- దానికి రాజకీయ పార్టీ లక్షణాలు లేవు
- ఫేక్ ప్రచారమే ఆ పార్టీ అస్త్రం
- కడప స్టీల్ ప్లాంట్ పేరుతో అవినీతి
- లక్షల కోట్ల సంపద ఆవిరైంది
- ఐఏఎస్ లు, వ్యాపారవేత్తలు నాశనమయ్యారు
- తెలంగాణలో ఆరుగురిని చంపిన
- హంతకుడికి, జగన్కు దగ్గరి పోలికలు
- ఏదో ఒకటి చేయించడం…
- బెంగళూరులో వెళ్లడం అలవాటైంది
- మీడియాతో చిట్ చాట్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): వైసీపీకి రాజకీయ పార్టీకి ఉండాల్సి న లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ. అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ నేర ప్రవృత్తి, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాల్సిన బాధ్యత మీడియా ఉందని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీకి రాజకీయ పార్టీ లక్షణాలు, ఆ పార్టీ అధినేతకు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు.. అందుకే తాను ఆ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నా.. వైసీపీ చరిత్ర అంతా రక్త చరిత్రేనని పేర్కొన్నారు. వైసీపీ పోకడలు, వారి ప్రవృత్తిని చూసిన ఎవరికైనా ఇది అర్థమవుతుందని వివరించారు. జగన్రెడ్డి, ఆయన కుటుంబం వల్ల అనేకమంది ఐఏఎస్ లు బల య్యారని, వ్యాపారవేత్తలను నాశనం చేశారని దుయ్యబట్టారు.
ఇప్పటికీ పెట్టుబడులు పెట్టే వారిని బెదిరిస్తూ పరిశ్రమలు తరిమే స్తామని చెబుతున్నారని, పరిశ్రమలు వచ్చి ఉపాధి కల్పన జరిగితే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయపడుతున్నారని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయింది. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయి.. అందుకే గొడ్డలి పార్టీలో టెన్షన్ మొదలైందని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ అరాచకాలపై సమాజంలోనూ మార్పురావాలని కోరారు. సొంత ప్రయోజనాలు, భూములు కొట్టేసే కుట్రలో భాగంగా రైతుల భూములను 22ఏలో పెట్టి ఇబ్బందులు గురి చేశారని, వాటిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. 22ఏలో పెట్టిన కార ణంగా గత ప్రభుత్వంలో రైతులు కనీసం యూరియా తెచ్చుకు నేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయిందని మండిపడ్డారు.
స్టీల్ ప్లాంట్ పేరుతో గనులు దోచారు
సొసైల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తిత హనన పోస్టుల కట్టడికి టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై ఇంకా వరవ్వుట్ చేస్తున్నామని వివరించారు. సోషల్ మీడియాను సమాజానికి పనికొచ్చే విధంగా కాకుండా వ్యక్తిత్వ హననాలకు ఉపయోగించడంతో పాటు, మహి ళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఇలాగే వదిలేస్తే సమాజానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. దీని కారణంగా మహిళలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి ఉండదన్నారు. బ్రాహ్మణీ స్టీల్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకున్న అంశంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఒక వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల సంపద ఆవిరైందని.. స్టీల్ ప్లాంట్ పేరుతో అక్రమ మైనింగ్కు పాల్పడ్డాంని మండిపడ్డారు. బ్రహ్మణీ స్టీల్ ప్లాంట్కు కేటాయించిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుందని, అయితే ఓబులాపురం మైనింగ్ అంశం ఇంకా ముగియలేదని తెలిపారు.
హిట్.. రన్.. ఎస్కేప్ గొడ్డలి పార్టీ నైజం
వైసీపీ అధినేత జగన్ నైజాన్ని ప్రస్తావించారు. హిట్, రన్ అండ్ ఎస్కేప్ గొడ్డలి పార్టీ నైజమని, ఇక్కడ ఏదో ఒకటి చేయించడం, వెళ్లి పక్క రాష్ట్రంలోని బెంగళూరులో ఉండటం అలవాటైందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని, పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఒక సైకో మనస్తత్వంతో ఆరుగురు హత్యకు గురయ్యారు. పోక్సో కేసు పెట్టారని బాధితురాలు, వారి కుటుంబాన్ని, కోపరేట్ చేయ లేదని సొంత కుటుంబాన్ని హత్య చేశాడు. సొంత బాబాయిని చంపడం, కన్న తల్లి, సొంత చెల్లి వ్యవహారాల్లో జగన్ వైఖరి ఏమిటో అంతా చూశాం. గొడ్డలి పార్టీ అధినేతకు, తెలంగాణలోని హంతకుడి మనస్తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
















