- చేనేతలకు ఆదాయం, ఆరోగ్యం కూటమి లక్ష్యం
- త్వరలో యూనివర్శల్ హెల్త్ పాలసీ తీసుకొస్తాం
- కుటుంబాలకు మంత్రి సవిత ఆత్మీయ పలకరింపు
సోమందేపల్లి/శ్రీసత్యసాయి(చైతన్యరథం): చేనేతలకు ఏడాదిపాటు అధిక ఆదాయం తో కూడిన ఉపాధికల్పనతో ఆరోగ్య రక్ష ణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తు న్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఉచిత విద్యుత్ పథకంతో నేత న్నలకు ఆర్థిక వెసులుబాటు కలిగింద న్నారు. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులను పెంచడంతోపాటు నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా టెక్స్ టైల్స్ పార్కులు, మెగా, మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన చేనేతల కు ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవకాశమిస్తు న్నామని వివరించారు. శ్రీసత్యసాయిజిల్లా సోమందే పల్లి మండలం కొత్తపల్లిలో పలువురు చేనేత కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి మంత్రి సవిత ఆదివారం పలుకరించారు. చేనేతలకు మంత్రి సవిత స్వయంగా కరెంట్ బిల్లు అందజేశారు.
ఉచిత విద్యుత్ పథకం అమలువల్ల కలి గిన లాభాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు ఆయా చేనేత కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా తమకు ఆర్థిక మేలు జరి గిందన్నారు. జీరో పేమెంట్ విద్యుత్ బిల్లు లను మంత్రికి చూపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు చేనేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ నేతన్నలకు ఏడాదంతా ఉపాధి కల్పించడంతోపాటు అధిక ఆదాయంతో కూడిన ఆరోగ్య రక్షణకు ప్రాధాన్య మిస్తున్నామని వివరించారు. ఇందుకోసం యూనివర్శల్ హెల్త్ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. అనంతరం మంత్రి సవితను చేనేత కుటుంబాలు ఘనంగా సత్కరించాయి. ఈ

















