్ట్రా ల్లో కుట్రలకు తెరతీశాయని ధ్వజమెత్తారు.
చర్చలతో సమస్యలు పరిష్కారం.. అదే మా విధానం
16 తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు చేసి అడ్డు కుంటున్నాడంటూ నమస్తే తెలంగాణలో కథనం రాస్తారు. తెలం గాణలో మరో 16 ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు అడ్డుకోవ డం లేదంటూ సాక్షిలో తప్పుడు కథనం రాస్తారు. చంద్రబాబు అడ్డుకుంటున్నారని నమస్తే తెలంగాణ రాస్తుంది. కాదు కాదు అడ్డుకోవడం లేదని సాక్షి రాస్తుంది? ఆంధ్ర నీటి దోపిడీ కొనసా గుతుందంటూ నమస్తే తెలంగాణలో కథనాలు రాస్తారు. జగన్ ఏమో నీళ్లన్ని తెలంగాణకే చంద్రబాబు అప్పగిస్తున్నారంటూ వ్యాఖ్య లు చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపి రాజకీయ పబ్బం కోసమే వైసీపీ, బీఆర్ఎస్ లు వ్యవహరిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వివాదాలు లేకుండా కలిసి కూర్చొని మాట్లాడు కోవాలన్నది కూటమి ప్రభుత్వ విధానం. రాయలసీమకు నీరు ఇచ్చేందుకు తెలంగాణ రైతాంగాన్ని కలుపుకుని ముందుకు వెళ్లాల న్నది మా విధానం. రాయలసీను ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు క్లియర్ చేయించలేదు? 2020లోనే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కౌంటర్ దాఖలు చేయ లేదు.. సమాధానం చెప్పలేదు? ప్రాజెక్టు నిర్మాణాన్నే కొనసాగిం చడం లేదు.. కేవలం డీపీఆర్ కోసమే అంటూ చెప్పారు.
మరో సారి సాగునీటి కోసం కాదు తాగునీటి కోసం అంటూ జీఓ ఇస్తారు. దాదాపు రాయలసీమ లిఫ్ట్ పేరుతో రూ.1000 కోట్లు పెద్దిరెడ్డి దోచుకున్నారు. అందుకే మిథున్రెడ్డి ఆస్తులు పెరిగాయి. కేవలం చేపల పులుసు, విందులు వినోదాలకు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వరు.హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు, ప్యాలెస్ల కోసం బీఆర్ఎస్ దోస్తుల కోసం జగన్ పని చేస్తున్నాడు. జగన్, బీఆర్ఎస్ కుట్రలను గ్రహించే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా వాళ్ల బుద్ధి మారలేదు. విద్వేషాలు రెచ్చగొట్టడం కాకుండా.. రెండు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడండి. రెండు రాష్ట్రాలు బాగుండాలి, రెండు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిలో ముందుండాలని చెప్పిన నిజమైన స్టేట్స్మెన్ చంద్రబాబు. స్వార్థ రాజకీయాల కోసం రెచ్చ గొట్టే వ్యాఖ్యలను ప్రజలు గ్రహించి ప్రభావితం కారాదని విజ్ఞప్తి చేశారు.















