దక్షిణకొరియాలో విజయవంతమైన లోకేష్ పర్యటన
సంబంధాల బలోపేతంలో నూతన అధ్యాయం
వారంలో 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు
యువనేత స్పీడ్కు ఆశ్చర్యపోయిన కొరియన్ ప్రతినిధులు
పల్లి.. పల్లి మంత్రి అంటూ ప్రశంసల వర్షం
కొరియన్ స్ఫూర్తితో ముందుకు: లోకేష్ స్పందన
సియోల్ (దక్షిణకొరియా): భారత్-కొరియా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణకొరియా) ఆహ్వానం మేరకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన సౌత్ కొరియా పర్యటన విజయవంతమైంది. మంత్రి లోకేష్ బృందానికి దక్షిణ కొరియా ప్రభుత్వంతో పాటు అక్కడి పారిశ్రామిక వేత్తల నుంచి సముచిత గౌరవం లభించింది. ఎల్జీ లాంటి గ్లోబల్ కంపెనీలు ప్రత్యేకంగా తమ హెడ్ క్వార్టర్స్కు ఆహ్వానించి ఉన్నతస్థాయి బృందంతో గౌరవార్థం విందు ఇవ్వడం మంత్రి లోకేష్కు దక్కిన అరుదైన గౌరవం. ఈనెల 5 నుంచి 11 వరకు నిర్వహించిన అధికారిక పర్యటనలో 50కి పైగా కార్పోరేట్ సంస్థల నాయక త్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లోకేష్ కోరారు. తొలిరోజు సియోల్లో తెలుగు ప్రజలతో నిర్వహించి న ఆత్మీయ సమావేశంతో ప్రారంభమైన పర్యటన.. శుక్రవారం సీఐఐ ఆధ్వర్యాన పెట్టుబడిదారులతో నిర్వహించిన రోడ్తో ముగి సింది.
రాష్ట్రంతో ద్వైపాక్షిక, రాజకీయ, వాణిజ్య సహకారాన్ని బలోపేతం ప్రాధాన్యతను గుర్తిస్తూ, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి లోకేష్ను అధికారికంగా ఈ పర్యటనకు ఆహ్వానిం చింది. లోకేష్ జరిగిన చర్చల్లో ఎల్జీ, హ్యుందయ్, శాంసంగ్, బీఎన్కో ఫైనాన్షియల్ వంటి దిగ్గజ కొరియన్ కార్పోరేట్ సంస్థలు, తమ ఉన్నత నాయక త్వంతో సంప్రదించి ఆంద్ర “ప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన పారిశ్రా మిక విధానాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపా యాలు, అందజేస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి లోకేష్ ఇచ్చిన ప్రజెంటేషన్ తో వివిధ సంస్థల ప్రతినిధి బృందాలు ఫిదా అయ్యాయి. పర్యటన తొలిరోజున సియోల్లో భారత రాయబారి గౌరంగ లాల్ దాస్తో నిర్వహించిన మర్యాదపూ ర్వక భేటీలో కొరియా ప్రాధాన్యతారంగ పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ విజన్ను ఆవిష్కరించారు.
అపెక్స్-కొరియా సహాయ విభాగం ప్రారంభం
దక్షిణకొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్లో ఏపీఈ డీబీ ఆధ్వర్యాన అపెక్స్-కొరియా పేరిట పెట్టుబడిదారుల సహా యక, అనుసంధాన విభాగంను ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలకు నిదర్శనం. శ్రీసిటీ పరిసరాల్లో ఇప్పటికే కొలువై ఉన్న 40కి పైగా కొరియన్ కంపెనీలతో పాటు కొత్తగా వచ్చేందుకు ఆసక్తి చూపే సంస్థలకు భరోసా ఇచ్చిన ట్లయింది. ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండేళ్ల వ్యవధిలో ‘కియా’ సాధించిన విజయాన్ని ఉదహరిస్తూ ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, త్రీ ఎస్ మోడల్ (స్పీడ్, స్పెబిలిటీ, సర్వీస్), వేగవంతమైన అను మతులపై మంత్రి లోకేష్ వివరించిన తీరుపై కొరియా మీడియా, దిగ్గజ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. లోకేష్ బృందం పర్యటనపై కోట్రా దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్ూన్ కిమ్ ప్రశం సల వర్షం కురిపిస్తూ హ్యాట్సాఫ్ అంటూ అభినందనలు తెలపడం పర్యటన విజయ వంతానికి నిదర్శనం. చివరగా మంత్రి లోకేష్ వేగం చూసి పల్లి.. పల్లి మంత్రి అని కొరియన్ ప్రతినిధులు కొత్త పేరు పెట్టారు. ఆ పదాలకు కొరియన్ భాషలో త్వరగా త్వర గా.. వేగంగా అని అర్థం. వారంరోజుల అధికారిక పర్యటనను పెట్టుబడుల యాత్రగా మార్చిన లోకేష్ లౌక్యం రాష్ట్రాభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధి, కమిట్మెంట్కు నిదర్శనం.
లోకేష్ ధన్యవాదాలు
దక్షిణకొరియా పర్యటన విజయ వంతంపై మంత్రి లోకేష్ స్పందించారు. సియోల్లో సంభాషణలు, భాగస్వా మ్యాలు, భవిష్యత్తు కోసం ఒక ఉమ్మడి దార్శనికతతో నిండిన వారంరోజుల పర్యటన విజయవంతమైంది. కొరియన్ స్ఫూర్తికి తగ్గట్టుగా మేము ప్రతీ దాన్ని ‘పల్లి పల్లి’గా అంటే వేగంగా, లక్ష్యంతో ముందుకు సాగాం. ప్రతి సమావేశాన్ని సార్థకం చేసినందుకు కొరియా గణతంత్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సియోల్ లోని భారత రాయబార కార్యాలయానికి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డులోని మా అద్భుతమైన బృందానికి హృదయపూర్వక ధన్య వాదాలు. మళ్లీ కలుద్దాం, సియోల్ కంసమ్నిదా అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.

















