విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖలో రెండురోజుల కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు యువత ఘన స్వాగతం పలికింది. ‘వెల్కమ్ గూగుల్.. థాంక్యూ లోకేష’ అంటూ నినాదాలతో విశాఖ మార్మోగింది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలిసారి విశాఖ పర్యటనకు వచ్చిన లోకేష్.. ఎయిర్‌పోర్టులో దిగడంతోనే పరిసరాలు మార్మోగేలా నినాదాలు మిన్నంటాయి. విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్‌కు పెద్దఎత్తున టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ప్రతిఒక్కరినీ కలిసి ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. ప్లకార్డులు చేతబూని మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన యువతను పలకరించారు. టీడీపీ నేత చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ (వైజాగ్)’ అంటూ ప్లకార్డులు చేతబూని మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ తరలి వెళ్లారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్న పలువురు ప్రముఖులకు సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. వర్శిటీ శతాబ్ది ఉత్సవాల అనంతరం `రాత్రికి నోవాటెల్ హోటల్‌లో గూగుల్ ప్రతినిధుల గౌరవార్థం తేనీటి విందులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు















