- గల్లంతైన వారి ఆచూకీ కనుగొనాలి
- కుటుంబసభ్యులకు సమాచారం అందించాలి
- కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ముఖ్యం
- నేపాల్ వరదలు, ఏపీ వాసుల పరిస్థితిపై
- అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- సురక్షితంగా తీసుకురావాలని ఆదేశం
అమరావతి(చైతన్యరథం): నేపాల్‌లో సంభవించిన భారీ వరద ల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను అధికారులు వివరిం చారు. మానస సరోవర్ యాత్ర వెళ్లిన ఏపీకి చెందిన పలువురు యాత్రికులు నేపాల్ వరదల్లో చిక్కుకున్నారని తెలిపారు. వీరికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కు కున్నట్టు ఇప్పటివరకు గుర్తించామని, వీరిలో 34 మంది సురక్షి తంగా ఉన్నారని, మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందన్నా రు. రహదారి, విమాన మార్గాలు పునరుద్ధరించాల్సి ఉండటంతో ప్రస్తుతం కొందరు అక్కడే చిక్కుకుపోయారని అధికారులు తెలిపా రు. కర్నూలు-ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు టిబెట్‌లో సురక్షితంగా ఉన్నారని.. వారితో తాము మాట్లాడామని వివరించా రు. అలాగే తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు ఖాట్మండూలో సురక్షితంగా ఉన్నారని వారిని కూడా ఆర్టీజీఎస్ నుంచి సంప్రదించినట్టు చెప్పారు. ఇక చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరు వంటి ప్రాంతాలకు చెందిన ఏడుగురు గల్లంతు అయ్యారని తెలిపారు. ఆచూకీ లభ్యం కాని ఏడుగురిలో ముగ్గురు ఈషా ఫౌండేషన్ తరపున మాసన సరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వారి ఫోన్లు అందుబా టులో లేవని వివరించారు. బాధిత కుటుంబాలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వంతో పాటు… ఖాట్మండూ, చైనా ల్లోని ఎంబసీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
ప్రతిఒక్కరి ఆచూకీని ట్రాక్ చేయాలి
నేపాల్‌లో చిక్కుకున్న ప్రతిఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆచూకీ తెలియని వారి వివరాలను నిరంతరం ట్రాక్ చేస్తూ వారి కుటుం బసభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించా రు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలతో నిరం తరం సంప్రదింపులు కొనసాగించాలని ఆదేశించారు. రహదారి, విమాన మార్గాలు పునరుద్ధరణతో పాటు అవసరమైన ప్రత్యామ్నా య మార్గాల ద్వారా సురక్షిత తరలింపునకు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే ప్రథమ ప్రాధాన్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంలో ఎలాంటి జాప్యం ఉండ కూడదని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తాజా వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు.
ఏపీ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్
నేపాల్లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఢిల్లీ లోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశా రు. నేపాల్‌లో వరదల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీ వాసులు, వారి కుటుంబసభ్యులు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి సమాచారం అందించవచ్చు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రో ల్ రూమ్ 011-23384016, 011- 23387089 నెంబర్లను, వాట్సాప్ 9059824101ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.














