- మాస్ జాతర పాట ఆవిష్కరణ
- కుప్పం కార్యకర్తల సమక్షంలో విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కుప్పం (చైతన్యరథం): జనహితం కోసం యువనేత లోకేష్ పడ్డ ఆరాటంలోని భావోద్వేగ క్షణాల సమాహారంతో.. యువగళానికి మూడేళ్లు నిండిన సందర్భంగా, కుప్పం కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆదివారం అద్భుత మాస్ జాతర పాటను ఆవిష్కరించారు. మా కుప్పం గంగజాతర కోసమే ఈ పాట పుట్టిందని భావిస్తున్నాం అంటూ అక్కడి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామాయణంలో.. మారీచ, సుబాహుల నుండి యాగ రక్షణ చేయడానికి విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముడు వెళ్ళాడు. ఆకాశం నుండి రక్తాన్ని, మాంసాన్ని కురిపించి యజ్ఞకుండాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నించిన మారీచుడిని సముద్రంలో పడిపోయేలా చేసి, సుబాహుడిని సంహరించి యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేయించి.. ఆశీస్సులుగా దివ్యాస్త్రాలు పొంది శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చారు.
నాడు రామాయణంలో అది జరిగితే.. ఐదేళ్లపాటు తిరుమల నుండి అమరావతి వరకు అపవిత్రం చేస్తూ, కుప్పం నుండి శ్రీకాకుళం వరకు విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను హింసిస్తున్న పరిస్థితులలో… యువగళమై ఎదురునిలిచి అడుగులు వేశారు యువనేత లోకేష్, పాదయాత్రలో దుర్మార్గులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ‘దారి ఇస్తే పాదయాత్ర.. లేదంటే దండయాత్ర’ అంటూ ఆంధ్రాకు ధైర్యమై నిలిచారు. శత్రువు అసెంబ్లీలో అడుగుపెట్టడానికే భయపడేలా విజయం సాధించి రాష్ట్రాన్ని రక్షించారు. గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజాల నుండి దేశీయ మల్టీనేషనల్ కంపెనీల వరకు పెట్టుబడులను మన రాష్ట్రానికి తెస్తూ, యువత ఆశలను ‘ఉద్యోగ అస్త్రాలుగా’ మలుస్తున్నారు. ఇవన్నీ వివరిస్తూ కట్టా సుధీర్ ఈ ఇవన్నీ వివరిస్తూ కట్టా సుధీర్ ఈ మాస్ జాతర పాటను రూపొందించారు. ఈ పాట వెనుక ఒక గొప్ప తపన ఉంది. ఎన్నికల ముందు ‘ధూం ధాం’ లాంటి 40కి పైగా పాటలను టీడీపీకి అందించిన కట్టా సుధీర్, తన తండ్రి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా (తరువాత ఆయన కన్నుమూశారు).. ఖమ్మం దగ్గరి మధిర నుండి హైదరాబాద్ వెళ్లి, మనసు పెట్టి ఈ పాటను రికార్డ్ చేసి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.















