- ఎత్తిపోతలపై వైసీపీ దుష్ప్రచారం
- ఆగిపోవడానికి జగన్‌రెడ్డే కారణం
- లిఫ్ట్ పేరు చెప్పి చుక్క నీరూ ఇవ్వలేదు
- జేబులు నింపుకోవడానికే పనులు చేశారు
- సీమ ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.14 వేల కోట్లు
- మండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు
- ఆధారాలు, తేదీలతో సమగ్ర వివరణ
- ఎదురు ప్రశ్నలతో వైసీపీ సభ్యులకు కౌంటర్
అమరావతి(చైతన్యరథం): రాయలసీమ ఎత్తిపోతల పథకం మధ్యలో ఆగిపోవడానికి ముమ్మాటికీ జగన్‌రెడ్డే కారణమని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఈ ఎత్తిపోతల పథకం వెనుకున్న ఆంతర్యాన్ని ఎండగట్టారు. తేదీలు, జీవో నెంబర్లు, ఎన్జీటీ ఉత్తర్వులు సహా చూపించి నిజాలు నిగ్గు తేల్చారు. గురువారం శాసనమండలిలో వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రామానాయుడు సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. సీమ ఎత్తిపోతల పథకాన్ని నాటి సీఎం జగన్ సీమ ప్రజల కోసం కాకుండా స్వీయ ప్రయోజనాల కోసం రూపకల్పన చేసి అవసర మైన అనుమతులు లేకుండా వడివడిగా ప్రారంభించినట్టు చెప్పా రు. రాయలసీమ లిఫ్ట్ పేరుచెప్పి గుంతలు, మట్టి వంటి పనులు చేసి ఐదేళ్లలో ఒక్క చుక్క నీరు కూడా తీసుకురాలేదు. గాలేరు-నగరికి హంద్రీనీవా లింక్ పేరు చెప్పి పైపులు తెచ్చి ప్రాజెక్టు సైట్ లో పెట్టారు..తరువాత మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు చేసుకున్నారు. ఇక్కడ కూడా ఒక్క చుక్కనీరు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఆవులపల్లి, బుదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల పేరు చెప్పి మట్టి పనులు చేశారు. ఈ పనులకు పర్యావరణ అనుమతులు లేకపోవడంతో రూ.100 కోట్ల జరిమానా విధించిం ది. ఇలా కేవలం జేబులు నింపుకోవడానికే చేసిన పనులు తప్ప, రాయలసీమపై ప్రేమతో కాదని తేల్చి చెప్పారు. రాయలసీమకు ద్రోహం చేసింది ఎవరో ప్రజలే తేల్చి చెబుతున్నారని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఈ ఏడాది 203 టీఎంసీల నీటిని తీసుకుని రాయలసీమకు తరలించాం. రాయలసీమకు ఎంతో కీలకమైన గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంటే, కడప జిల్లా కు, పులివెందులకు నీళ్లు రావని తెలిసినా కూడా మరమ్మతులకు రూ.60 కోట్ల నిధులు కావాలని అధికారులు కోరినా గత ముఖ్య మంత్రి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు.
బురద చల్లాలని అనుకోవటం మీ అవివేకం
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురద చల్లాలని అనుకోవటం మీ అవివేకమని ఖండించారు. ఆ మాటకొస్తే అప్పటి టీìఆరఎస్ మంత్రి హరీష్‌రావు, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి మేమే సీమ ఎత్తిపోతల పథకం ఆపించామని చెప్పారు. నీళ్లు కావా లా, రాజకీయ ప్రయోజనాలు కావాలా అని అడిగితే నాడు జగన్‌రె డ్డి నీళ్లకు, నీళ్లు వదిలేశారని వార్తలు వచ్చాయని చెప్పారు. దీనికి మీరేం సమాధానం చెబుతారని వైసీపీ సభ్యులను నిలదీశారు. పొరుగు రాష్ట్ర నేతలు వారి రాజకీయ లబ్ధి కోసం ఏవేవో అంటా రు.. మాట్లాడుతారు. కానీ ఇక్కడున్న మీరు వాస్తవాలు ఆధారంగా మాట్లాడాలి కదా ప్రశ్నించారు.
ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి వాస్తవం కాదా?
అసలు సీమ ఎత్తిపోతల పథకం ఎందుకు ఆగింది, ఎవరి హయాంలో ఆగింది? తెలిసే మాట్లాడుతున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. 2020 ఫిబ్రవరి 20న అధికారంలో ఉన్నది. జగన్‌రె డ్డా, చంద్రబాబా అని ప్రశ్నించారు. అదే ఏడాది అక్టోబర్ 29న ఈ ప్రాజెక్టుకి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులు ఇచ్చిన సంగతి వాస్తవమా? కాదా? అంటూ ఆ ఉత్తర్వులు ప్రతుల్ని చూపించారు. అయినా వైకాపా ప్రభుత్వం స్వార్థ చింతనతో ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘిం చి పనులు ప్రారంభించిందన్నారు. దీంతో 2021 జూలై 7వ తేదీన ఎన్జీటీ స్పందించి డీపీఆర్‌కి విరుద్ధంగా జరిగిన అన్ని పనులను నిలిపివేయమని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన సంగతి శాసన మం డలి దృష్టికి తీసుకువచ్చారు.
అధికారంలో ఉంది మీరే..నిద్రపోయారా?
అప్పుడు వైకాపా ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, మరి నిద్రపోయారా అంటూ నిలదీశారు. చేసిన తప్పు సరిదిద్దుకోవటా నికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉద్దేశం సాగునీటికి కాదు, కేవలం తాగునీటి కోసం మాత్రమే అని 2023 ఆగస్టు 11వ తేదీన 364 జీవో ద్వారా అఫిడవిట్ ఇచ్చి లిఖితపూర్వక అబద్ధం ఆడింది మీరు కదా అని రామానాయుడు వాస్తవాలను సభ ముందు ఉంచారు. ఆ తదనంతరం 2024 మార్చి 22వ తేదీ తమ ఉత్తర్వులు కాదని పనులు చేపట్టినందుకు ఎన్జీటీ 2.65 కోట్లు జరిమానా విధించిందని చెప్పారు. అప్పుడు ఉన్నది వైకాపా ప్రభుత్వమే కదా..చంద్రబాబుకు ఏ రకంగా ఈ ప్రాజెక్టు సంబం ధం ఉంది? అని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020లో మొదలెట్టి ఆ తరువాత నాలుగేళ్లపాటు అధికారంలో ఉండి కూడా పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి కాదా అంటూ ధ్వజమెత్తారు. కాబట్టి రాయల సీమ ద్రోహి జగనే అంటూ స్పష్టం చేశారు. 2014 -19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ జల వనరులకు గాను బడ్జెట్లో రూ.14 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 2019- 24 మధ్య వైకాపా ప్రభుత్వం కేవలం రూ.2000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు.
సీమ ప్రాజెక్టులు కళకళ
రాయలసీమలోని 17 లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులను కంటిన్యూ చేస్తున్నామని, రూ.3,850 కోట్ల వ్యయంతో హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలని 730 కిలోమీటర్లు తీసుకెళ్లి శివారు భూములను సైతం సస్యశ్యామలం చేస్తున్నామని వివరించారు. నేడు సీమలోని జలాశయాలన్నీ నిండుకుండల్లా జలకళతో చూడముచ్చటగా ఉన్నా యన్నారు. నాటి కృష్ణదేవరాయల కాలంలో తటాకాలన్నీ ఏ మాదిరిగా ఉన్నాయో నేడు చంద్రబాబు హయాంలో కూడా రిజర్వాయర్లన్నీ అదే మాదిరిగా ఉన్నాయని పేర్కొన్నారు.













