- బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
- అద్దంకి నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరు
- 31 మంది దివ్యాంగులకు ఉచిత ట్రై స్కూటీలు
- 119 మంది లబ్ధిదారులకు సీఎంఆరఎఫ్ చెక్కులు
అద్దంకి(చైతన్యరథం): ఉపాధ్యాయులను అవమానించేలా… నిరుద్యోగులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వైసీపీ తీరుపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను బార్షాపుల వద్ద విధుల కు వినియోగించిన విషయాన్ని గుర్తు చేశారు. దైవసమానులైన గురువులపై దాడి చేయడం బాధాకరమైన విషయమని ఖండించా రు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా పోయినా వైసీపీ తీరులో మాత్రం మార్పు రాలేద ని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదా లేకపోయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. అద్దంకి నియోజకవర్గంలో మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొరిశపాడు మండలం మేదరమెట్లలో దివ్యాంగులకు ఉచిత ట్రై స్కూటీలను, లబ్ధిదారులకు సీఎంఆర్ ఎఫ్, ఎలఓసీ చెక్కులను అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆదేశాలతో పీజీఆరఎస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గంలోని విద్యార్థులకు ఇప్పటి వరకు 11,800కు పైగా సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.
విద్యా శాఖ మంత్రి లోకేష్ సంస్కరణాత్మక విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి సుమారు రూ.100 కోట్లు వ్యయం చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా రహదారుల కోసం ఖర్చు చేయలేదన్నారు. పీ4 కార్యక్రమం, దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 31 మంది దివ్యాంగులకు ఉచితంగా ఈ రోజు ట్రై స్కూటీలు పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు అర్హులైన 202 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలు అందించినట్లు తెలిపారు. సమాజ సేవలో భాగంగా సీఎసఆర్ నిధులతో పేదలకు చేయూత ఇచ్చే స్వచ్ఛంద సంస్థలు, దాతలను అభినందించారు. దివ్యాంగు లు వాహనాలను తమ అవసరాలకు, స్వయం ఉపాధికి వినియోగించుకుని స్వావలంబన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. కార్యక్రమంలో 119 మంది లబ్ధిదారులకు సీఎంఆరఎఫ్, ఎలఓసీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.















