- ఎనఐఈఎలఐటీ నేతృత్వంలో రూ.730 కోట్లతో
- దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్శిటీ
- వచ్చే నెల 13 నుంచి ఏఎన్‌యూలో తరగతులు
- 8.5 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ ఆమోదం
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికత, ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రీకృ తమైన జాతీయ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభు త్వం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎనఐఈఎలఐటీ) డీమ్డ్ టూ బీ యూని వర్శిటీ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ సూత్రప్రాయ ఆమో దం తెలిపింది. అమరావతి రాజధాని ప్రాంతంలో కేటాయించిన 8.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.730.70 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం 100 శాతం గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఫండ్‌లో సమకూర్చనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసు కున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటమ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఇతర అధునాతన డీప్-టెక్ రంగాలలో విద్యా బోధన, ఉపాధి శిక్షణ, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ఒకే వేదిక మీదకు తీసుకు రానున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయమైన నైలిట్ పంజాబ్‌లోని రోపర్‌లో ప్రధాన క్యాంపస్, దేశవ్యాప్తంగా 56 కేంద్రాలు, 11 రాజ్యాంగ విభాగాలు, 700కు పైగా గుర్తింపు పొందిన సంస్థల నెట్‌వర్క్‌తో పనిచేస్తున్న నైలిట్, అమరావతి వేదికగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తన డీప్-టెక్ క్యాంపస్‌ను విస్తరిస్తోంది.
సెప్టెంబరు నుంచే క్లాసులు
అమరావతిలో శాశ్వత ప్రాంగణ నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఆగకుండా వచ్చే నెల నుంచే విద్యార్థులు, వృత్తినిపుణులకు కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వసతిలో విద్యా బోధన, అధునాతన సాంకేతిక శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ క్యాంపస్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్-సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, చిప్ డిజైన్, వీఎలఎసఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూ టింగ్ హెచ్‌పీసీ వంటి కీలక రంగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ, డిప్లొమా, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేయనున్నారు. అమరావతి క్యాంపస్‌కు ప్రధాన ఆకర్షణగా 1.25 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో క్వాంటమ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ బ్లాక’(క్యూఆరఐఐబీ)ను నిర్మించ నున్నారు. ఇందులో క్వాంటమ్ ఫోటోనిక్స్, క్రియోజెనిక్ సిస్టమ్స్, క్లీన్‌రూమ్ – నానో-ఫ్యాబ్రికేషన్, డేటా సెంటర్లు, స్టార్టప్ కో-వర్కింగ్ స్పేస్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అండ్ పేటెంట్ సెల్ కొలువుదీరనున్నాయి. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, పారిశ్రామిక వేత్తలు కలిసి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలను వాణిజ్య స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ ల్యాబ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఐదేళ్లలో 8,250 మందికి శిక్షణ
ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్ల కాలంలో మొత్తం 8,250 మంది లబ్ధి పొందనున్నారు. 1,650 మంది డిగ్రీ-పీజీ కోర్సులు, 6,600 మంది విద్యార్థులు నైపుణ్య సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ల ద్వారా శిక్షణ పొందుతారు. అమరావతిలో నిర్మించే శాశ్వత ప్రాంగణాన్ని పర్యావరణహితంగా, సౌర విద్యుత్, ఈవీ ఛార్జింగ్, నెట్ జీరో లక్ష్యంతో నిర్మిస్తున్నారు. క్యాంపస్‌లో 500 మందికి వసతి కల్పిం చే హాస్టళ్లు, ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు, విజిటింగ్ ఫ్యాకల్టీ గెస్ట్ హౌస్‌లు నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషన ల్ క్వాంటమ్ మిషన్, ఇండియా ఏఐ మిషన్, ఇండియా సెమీ కండక్టర్ మిషన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూలతో నైలిట్ భాగస్వామ్యం కానుంది. ఈ అంతర్జాతీయ స్థాయి సంస్థ రాకతో అమరావతి సరికొత్త డీప్-టెక్ హబ్‌గా మారి రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.















