- అతిసార, కల్తీ పాల ఘటనలపై సమీక్ష
- బాధితులకు వైద్యచికిత్సలపై ఆరా
అమరావతి(చైతన్యరథం): ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి..ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దని ముఖ్యమంత్రి చంద్రబా బు ఆదేశించారు. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై బుధవారం వైౖద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో సమీక్షించారు. శ్రీకాకుళం, రాజ మండ్రి ఘటనల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో సీరియస్ కండిషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న ఇద్దరి బాధి తుల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఒకరు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని.. మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు వివరించారు. వారిద్దరి వైద్యచికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. శ్రీకా కుళం ఘటనలో ప్రస్తుతానికి 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికి త్స పొందుతున్నారని తెలిపిన అధికారులు.. ఇద్దరు మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. పైపులైన్ ద్వారా నీటి సరఫరాను ఆపేశామని.. ప్రత్యామ్నాయాల ద్వారా సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. రాజమండ్రి పాల ఘటనలో బాధితులు నిరంతర వైద్యుల పర్యవే క్షణలో ఉన్నారని చెప్పారు. పాల శాంపిళ్లను ఇప్పటికే ల్యాబ్‌కు పంపామని, శాఖపరంగా దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని వెల్లడిం చారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దని..ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.













