ఒకప్పుడు ఆ గడ్డపై కాలుపెడితే చాలు కార్మికోద్యమ ధ్వానాలు, ఎర్రజెండాల రెపరెపలు, నిరసన గళాలు,రాజకీయ ఉత్కంఠ, నిత్యపోరాటాలకు మారుపేరుగా నిలిచిన మంగళగిరి నేడు తన సహజ లక్షణాలను పూర్తిగామార్చుకొన్నది. రాజకీయ రణక్షేత్రం గా ముద్రపడిన మంగళగిరి నేడు అద్భుతమైన ప్రగతి పథంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సరికొత్త తలమానికంగా నిలుస్తూ నేడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అభివృద్ధి పథంలో సరికొత్తవెలుగులతో మంగళగిరి రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి. పారిశ్రామిక పురోగతికి, మౌలికవసతుల కల్పనకు కూడా ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ప్రజాదరణతోపాటు పరిపాల నా దక్షత తోడవ్వడంతో మంగళగిరి నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకుసాగు తోంది. ప్రజల భాగస్వామ్యంతో మంగళగిరిని దేశం లోనే నెంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఐటీ-విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారు.
సింగపూర్ తరహాలో మంగళగిరిని అభివృద్ధి చేయ డమే లక్ష్యంగా రోడ్లు, విద్యుత్, రవాణా వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తున్నారు. ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం హామీలు సరిపోవు. దూరదృష్టి ఉండాలి. దాన్ని కార్యాచరణగా మార్చే సమర్ధత ఉండా లి. ప్రజల సమస్యలను అర్థం చేసుకొనే హృదయం ఉండాలి. అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా భావించే సంకల్పం ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు ఉంటేనే ఒక ప్రాంతం రూపురేఖలు మారుతాయి. మంగళగిరి నియోజకవర్గంలో కనిపిస్తున్న మార్పును ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా మార్చడం కేవలం ఒక కల కాదు, స్పష్టమైన ప్రణాళిక, నిబద్ధతతో సాధ్యమయ్యే లక్ష్యం. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, ప్రజలు సమష్టిగా కృషి చేస్తే మంగళగిరి కేవలం రాష్ట్రానికే కాకుండాదేశానికే ఒక రోల్మాడల్ నియోజకవర్గంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
యావత్ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక అద్దం పడుతున్న ప్రగతి చిత్రం!
రాజకీయాల్లో గెలుపు ఒక మైలురాయి మాత్రమే. తర్వాత ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అసలు పరీక్ష. ఆ పరీక్షలో నిలవాలంటే ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలి. మంగళగిరి నియోజక వర్గంలో మంత్రి నారా లోకేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆ దిశగా సాగుతున్నాయి. అధికారుల తో నిరంతర సమీక్షలునిర్వహించడం, గ్రామాల నుంచి పట్టణాల వరకు మౌలికవసతులపై దృష్టి పెట్టడం ద్వారా మంగళగిరి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు ఆయన. మౌలికవసతుల అభివృద్ధి ఏ ప్రాంతానికైనా బలమైన పునాది. రహదారుల నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాల విస్తరణ వంటి పనులు ప్రజల నిత్యజీవితాన్ని సులభత రం చేసే అంశాలు. విద్యారంగంలో ప్రభుత్వ పాఠశా లల మౌలిక వసతుల పెంపు, డిజిటల్ విద్య, ఆధునిక తరగతి గదులు, విద్యా ర్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం వంటి చర్యలు భవిష్యత్ తరాలకు పెట్టు బడిగా చూడాలి. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించే ప్రముఖ ఆసుపత్రులు ఎయిమ్స్ వంటివి ఇక్కడ కొలువుదీరడంతో ఈ ప్రాంతం వైద్యరంగానికి ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందుతుంది.
ఆరోగ్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలను బలోపేతం చేయడం, ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడం అభివృద్ధిలో కీలక భాగం. మంగళగిరి చేనేత బ్రాండ్కు అంతర్జాతీ య మార్కెట్ కల్పించడం, కార్మికులకు ఆధునిక డిజైన్ల పై శిక్షణ, ఆర్థిక సహాయం అందించడం, మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవ కాశాల కోసం చేపడుతున్న కార్యక్రమాలుస్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వగలవు. మంగళగిరి భౌగోళికంగా అమరావతి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండ టం వల్ల పరిశ్రమలు, సేవారంగం, విద్య, ఆరోగ్య రంగాల్లో మరిన్ని అవకాశాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ అవకాశాలను అభివృద్ధిగా మలచడం నాయకత్వ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక నియోజక వర్గాన్ని ఆదర్శంగా నిలబెట్టేది ఒక్క భారీ ప్రాజెక్టు కాదు.
ప్రజల దైనందిన జీవితంలో కనిపించే చిన్న చిన్న మార్పుల సమా హారమే. అభివృద్ధి రాజకీయ నినాదంగా కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే నిరంతర ప్రక్రియగా కొనసాగితేనే ఆ ప్రాంతం నిజమైన ఆదర్శ నియోజకవర్గంగా నిలుస్తుంది. ఒకప్పుడు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన ప్రజలు, నేడు అభివృద్ధి ఫలాలను అందుకోవడంలో భాగస్వాములవుతున్నారు. ఇది కేవలం ఆలోచనా విధానంలో వచ్చిన విప్లవాత్మక మార్పు. పోరాటాల ద్వారా చైతన్యాన్ని నేర్పిన మంగళగిరి.. నేడు ప్రగతి ద్వారా సమగ్రాభివృద్ధికి బాటలు వేసుకుంటుంది. నిరసనల నుంచి నిర్మాణాత్మక అభివృద్ధి వైపు మంగళగిరి సాగిస్తున్న ఈ ప్రయాణం కేవలం ఒక నియోజకవర్గం రూపాంతరం మాత్రమే కాదు.. యావత్ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక అద్దం పడుతున్న సజీవ ప్రగతి చిత్రమని చెప్పాలి.
రెండేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు
రెండేళ్లుగా మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే మంగళగిరి, నులకపేట, ఉండవల్లి, దుగ్గిరాలలో నాలుగు అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నిడమర్రులో దేశం గర్వించే మోడల్ స్కూల్, 3 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ, చినకాకాని వద్ద వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, గ్రంథాలయం ఆధునికీ కరణ (డిజిటల్ లైబ్రరీ), దుగ్గిరాల మంగళగిరి తెనాలి రోడ్డు నిర్మాణం, తాడేపల్లి మహానా డులో రిటైనింగ్ వాల్ నిర్మాణం, పెదవడ్లపూడి హైలెవల్ కెనాల్ ఎత్తి పోతల పథకం పూర్తి, దివిస్ లేబరేటరీవారి సహకా రంతో నియోజకవర్గంలో 30వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో పార్కు పూర్తి, కొండపనేని పార్క్ పూర్తి, వైట్ ఫీల్డ్ పార్క్ పూర్తి, కాజ గ్రామంలో ఈస్ట్ లేక్ పార్క్ పూర్తి, టిడ్కోలో నిర్మాణం దశలో మెగా పార్క్ పెద్దఎత్తున స్వచ్ఛ మంగళగిరితో పారిశుధ్య పనుల నిర్వహణ, వెయ్యి టన్నుల పైగా చెత్త తొలగింపు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభి వృద్ధికి రూ.147 కోట్లతో ప్రణాళిక, రూ.1673.51 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ఏసీఏ స్టేడి యం అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రైల్వే స్టేషన్ అభివృద్ధి, రూ.393.74 కోట్లతో డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకు శ్రీకారం,
పెనుమాక బాలుర వసతిగృహం నిర్మాణం, ఎస్సీ బాలికల వసతిగృహం నిర్మాణం, దుగ్గిరాల ఎస్సీ బాలికల వసతిగృహం నిర్మా ణం, కంఠంరాజు కొండూరు శ్రీ మహంకాళి అమ్మ వారి ఆలయం రూ.11కోట్లతో అభివృద్ధి, దాదాపు 100 స్మశాన వాటికలకు సొంత నిధులతో అభివృద్ధి చేయడం, ఇప్పటికే 20 స్మశానాల అభివృద్ధి పనులు పూర్తి, దేవేంద్రపాడు-తాడేపల్లి బీటీ రోడ్డు నిర్మాణం, దేవేంద్రపాడు-శృంగారపురంరోడ్డు పసులు, చిలువూరు -కంఠంరాజు కొండూరు రోడ్డు పనులు, దుగ్గిరాల ఈమని రోడ్డు పనులు పూర్తి, పెదపాలెం – పెద కొండూరు బీటి రోడ్డు నిర్మాణం, దుగ్గిరాల గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణం, మోరంపూడి పేరకలపూడి రోడ్డు నిర్మాణం, దుగ్గిరాల మండలంలో పెద్దఎత్తున డొంకరోడ్డు పనులు, మంగళగిరి నిడమ ర్రు ఆర్ ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం, తాడేపల్లి సీతానగరంలో లోకేష్ సొంతనిధులతో కర్మకాండల సత్రం నిర్మాణం, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు, తాడేపల్లి నులకపేటలో ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో కమ్యూనిటీ హాల్, చిన్నకాకానిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి, పెదవడ్లపూడిలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్, రత్నాల చెరువులో నిర్మాణంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటివి ఉన్నాయి.
ప్రజల భాగస్వామ్యంతో సుపరిపాలన
రెండు సంవత్సరాల కూటమి పాలనలో ఆరు సార్లు మెగా జాబ్ మేళా నిర్వహణ ద్వారా 3,448 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన, దుగ్గిరాల, పేరకలపూడి, వడ్డేశ్వరం స్కూల్స్లో సీఎస్ఆర్ నిధులతో అదునాతన ఈ టాయిలెట్స్ ఏర్పాటు, సీఎస్ఆర్ నిధులు రూ.90 లక్షలతో నియోజకవర్గంలో స్కూల్స్కు మరమ్మతుల నిర్వహణ, నియోజకవర్గంలో పలుచోట్ల ఈ టాయిలెట్స్ ఏర్పాటు (మంగళగిరి
కాళిమాత సర్కిల్, న్యూ బస్టాండ్, కుంచనపల్లి, త్వరలో పలు చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రూ.30లకు బిందె పానకం అమలు, నియోజ కవర్గంలో అకాలవర్షాల వల్ల దెబ్బతిన్న చేనేత కుటుంబాలకు రూ.25 వేల ఆర్థిక సాయం, మగ్గాలు ఉన్న నేతన్న కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయడం, స్కిల్ సెన్సెస్ ప్రాజెక్టును మంగళగిరి నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టడం,
పెద్దఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం, నాలుగు వరుసల రహదారిగా మంగళగిరి- తెనాలి నారాకోడూరు రోడ్డు పనులు త్వరలో ప్రారంభం, మహిళలకు కుట్టుమిషన్ శిక్షణకు సచివాలయాల వారీగా దరఖాస్తుల స్వీకరణ, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు, ఎకో పార్క్ వాకర్స్ కోసం 5 లక్షల సొంత నిధులు వెచ్చించడం, ఉదయం వాకింగ్ చేసుకునేలా ఏర్పాటు, ఇప్పటికే రెండు పర్యాయాలు సొంత నిధులతో చెల్లింపులు, ఆంధ్ర రత్న పంపింగ్ స్కీమ్కు సొంత నిధులతో మోటారు, పైప్లాన్ల మరమ్మ తులు, అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు, అదనపు సౌకర్యల కల్పన, పెనుమాక టిడ్కో గృహాలకు తాగునీటి పైప్లాన్ల ఏర్పాటు, పెనుమూలిలోగ్రంథాలయం నిర్మాణం పూర్తి, కుంచనపల్లి శివాలయం అభివృద్ధి, బేతపూడి శివాలయం అభివృద్ధి, కురగల్లు శివాలయం అభివృద్ధి, ఆత్మకూరు వేణుగోపాలస్వామివారి దేవస్థా నం అభివృద్ధి, తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీలో సీతారామాంజయస్వామి ఆలయం అభివృద్ధి ఉండవల్లిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం (సీఆర్డీఏ), పెనుమాకలో రిజర్వాయర్ నిర్మాణం (సీఆర్డీఏ),
నీరుకొండలో రిజర్వాయర్ నిర్మాణం (సీఆర్డీఏ), పలు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి, ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో నియోజక వర్గంలో రాణిస్తున్న క్రీడాకారులకు నగదు బహుమతులు, పెదవడ్లపూడిలో రెండు హిందూ స్మశాన వాటికలకు సొంత నిధులతో సదుపాయాల కల్పన, చినపెదవడ్లపూడిలో హిందూ స్మశాన వాటికకు సొంత నిధులతో సదుపాయల కల్పన, తాడేపల్లి మండలం మెల్లంపూడిలో ఈద్గా అభివృద్ధికి రూ.7 లక్షల సొంత నిధులు అందజేత, దుగ్గిరాల మండలం చిలుపూరు ఈద్గా నిర్మాణం నిమిత్తం రూ.10 లక్షల నిధులు, తాడేపల్లి పోలకంపాడు ముస్లిం బరియల్ గ్రౌండ్ సొంత నిధులతో అభివృద్ధి, మంగళగిరి నూర్ మస్జీద్కు రూ.5 లక్షల సొంత నిధులతో లిఫ్ట్ నిర్మాణం, దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు ముస్లిం షాదీఖానా స్లాబు, మరమ్మతుల నిమిత్తం రూ.10 లక్షల సాయం, నులకపేట నూరాని మస్జీద్కు సొంత నిధులతో బోర్, పైడ్లైన్ నిర్మాణం.
మాటల రాజకీయాల నుంచి చేతల రాజకీయాల వైపు..
పాత మంగళగిరి హజరత్ అలీ పీర్ల పంజా భవన నిర్మాణానికి రూ.2.5 లక్షలు అందజేత, తాడేపల్లి ముగ్గురోడ్ జెండా చెట్టు చుట్టూ ప్రహరీ గోడ సొంత నిధులతో నిర్మాణం, యర్రబాలెం ముస్లిం బరియల్ గ్రౌండ్కు 300 ట్రాక్టర్ల మట్టితో లెవెలింగ్, ఎంటీఎంసీ నిధులతో యర్రబాలెం ముస్లిం బరియల్ గ్రౌండ్ అభివృద్ధి, దుగ్గిరాల మండలం చిలువూరులో మైనారిటీ కాలనీలో రూ.35 లక్షల ప్రభుత్వ నిధులతో 10 సీసీ రోడ్లు పూర్తి, దుగ్గిరాల మండలం చిలువూరులో మైనారిటీ కాలనీలో రూ.35 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణం (రూ.15 లక్షల మండల పరిషత్ నిధులు, రూ.25 లక్షల జడ్పీ నిధులు), పెనుమూలి బరియల్ గ్రౌండ్ లెవెలింగ్కు రూ.3 లక్షలతో ప్రణాళిక, తుమ్మపూడిలో ఈద్గా నిర్మాణానికి ప్రతిపాదనలు, మంగళగిరిలో షహెన్ షాకు సొంత నిధులతో ఇంటి నిర్మాణం, చినకాకానిలో పునీత జోసెఫ్ చర్చికి సొంత నిధులతో రూ.7 లక్షల విలువైన గ్రానైట్ అందజేత, ఆత్మ కూరు క్రీస్తు కరుణాలయం చర్చికి సొంత నిధులతో రూ.15 లక్షల విలువైన గ్రానైట్ అందజేత, దుగ్గిరాల మన్న చర్చికి సొంత నిధులతో గ్రానైట్ అందజేత, పాత మంగళగిరిలో ఆర్సీఎం చర్చికి సొంత నిధులతో
గ్రానైట్ అందజేత,నూతక్కి తెలుగుబాప్టిస్ట్ చర్చ్ కి సొంత నిధులతో గ్రానైట్ అందజేత,
తాడేపల్లి సవోదయ కాలనీ లో 2 పార్క్ అభివృద్ధి, మంగళగిరి బ్యాంక్ కాలనీ, టిప్పర్ల బజార్ లో పార్క్ అభివృద్ధి పనులు పూర్తి, కొనసాగుతున్న దుగ్గిరాల ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులు, చినకాకానిలో కొనసాగుతున్న ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులు, నాలుగు జంక్షన్ల అభివృద్ధి, లోటస్ ల్యాండ్ మార్క్, ఉండవల్లి సెంటర్, సాయిబాబా గుడి సర్కిల్, డాన్ బాస్కో వద్ద నాలుగు జంక్షన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మంగళగిరి అధునాతన సిగ్నల్ వ్యవస్థ, చినకాకానిలో ఎస్సీ, హిందూ స్మశాన వాటికల అభివృద్ధి పనులు, తాడేపల్లిలో క్రిస్టియన్ స్మశానవాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మంగళగిరిలో క్రిస్టియన్ స్మశాన వాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నూతక్కిలో ఎస్సీ, ముస్లింల స్మశాన వాటిక అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం, ఇందిరా నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు, గుండిమెడలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం, సొంత నిధులతో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలంలో కొనసాగుతున్న సంజీవని వైద్యసేవలు, సొంత నిధులతో కొనసాగుతున్న స్త్రీ శక్తి కార్యక్రమం,
నియోజకవర్గం మహిళలకు ఉచిత కుట్టుశిక్షణ, మిషన్ల పంపిణీ, లోకేష్ సొంత నిధులతో చిరు వ్యాపారులకు టిఫిన్, తోపుడు బండ్లు, బడ్డీ కొట్ల పంపిణీ, సొంత నిధులతో శ్రామికులకు ప్లాట్ఫామ్ రిక్షాలు, వెల్డింగ్ మెషిన్లు, ఇస్త్రీ బండ్ల పంపిణీ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజల కు వైద్య సాయం, నియోజకవర్గంలో సొంత నిధులతో మంగళగిరి ప్రీమియర్ లీగ్, మంగళగిరి వాలీబాల్ లీగ్, కబడ్డీ టోర్నమెంట్ ల నిర్వహణ, ఈమనిలో రూ.72 లక్షల ప్రభుత్వ నిధులతో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ భవన నిర్మాణ పనులు, పీ4
ద్వారా పలు పెద్ద కుటుంబాలకు చేయూత, ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజనకు విశేష ప్రచారం, ఇప్పటికే 1383 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమరిక, రానున్న రెండు నెలల్లో 1350 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చేందుకు శాఖ పరమైన అనుమతులు ఈ విధంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కారం చూపడం, అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడం, ఆ ప్రణాళికను కార్య రూపంలోకి
తీసుకురావడం, ఫలితాలను ప్రజల ముందుంచడం, ఈ విధానం ద్వారా మంగళగిరి నిజంగానే రాష్ట్రానికి ఒక అభివృద్ధి మోడల్గా నిలవనుంది. మాటల రాజ కీయాల నుంచి చేతల రాజకీయాల వైపు, హామీల నుంచి ఫలితాల వైపు, సాధారణ నియోజకవర్గం నుంచి ఆదర్శ నియోజకవర్గం వైపు మంగళగిరి ప్రస్థానం కొనసాగుతోంది.












