- ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు
- ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు
- ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ
- ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు
- కలెక్టర్లతో సమీక్షలో సీఎం చంద్రబాబు సూచనలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభా వం నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతా ల్లోని ప్రజలను తుఫాన్ షెల్టర్లకు తరలించాలి.. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, శిశువులకు తొలి ప్రాధాన్యతనిచ్చి సుర క్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. ప్రభావిత జిల్లాల్లోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య బృందాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదే శించారు. రాష్ట్రంలో 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను 11 ప్రభావిత జిల్లాల్లో మోహరించాలని సూచించారు. కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా చర్యలు 2 చేపట్టాలని వ్యవసాయ శాఖను సీఎం నిర్దేశించారు.
అమరావతి(చైతన్యరథం): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాం గం అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాల యం నుంచి సోమవారం కూడా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వర్చువల్‌గా సమీక్షించారు. మంగళ వారానికి తీవ్ర తుఫాన్‌గా మారి రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ విభా గం హెచ్చరికల నేపథ్యంలో ఆయాతీరప్రాంత జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 28వ తేదీన ఆర్నబ్ తీవ్ర తుఫాను బాపట్ల-విశాఖ మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తుఫాన్ కారణంగా రేపు మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరుజిల్లా వరకూ వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపారు. అలాగే తీరప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పలనాడు, బాపట్ల, ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తా యని వివరించారు. అర్నబ్ తుఫానివిషయంలో రాష్ట్రం తీసుకుంటున్న ముందస్తుచర్యలను ఎప్పటి కప్పుడు కేంద్రందృష్టికి తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు.
షెల్టర్లకు లోతట్టు ప్రాంతాల ప్రజలు
తుఫాను ప్రభావం నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తుఫాన్ షెల్టర్లకు తరలించాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, శిశువులకు తొలి ప్రాధాన్యతనిచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,711 మంది గర్భిణీల ను ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, ఆస్పత్రులకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వివరించారు. ప్రభావిత జిల్లాల్లోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య బృందాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశిం చారు. రాష్ట్రంలో 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను 11 ప్రభావిత జిల్లాల్లో మొహరించాలని సీఎం సూచించారు. ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్లో అదనపు బలగాలను రిజర్వ్ ఉంచాలన్నా రు. మెరైన్ పోలీసులతో పాటు నౌకాదళంతో పాటు కోస్టుగార్డుల సేవలను ఈ తుఫాన్ సహయక చర్యల్లో వినియోగించుకునేలా చూడాలని నిర్దేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకా రులందరినీ సురక్షితంగా తీరప్రాంతానికి తిరిగి రప్పించామని అధికారులు వివరించారు. మొత్తం 30,043 పడవలు సురక్షి తంగా హార్బర్లకు చేరుకున్నాయని తెలిపారు. తుఫాన్ బలహీన పడి సముద్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవా లని సూచనలు జారీ చేశారు.
పంటనష్టం వాటిల్లకుండా చర్యలు
కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖను సీఎం నిర్దేశించారు. దాదాపు 1.82 లక్షల హెక్టార్లలోని ఉద్యాన పంటలకు ముప్పు పొంచి ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రేషన్ దుకాణాల్లోనూ సరకులు అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం వచ్చిన చోట తక్షణమే పునరుద్ధరించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎప్పటి కప్పుడు తుపాను గమనాన్ని అంచనా వేస్తూ ప్రతీ నాలుగు గంటలకూ ప్రజలకు హెచ్చరికతో కూడిన బులెటిన్ జారీ చేయాలని దిశానిర్దేశం చేశారు. గతంలో వచ్చిన తుఫాన్ల సమా చారాన్ని విశ్లేషిస్తూ రైతులకు, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చ రించాలని సూచించారు. అలాగే ఆర్నబ్ తుఫాన్ కారణంగా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొత్తం 22 రిజర్వాయర్ల పరిధిలో వరద ప్రవాహాలు వస్తాయని అధికారులు అంచనా వేశారు.
ఈ ప్రవాహాలతో 10-12 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసేలా చూడాలని ఆదేశించారు. తాండవ, రైవాడ, ఏలేరు, తమ్మిలేరు, ఎర్ర కాలువ, తాడిపూడి రిజర్వాయర్లకు పూర్తిస్థాయిలో నీటి నిల్వలు వచ్చే అవకాశం ఉందని సీఎం తెలిపారు. వాగులు, వంకలు, కాలువల ప్రవాహాలకు అడ్డంకి లేకుండా చూడాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తుఫాన్ ప్రభావంపై దుష్ప్రచారం చేసేం దుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లను ఆదే శించారు. ఇక తుఫాన్ ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో చూసి… ఆ మేరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రక టించాలని సీఎం సూచించారు. ప్రతి తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి గంట గంటకూ అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణ సహా వివిధ శాఖల అధికారులు, మంత్రి రామానాయుడు వర్చువల్‌గా హాజరయ్యారు.


