- అదనంగా మరో రూ.533 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్
- శాకమూరులో సెంట్రల్ లైబ్రరీ, ఆడిటోరియం,
- హెచఆర్ భవనాల నిర్మాణానికి రూ.596 కోట్లు
- అమరావతి నుంచే మంగళగిరికి తాగునీటి సరఫరా
- కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసే రైతులకు రుణమాఫీ
- ఇన్నర్ రింగ్‌రోడ్, రైల్వే లైన్లకు రాజధాని వరకు
- ఉన్న భూములకు ల్యాండ్ పూలింగ్‌కు అనుమతి
- అమరావతిలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ఐఓసీఎల్‌తో
- అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు అనుమతి
- రాజధాని ప్రాంతంలోని గ్రామాలలో ఇక బీటీ రోడ్లు
- వివిధ ప్రాజెక్టులకు అదనపు భూములకు కొత్త విధానం
- డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం ఏర్పాటుకు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్
- సీఆర్డీఏ 65వ అథారిటీ సమావేశంలో ఆమోదం
అమరావతి(చైతన్యరథం): సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 65వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌తో పాటు, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ విజయ్‌రామరాజు హాజరయ్యారు. కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణం పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం సీఆర్డీఏ ఆమోదించిన అంశాలను మంత్రి నారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు.
రాజధానిలో మౌలికవసతులకు అదనపు నిధులు
రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో రూ.1,437 కోట్లతో పెద్దఎత్తున మౌలికవసతుల కల్పన చేపడుతున్నారు. ఇప్పటికే దీని కోసం రూ.904 కోట్లకు ఆమోదం తెలపగా తాజాగా మరో రూ.533 కోట్లకు సీఆర్డీఏ అధారిటీ ఆమోదం తెలిపింది. 2014 -19 మధ్య రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల్లో క్రిటిక ల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో రాజధానిలో మౌలికవసతుల మాదిరిగానే గ్రామాల్లో కూడా రోడ్లు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి లైన్లు, వీధి దీపాలు తదితర మౌలికవసతులు కల్పించనున్నారు. అమరావతిలో యూజీడీ వ్యవస్థ ఉన్నందున 29 గ్రామాల్లో కూడా యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో రోజుకు ఒక్కొక్కరికి 40 లీటర్లు నీరు అందిస్తుండగా లెక్కల ప్రకారం ఒక్కో వ్యక్తికి 135 లీటర్లు అందిం చాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో తాగునీటి సరఫరా పైపు లైన్లు కూడా పూర్తిగా మార్చే ప్రతిపాదనకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిం ది. ఆయా గ్రామాల గుండా వెళుతున్న ట్రంక్ రోడ్లకు ల్యాండ్ టూ ల్యాండ్ ఇవ్వడానికి సైతం ఈ నిధులు వినియోగింనున్నారు.
రూ.596 కోట్లతో సెంట్రల్ లైబ్రరీ
శాకమూరులో సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, హెచఆర్కు సంబంధించిన భవనాల నిర్మాణానికి రూ.596 కోట్ల విలువతో పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపారు. 29 గ్రామాల్లో ఎల్పీఎస్ లేఅవుట్లలోని చిన్న రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ఇందుకు సీఆరఆరఐ న్యూఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్ సంస్థలతో అధ్యయనం చేయించారు. అయితే అమరావతి ప్రాంతంలోని నేల స్వభావం, భవిష్యత్‌లో పెరగనున్న వాహనాలను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్లకు బదులు గా బీటీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అభివృద్ధికి సంబంధించి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు సీఆర్డీఏకు అథారిటీ అనుమతి ఇచ్చారు.
42 ఎకరాల్లో వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి ఆమోదం
అమరావతిలో ప్రభుత్వం నిర్మించే కార్యాలయాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా అభివృద్ధి జరిగేలా 42 ఎకరాల్లో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. దీనికోసం పిచ్చుకల పాలెంలో 7.9 ఎకరాలు, తుళ్లూరులో 5 ఎకరాలు, మందడంలో 12.38 ఎకరాలు, మరో ప్రాంతంలో 6 ఎకరాలు, కురగల్లులో 6 ఎకరాలు కలిపి మొత్తం 42 ఎకరాలను గుర్తించారు.
అదనపు భూముల కేటాయింపునకు కొత్త విధానం
హోటళ్లు, పాఠశాలలు, ఇతర ప్రాజెక్టులకు ఇప్పటికే భూము లు కేటాయించిన ప్రాంతాల్లో పక్కనే కొంతమేర అదనంగా కోరు తున్న వారి కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. త్రీ స్టార్, ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లు, నేషనల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అదనపు భూమిని కోరితే అమరావతిలోని ప్రస్తుత కనీస ధరపై కనీసం 250 శాతం ధరకు కేటాయించేందుకు అథారిటీ అనుమ తి ఇచ్చింది. అమరావతిలో ప్రస్తుత కనీస ధర ఎకరాకు రూ.4.1 కోట్లు కాగా, ఇక అదనంగా భూమి కోరితే కనీసం ఎకరాకు రూ.10.25 కోట్లకు తగ్గకుండా భూమిని కేటాయించనున్నారు.
ల్యాండ్ పూలింగ్ రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ
ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లోని రైతులకు ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకూ రుణమాఫీ చేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. 2026 జనవరి 1వ తేదీకి ముందు తీసుకున్న రుణాలకు ఇది వర్తించనుంది.
మంగళగిరికి అమరావతి నుంచి తాగునీరు
అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి మంగళగిరి కార్పొరేషన్‌కు తాగునీరు అందించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తు తం మంగళగిరికి 30 ఎంఎల్డీ నీటి అవసరం ఉండగా, రాబో యే 30 సంవత్సరాల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో 80 ఎంఎల్డీ వరకు నీటి అవసరాలను పరిగణన లోకి తీసుకునేలా ప్రణాళిక రూపొందించనున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న స్టోరేజీల నుంచి మంగళగిరికి నీటిని అందించేందుకు కిలో లీటర్‌కు రూ.10 చొప్పున ధర నిర్ణయించి సరఫరా చేయ డానికి అథారిటీ అంగీకరించింది.
ఐఓసీఎల్‌తో గ్రీన్ ఎనర్జీ కోసం ఎంఓయూ
అమరావతిలో గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసేం దుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఆర్డీఏకు అథారిటీ అనుమతి ఇచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమరావతిలో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి 8.5 ఎకరాల భూమిని కేటాయించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. తాడికొండ, కంతేరులో ల్యాండ్ పూలింగ్ తాడికొండ, కంతేరు ప్రాంతాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ వెళుతుండటంతో వాటి పరిధిలోని క్యాపిటల్ సిటీ వర కు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకునేందుకు సీఆర్డీఏకు అథారిటీ అనుమతి ఇచ్చింది.














