- ప్రైవేటుకు పోటీగా ప్రభుత్వ బడుల్లో ఫలితాలు
- కూటమి ఆధ్వర్యంలో విద్యారంగంలో సంచలనాలు
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చర్యల కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా రని మంత్రి పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల ర్యాంకు లతో ప్రకటనలు ఇచ్చేవని, ఇప్పుడు నారా లోకేష్ చొరవతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రభు త్వం ప్రకటనలు ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వపాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం గా జరుగుతోందని తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాలలో 23 మంది విద్యార్థులకు, వెంపరాల ప్రభుత్వ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. వెంపరాల ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన స్మారక కళావేదికను మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఝాన్సీ నాగ వెంకట సాయిశ్రీను సత్కరించారు.
రూ.5.10 కోట్ల వ్యయంతో శాంతినగర్ నుంచి ఏలేశ్వరవారిపాలెం వరకు నిర్మించి న బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అదేవిధంగా రూ.1.15 కోట్లతో ఉప్పలపాడు, మైలవరం, వెంపరాలలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అద్దంకి నియోజక వర్గంలో ఆర్డీఎస్ఎస్ పథకం కింద కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నా మని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.

















