- క్రిమినల్ లిటిగెంట్‌గా వ్యవహరిస్తున్న జగన్*
- స్థానిక సంస్థ ఎన్నికలను అడ్డుకోవడానికి గొడ్డలి పార్టీ 59 కేసులు పెట్టింది*
- 2021లో దౌర్జన్యాలు చేసి 24% ఏకగ్రీవాలు చేసుకున్న జగన్*
- సొంత బాబాయిని చంపి నారాసుర రక్తచరిత్ర రాసిన నీచ చరిత్ర జగన్‌ది*
- ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం*
- 2024లోనే పతనం మొదలైంది… 2029లో వైసీపీ భూస్థాపితం*
- ప్రజల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి*
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు*
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి వైసీపీ పార్టీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక కుట్రలు పన్నుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 16వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన దాదాపు 12,500 వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేయడం, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని నిలిపివేయడమే జగన్మోహన్ రెడ్డి అజెండా. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వైసీపీ గుట్టు రట్టయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం. అందుకే కోర్టుల ద్వారా, నామినేషన్ మొదటి రోజు నుంచే అరాచకాల ద్వారా ఎన్నికల ప్రక్రియను భంగపరచడానికి ప్రయత్నిస్తున్నారు. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరిలో రోజా రెడ్డి, కాళహస్తి, రాయచోటి, ఆదోని, కనిగిరి తదితర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కార్లు తగలబెట్టడం, కార్లతో గుద్దించడం, నామినేషన్ పత్రాలు చింపేయడం, కర్రలు, గొడ్డెళ్లు, రాళ్లు, మందు సీసాలతో దాడులు చేయడం, పోలీసులపై కూడా దాడి చేయడం వంటి అరాచకాలు చేశారు.
ఇవన్నీ వీడియో సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇలాంటి దౌర్జన్యాలు చేసిన వారు నంద్యాలలో ఒక అభ్యర్థి విత్‌డ్రా చేసుకుంటే దానిని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టి అవాస్తవాలు చెప్పారు. దొంగే దొంగ అన్నట్లు తను చేసిన అరాచకాలను ఇతరులపై నెత్తిన వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి గొడ్డలి పార్టీ 59 కేసులు పెట్టింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు హయాంలో మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 1 శాతం ఏకగ్రీవాలు జరిగాయి. అయితే 2021లో జగన్ హయాంలో రౌడీజం, హత్యాయత్నాలు, బెదిరింపులు, బలవంతపు విత్‌డ్రాలు, కిడ్నాపులు చేసి 24 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారు. పుంగనూరులో 85కి 84, మాచర్లలో 77కి 74, పూతలపట్టులో 52కి 46, కాళహస్తిలో 121కి 71, పులివెందులలో 180కి 90 వంటి బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అవినీతికి, విద్వంసానికి, అప్రజాస్వామ్యానికి బ్రాండ్ అంబాసిడర్. తన తండ్రి హయాంలోనే లక్షల కోట్లు దోచుకొని సీబీఐ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి. సొంత బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేయించి నారాసుర రక్తచరిత్ర రాసిన నీచ చరిత్ర ఆయనది. 85 శాతం హామీలను ఎగ్గొట్టిన వ్యక్తి జగన్.
అయినా ఇవాళ 100 శాతం హామీలు నెరవేర్చామని అబద్ధాలాడుతున్నారు. కూటమి ప్రభుత్వం 27 నెలల్లో ఆర్థిక సంక్షోభంలో కూడా 1,60,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చింది. ప్రజల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. అందుకే ధైర్యంగా ఎన్నికలకు వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి “మా అభ్యర్థులు నామినేషన్ వేయలేదు” అని చెబుతున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే – 659 జెడ్పీటీసీలకు వైసీపీ 1092 నామినేషన్లు, 9829 ఎంపీటీసీలకు 12,419 నామినేషన్లు ఫైల్ చేసింది. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఇవి అందరికీ కనిపిస్తున్నాయి. అయినా అవాస్తవాలు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. 2024లోనే వైసీపీ పతనం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే వైపీ భూస్థాపితం కావడం ఖాయం. కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు, పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తోంది. కెమెరాలు, సీసీటీవీలు ఉన్నాయి. ఎక్కడా అవకతవకలకు తావు లేదు. జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు చెప్పడం మానుకోవాలి. ప్రజలు మీ చరిత్రను మరిచిపోలేదు.














