విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను దళవాయి రమాదేవి, కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను దళవాయి రమాదేవి, కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, క్షేత్రస్థాయి కార్యకర్తగా తన సేవలను గుర్తించి, శాసనమండలి సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే నిజమైన కార్యకర్తలను, నాయకులను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని, రమాదేవిని అభినందించారు.