- రెండేళ్ల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు
- న్యాయశాఖ మంత్రి ఫరూక్ వెల్లడి
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ కత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా సంక్షేమం, సామా జిక న్యాయం, మైనారిటీల సాధికారత, పారదర్శక న్యాయపాల నకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధి కార్యక్రమా లను విజయవంతంగా అమలు చేస్తోందని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ తెలిపారు. గురువారం సచివాలయం ప్రచార విభాగంలో మీడియా సమావే శంలో తమ శాఖల్లో పురోగతిని వివరించారు. మైనారిటీల సాధికారత, సమాన న్యాయం, నాణ్యమైన న్యాయపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు మరింత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి పౌరుడికి న్యాయం, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మైనారిటీలకి రూ.16,147.23 కోట్ల భారీ బడ్జెట్
2024-25 నుంచి 2026-27 వరకు మైనారిటీల సంక్షేమ శాఖకు రూ.16,147.23 కోట్ల బడ్జెట్ కేటాయించాం. గత రెండేళ్లలో రూ.9,759.70 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందులో మైనారిటీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు రూ. 4,850.91 కోట్లు నేరుగా ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. విద్యే మైనారిటీల సాధికారతకు ప్రధాన సాధనంగా భావిస్తున్న ప్రభుత్వం తాలిమ్-ఎ-హునర్ పథకం ద్వారా 250 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రూ.6 కోట్ల వ్యయం తో కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యను అందిస్తోందన్నారు. ఆధునిక ఆన్‌లైన్ కోచింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు.
వక్ఫ్ ఆస్తుల రక్షణలో చారిత్రాత్మక చర్యలు
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణలో ప్రభుత్వం కీలక విజయా లు సాధించిందన్నారు. 1,500 వక్ఫ్ సంస్థల సర్వేను పూర్తి చేయడంతో పాటు, 88 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తొలిసారిగా 616.65 ఎకరాల వక్ఫ్ భూమికి తహసీల్దార్ల ద్వారా లీజు వేలం నిర్వహించగా 5,028 వక్ఫ్ సంస్థల వివరాలను సెంట్రల్ పోర్టల్‌లో నమోదు చేయడం జరిగిందని వివరించారు. అలాగే వక్ఫ్ సంస్థల నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.5.74 కోట్లు విడుదల చేసి వాటి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిం దని తెలిపారు. హజ్ యాత్రికులకు అత్యుత్తమ సేవలు అందిస్తూ హజ్-2025లో 1,630 మంది, హజ్-2026లో 1,990 మంది యాత్రికులు విజయవంతంగా యాత్ర పూర్తి చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. వక్ఫ్ బోర్డు, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీలకు చైర్మన్లు, సభ్యులను నియమించామని తెలిపారు. శ్మశానవాటికలు, ఈద్గా స్థలాల కేటాయింపు, ప్రభుత్వ ఖాజీల నియామకం, పాస్టర్ల మ్యారేజ్ లైసెన్స్ చెల్లుబాటు గడువును మÖడేళ్ల నుంచి 10 సంవత్సరాలకు పెంచే ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు.
న్యాయపాలన బలోపేతానికి సంస్కరణలు
గత రెండేళ్లలో వేగవంతమైన, పారదర్శకమైన న్యాయపాలన కోసం విస్తృత సంస్కరణలు అమలు చేయడం జరిగిందని వివరిం చారు. రూ.216 కోట్లతో కోర్టుల మౌలికవసతుల అభివృద్ధికి అనుమతులు, 1,173 మంది మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.46.92 కోట్ల ఆర్థిక సహాయం, న్యాయమిత్ర పథకంలో స్టైఫండ్‌ను రూ.5,000 నుంచి రూ.10,000కు పెంపు, 19 చట్టాల సమీక్ష ద్వారా 16 చట్టాల్లో వివక్షాత్మక నిబంధనల తొలగింపు, ఆంధ్రప్రదేశ్ జన విశ్వాస్ చట్టం-2026 రూపకల్పన, 10,750 ఫైళ్ల సకాల పరిష్కారం, 70 చట్టాలు, 18 ఆర్డినెన్సుల రూపకల్పన, తెలుగు అనువాదం వంటి కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరిగిందని వివరించారు.
న్యాయవాదుల సంక్షేమం- కోర్టుల బలోపేతం
న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ లా ఆఫీసర్ల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచాం. హైకోర్టు న్యాయమూర్తుల గ్రాట్యుటీని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాం. అలాగే 263 మంది ప్రభుత్వ న్యాయా ధికారులను నియమించి రూ.31.58 కోట్ల గౌరవ వేతనాలు చెల్లించడంతో పాటు 86 మంది ఏజీపీ గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచడం జరిగిందని తెలిపారు. స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం, భత్యాలు పెంచడంతో పాటు 216 పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి రూ.5.91 కోట్లు కేటా యించామని వివరించారు. అదేవిధంగా ఈ-కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టుల ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
2026-27 లక్ష్యాలు
2026-27 సంవత్సరంలో మైనారిటీల సంక్షేమం, న్యాయ పాలన, మౌలికవసతుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధా న్యత ఇవ్వనుందన్నారు. పీఎంజేవీకే కింద రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులు, రూ.205 కోట్లతో సుమారు 30,000 మందికి నైపుణ్య శిక్షణ, సబ్సిడీతో స్వయం ఉపాధి, పీఎం వికాస్ ద్వారా 1,500 మందికి శిక్షణ, 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1,770 మంది సిబ్బంది నియామకం, కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలతో విద్య, డిజిటల్ నైపుణ్యాలు, న్యాయపాలన, మౌలికవసతులు, మైనారిటీల సాధికా రతను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో లా సెక్రటరీ జి.ప్రతిభాదేవి, మైనారిటీ సెక్రటరీ బి.శ్రీధర్ పాల్గొన్నారు.
















