- రూ.3000 కోట్లతో SAEL సిద్ధం
- 11 నెలల్లోనే పూర్తి చేసుకుని రికార్డ్
- ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కింద తొలి ప్రాజెక్ట్
- కూటమి ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మక విజయం
- భారీస్థాయిలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి శ్రీకారం
- ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేష్ హర్షం
అమరావతి(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024’ కింద తొలి భారీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి అయింది. రాయలసీమలో SAEL(సస్టైనబుల్ ఎఫర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్) సంస్థ ఏర్పాటు చేసిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రికార్డు స్థాయిలో కేవలం 11 నెల ల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని.. ఈ నెల 22న ప్రారంభం కానుం ది. కాగా, ఈ ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మక విజయంగా నిలిచింది. ఈ ప్రాజెక్టుపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశా రు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశ స్వచ్ఛ ఇంధన రాజధానిగా నిలబె ట్టడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మరోవైపు SAEL నిర్మాణం పూర్తికావడంపై మంత్రి లోకేష్ స్పందించారు. రూ.3 వేల కోట్ల పెట్టుబడి, 600 మెగావాట్ల సామ ర్థ్యంతో రికార్డు స్థాయిలో ప్రాజెక్టు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. కేవలం 11 నెలల్లో పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. SAEL భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు మే 22న రాయలసీమలో ప్రారంభం కానుందన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మేము కేవలం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మాత్రమే చేయం, రికార్డులనూ బద్దలు కొడతాం’ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. కాగా, రాయలసీమలో ఎసఏఈఎల్ ఏర్పాటు చేసిన ఈ మెగా సోలార్ ప్రాజెక్టుతో భారీ స్థాయిలో గ్రీన్ పవర్ ఉత్పత్తి జరగనుంది. దీంతో స్థానిక యువ తకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.













