- దమ్ముంటే సీబీఐతో విచారణ జరిపించండి
- అవినీతిని బయట పెట్టిన మీడియాపై అక్కసు
- విజయసాయిని ఎవరో కొట్టరానిచోట కొట్టారు
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
అమరావతి: అధికా రం లేనప్పుడే అతితెలివితేటతో ప్రజల సొమ్ముని లూఠీ చేసిన జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏమీఎరు గని ఉత్తములంటే ప్రజలెవరూ నమ్మేస్థితిలో లేరని తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మంగళవా రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. విశాఖ కేంద్రంగా ఏ2, అతని పరివారం సాగించిన భూదోపిడీని టీడీపీ, మీడియా ఆధారాలతో ప్రజల ముందుంచినా సిగ్గులేకుండా విజయసాయి పత్తిత్తుకబుర్లు చెబుతున్నా డు. విజయసాయి దోపిడీ కోసమే జగన్‌రెడ్డి విశాఖ రాజధాని అన్నాడు. సహజవనరులతోపాటు, రాష్ట్రం లోని విలువైన ఖనిజ సంపద సహా దేన్నీ వదలకుండా తోడుదొంగలిద్దరూ మెక్కేస్తున్నారు. వారి దోపిడీని తెర మరుగు చేయడానికే మూడు రాజధానుల పేరుతో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారు. పూర్తి గా దోచేసి, విశాఖ నగరాన్ని చిక్కిశల్యం చేసేవరకు ఆ ఇద్దరూ నిద్రపోరు. స్వాహా చేసిన భూముల్ని గుట్టుచ ప్పుడు కాకుండా బరితెగించి మరీ కూతురు, అల్లుడి పేర్లతో పెట్టాడు. అడ్డగోలుగా బుకాయించి, మీడియా ముందు కట్టుకథలు చెప్పినంతమాత్రాన విజయసా యిరెడ్డి చేసిన భూదోపిడీ కనుమరుగవుతుందా? దోపి డీని బయటపెట్టిన మీడియాపై బురదజల్లినంత మా త్రానో, విలేకరుల్ని బెదిరించినంతమాత్రానో విజయ సాయి పత్తిత్తుఅవ్వడు. తన కూతురు పుట్టకముందున్న అరబిందోఫార్మాకు ఎన్నడూలేనన్ని భూములు ఎలా వచ్చాయి? రుషికొండ, ఆ చుట్టుపక్కల ఉన్న భూము లతోపాటు, పంచ గ్రామాల క్రమబద్ధీకరణ పేరుతో రూ.2,500 కోట్ల విలువైన భూముల్ని విజయసాయి రెడ్డి కాజేశాడు. భోగాపురం విమానాశ్రయం భూముల పేరుతో రూ.400 కోట్లు, హెటిరో సంస్థ పేరుతో రూ.400 కోట్ల విలువైన భూములు కాజేశాడు. ప్రేమ సమాజం స్వచ్ఛంద సంస్థకు చెందిన రూ.200 కోట్ల భూములు స్వాహా చేయడంతోపాటు, సీబీసీఈసీ చర్చి భూముల్ని దిగమింగి, బేపార్క్‌ను కూడా మింగేశాడు. విజయసాయి ముసలోడు కాబట్టే, కొట్టేసిన ఆస్తుల్ని కూతురి పేరుమీద పెట్టాడు. 2022 మార్చి3న హై కోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో ప్రభుత్వానికి తెలియదా? మూడు రాజధానులు పెట్టే హక్కు శాసన సభకు లేదని చెప్పలేదా?
హైదరాబాద్‌లో కూడా లేనివిధంగా కొట్టేసిన భూ ముల్ని విజయసాయిరెడ్డి 70శాతం బిల్డర్లకు, 30శా తం ఓనర్లకు అంటూ పంపకాలు జరపలేదా? గోపీ నాథ్‌రెడ్డి ఎవరో, అతని సంస్థలో ఎవరు డైరెక్టర్లో విజ యసాయికి తెలియదా?భూములు దోచేశాడనే విజయ సాయిని తాడేపల్లి నుంచి ఫుట్‌బాల్ లా ఈడ్చితన్నారు. ప్రజాక్షేత్రంలో విజయసాయి, వైసీపీ ప్రభుత్వ అవినీతి, భూదోపిడీ బట్టబయలైంది. ప్రజలకు తెలిస్తే తమను ఎక్కడ పరుగులు పెట్టిస్తారోనన్న భయంతోనే బుకా యింపులు,బుజ్జగింపుల పర్వం మొదలెట్టారు. ఆ కోవ లోనే మూడు రాజధానులంటూ ఉత్తరాంధ్ర వాసుల్ని రెచ్చగొడుతున్నారు.
మంత్రి అమర్నాథ్ ఇప్పుడు నోరెత్తడే?
గతంలో దసపల్లా భూములపై సీబీఐ విచారణ కోరాలన్న మంత్రి అమర్నాథ్, ఇప్పుడు విజయసాయి కబ్జాలపై నోరెత్తడేం? రూ.1500 కోట్ల విలువైన దసపల్లా భూముల రక్షణకు టీడీపీ ప్రభుత్వంలో దీక్షలు చేసిన మంత్రి అమర్నాథ్ ఇప్పుడేమో ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తానంటూ ఏ2 దోపిడీకి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో ఈగ వాలకుండా కాపాడిన భూముల్ని మూడున్నరేళ్లలోనే లూఠీ చేశా రు. మంత్రులు అమర్నాథ్, బొత్స,సీదిరి అప్పలరాజు, ధర్మానలకు నీతినిజాయితీ ఉంటే విశాఖ, ఉత్తరాంధ్ర లో సాగిన విజయసాయిరెడ్డి భూదోపిడీపై తేల్చాలి. దానిపై మాట్లాడే ధైర్యం లేదుగానీ, తామేదో రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తున్నట్లు ప్రజల్ని మోసగించాలని చూస్తున్నారు. 40వేలకోట్ల భూములు కొట్టేసింది కాక, తగుదనమ్మా అంటూ తప్పించుకోవాలని చూస్తారా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకుండా జగన్‌రెడ్డి ఇప్పటికైనా ప్రభుత్వ భూములు కాపాడి, తన పార్టీలో ని దోషుల్ని శిక్షించాలి. విశాఖ సహా, ఉత్తరాంధ్రలో సాగిన దోపిడీలో ముఖ్యమంత్రికి ఎంత వాటా అందిం దో తెలియదు. భూదోపిడీపై వేసిన సిట్ దర్యాప్తు ఏమైంది? సదరు నివేదికను ఎందుకు బయట పెట్ట డంలేదు?విజయసాయి విశాఖ ఇన్‌ఛార్జ్‌గా వెళ్లాక కనీ వినీ ఎరుగని విధంగా 70వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడిరగ్ జరిగిందని కారు కూతలు కూసినవారు ఇంకెన్నాళ్లు బోగస్ కబుర్లు చెబుతారు?
భవిష్యత్‌లో కృష్ణ జన్మస్థానానికి వెళ్లకతప్పదు అవినీతిపరులు పత్రికలు, ఛానెళ్లు పెట్టడంలో ఆశ్చర్య మేముంది?విజయసాయి లాంటి అవినీతిపరులు టీవీ ఛానెళ్లు పెట్టడం, పత్రికలు పెట్టడంలో ఆశ్చర్యంలేదు. జగన్ రెడ్డి సొంత మీడియా ఉండగా, మరో మీడియా ఏర్పాటు చేయాలన్న ఆలోచన విజయసాయికి వచ్చిం దంటే ఆయన్ని ఎవరో కొట్టరానిచోట కొట్టారనిపిస్తోం ది. జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఏ పదవులు లేనప్పుడే జైల్లో ఉన్నారు.ఇప్పుడు అధికారంలో ఉన్నందున అదీ, ఇదీ అని లేకుండా ఏదైనా చేయగలరు.ఒక్కఛాన్స్ అని అడిగినందుకు నమ్మిన ప్రజలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారం అండతో, అహంకారంతో రెచ్చిపోతూ ఇప్పుడు చేస్తున్న దోపిడీకి కూడా ఏ1, ఏ2, మరికొందరు ప్రబుద్ధులు భవిష్యత్‌లో కృష్ణ జన్మ స్థానానికి వెళ్లకతప్పదని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.