- అధికారుల పనితీరుపై 360 డిగ్రీల్లో విశ్లేషణ
- ఫిర్యాదులను అర్జీదారులే ట్రాక్ చేసేలా కొత్త వ్యవస్థ
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ప్రతిఒక్క అధికారి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జూన్ నెల నుంచి అధికారులు క్షేత్రస్థాయి పర్యట నలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. బుధవారం సచివాల యంలో ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించా రు. పాలనా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది. తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. లోపాలు ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా సరిచేయాలనే అంశం మీద ఫోకస్ పెట్టాను. అధికారులు, ఉద్యోగులు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని ఆదేశించారు. ఫీల్డ్‌లోని సమస్యలను స్వయంగా పరిశీలిస్తే అధికార యంత్రాంగం మీద ప్రజల్లో మరిం త నమ్మకాన్ని పొందగలం. తనిఖీలు చేస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. ఆ దిశగా ఉన్నతాధికారులు మొదలకుని క్షేత్రస్థాయి అధికారి వరకు అందరూ పనిచేయాలని, జూలై నెల నుంచి ప్రతి అధికారి ఫీల్డుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. వారంలో మూడురోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే చెప్పాం. దాన్ని తూచా తప్పకుండా అమలుచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలని గతంలోనే సూచించాం. దాన్ని పక్కాగా అమలుచేయాలి. అలాగే నియోజకవర్గాల నోడల్ అధికారులు నెలలో ఒకే మండలాన్ని నాలుగుసార్లు సందర్శించాలి. అధికారు లు, ఉద్యోగుల పనితీరుపై 360 డిగ్రీల్లో విశ్లేషిస్తామని చెప్పారు.
దేవాదాయ శాఖ పనితీరు మరింత మెరుగవ్వాలి
దేవాలయాల్లో భక్తులకు మరింత సేవలు అందించేలా దేవదా య శాఖ మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం కన్పిస్తోంది. దేవదాయ శాఖ ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపడాలి. అన్ని శాఖల్లోని ఉద్యోగుల పనితీరు ఎప్పటికప్పుడు మెరుగుపడా లి. ఈ మేరకు ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇప్పించాలి. పరిపాలనలో సింగపూర్ దేశం వినూత్న విధానాలను అవలంభి స్తోంది. పరిపాలన విషయంలో ఆ దేశ విధానాలను పరిశీలించా లి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మొత్తంగా 11,600 గుంతలు ఉన్నట్టు గుర్తించాం. వీటిల్లో 79 శాతం గుంతలను పూడ్చాం. మిగిలిన రోడ్లను కూడా త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలి. ముఖ్యంగా అర్బన్-రూరల్ కనెక్టివిటీ రోడ్లల్లో మరమ్మతులు త్వరగా చేపట్టాలి. అలాగే రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు సంబం ధించి ఆర్ అండ్ బీ మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
గవర్నెన్స్‌కు టెక్నాలజీ కనెక్ట్..గూగుల్ అంగీకారం
డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌లో గూగుల్ మనతో కలిసి పని చేయ డానికి అంగీకరించింది. వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే గూగుల్ తో కలిసి పనిచేస్తోంది. ఆ దిశగా మిగిలిన శాఖల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పీజీఆరఎస్‌లో ప్రజలిచ్చిన ఫిర్యాదు లను త్వరితగతిన పరిష్కరించాలి. ఈ మేరకు అర్జీదారులే స్వయంగా వారి అర్జీలను ట్రాక్ చేసుకునే అవకాశం కల్పించాలి. తామిచ్చిన ఫిర్యాదు ఏ మేరకు పరిష్కారమవుతోందోననే అంశాన్ని అర్జీదారులకు అర్థమయ్యేలా ట్రాకింగ్ విధానాన్ని అందుబా టులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.
















