భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు.
భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. రాష్ట్రంలో అంధుల క్రికెట్ అభివృద్ధితో పాటు గతంలో రాష్ట్రం తరపున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అంధ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.