- రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్
- 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు
- విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం,
- భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు
అమరావతి(చైతన్యరథం): అనంతపురం జిల్లా రాప్తాడు ఘట న నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను తొల గించి వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఘటనతో మానసిక ఆవేద నకు గురైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సెలర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన పదో తరగతి ‘ఏ’ సెక్షన్‌కు చెందిన 32 మంది విద్యార్థుల ఇళ్లకు కౌన్సెలర్లు స్వయంగా వెళ్లి వారితో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థినుల ఇళ్లను సందర్శించి అవసరమైన కౌన్సెలింగ్ అందించనున్నారు. ఘటన తాలూకు భయాందోళనల నుంచి విద్యార్థులు బయటపడి తిరిగి ఆత్మ విశ్వాసంతో పాఠశాలకు హాజరయ్యేలా కౌన్సెలర్లు మానసిక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా చదువుపై దృష్టి సారించేలా అవసరమైన సహాయాన్ని కొన సాగించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
















