- ప్రతి అంశాన్ని అనుసంధానం చేయాలి
- డ్రగ్స్, గంజాయిలపై ఉక్కుపాదం మోపాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
- కుప్పం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సేవల ప్రారంభం
- పంచతత్వ కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ పరిశీలన
కుప్పం (చైతన్యరథం): సంజీవని కార్యక్రమంలో డేటా అను సంధానమే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ నుంచి ఆస్పత్రి పరిశుభ్రత వరకు ప్రతి అంశంపైనా అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో రెండో రోజైన శనివారం ఆయ న కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ కేంద్రా లను ప్రారంభించి సేవలను పరిశీలించారు. సంజీవని ప్రాజెక్టు అమలు, వైద్య ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, డ్రగ్స్ నివారణ చర్యలపై అధికారులతో మాట్లాడారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ప్రారంభిం చారు. సీటీ స్కాన్ ద్వారా రోజుకు ఎంతమందికి సేవలు అందిం చగలరని సీఎం ప్రశ్నించారు. రోజుకు 30-40 మందికి పరీక్షలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆస్పత్రి పరిశీలన సందర్భంగా ఆవరణలో కొంతమేర చెత్త కనిపించడంపై ప్రశ్నించి న ముఖ్యమంత్రి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. సంజీవని కార్యక్రమంలో డేటా అనుసంధానమే ముఖ్య మని పేర్కొన్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడంతో పాటు ప్రతి అంశంలోనూ డేటా ఇంటిగ్రేషన్ చేయాలని సూచిం చారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కుప్పం ఏరియా ఆస్పత్రికి డయాలసిస్ నిమిత్తం వస్తున్నారని అధికారులు వివరించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజలు సంతృప్తి చెందాలని, కుప్పంలో ప్రజలకు ఏ మేరకు మేలు కలిగిందో వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు
పంచతత్వ కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ను సీఎం చంద్రబాబు పరిశీలించి అక్కడ మొక్క నాటారు. వైద్య ఆరోగ్య రం గంలో వివిధ ఆవిష్కరణలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సంద ర్శించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వైద్యులకు తక్షణ సమా చారం అందించేలా ఓ పరికరాన్ని రూపొందించిన విద్యార్థిని అభినందించారు. గంజాయి, డ్రగ్స్ బారిన పడ్డవారికి మెడిటేషన్ ద్వారా ఆరోగ్యం మెరుగయ్యేందుకు సహకారం అందిస్తున్నట్టు బ్రహ్మకుమారీలు వివరించారు. డ్రగ్స్, గంజాయి మొదలైన వాటి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారు లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కుప్పం నగరంలో ఏర్పాటు చేసిన స్వర్ణ కుప్పం – స్వచ్ఛ కుప్పం స్వాగత ఆర్చిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరా వు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
















