- రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చేసిన జగన్‌రెడ్డి
- అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసులు గోడలుదూకి వచ్చేస్తారు
- పోలవరం ప్రాజెక్టును సందర్శించే హక్కు నాకులేదా?
- రాష్ట్రానికి పట్టిన శని, ప్రజలపాలిట భస్మాసురుడు జగన్
- కొవ్వూరు రోడ్ షోలో నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు
రాజమండ్రి : ప్రజల మెడమీద కత్తిపెట్టి మీ ఆస్తి ఇస్తావా, చస్తావా అంటే ఎవరైనా ఏంచేస్తారు..ఇప్పుడు విశాఖ లో అదే జరిగింది… అక్కడ ప్రభుత్వ స్థలాలతోపాటు ప్రైవేటు ఆస్తులను కూడా జె-గ్యాంగ్ బలవంతంగా ఆక్రమించారు..ఆస్తుల కంటే ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యమని ప్రజలు భావించే పరిస్థితి కల్పించా రని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా పర్యటన లో భాగంగా రెండోరోజైన గురువారం కొవ్వూరులో అధినేత నిర్వహించిన రోడ్ షోకు ప్రజలనుంచి అనూ హ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా చంద్రబా బు మాట్లాడుతూ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మనల్ని రక్షించడానికి పోలీసులు రారు…అన్యాయాన్ని మనం ప్రశ్నిస్తే మాత్రం పోలీసులు గోడలు దూకివచ్చేస్తున్నా రని ఎద్దేవా చేశారు.పోలీసులపైనా ఒత్తిళ్లు ఉన్నాయి. వారి మెడపై కూడా కత్తిపెట్టి మనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. వాస్తవానికి వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి..సమయానికి జీతాలు రావడం లేదు…రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పింది… అం దుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో కార్యక్రమా న్ని చేపట్టామని చెప్పారు.జగన్సంక్షేమం పేరుతో బట న్ నొక్కడం పెద్ద యాక్షన్. సాయంత్రం అసలు బటన్ నొక్కి మద్యం,గనులు, శాండ్ పేరుతో వేలకోట్లు దోచే స్తున్నాడని దుయ్యబట్టారు.
పోలవరం కష్టాన్ని నీళ్ల పాల్జేశాడు
జనం కష్టాల్లో ఉంటే జగన్ నవ్వుతుంటాడు… వరదలకు వెళ్లి నవ్వుతాడు…పరామర్శకు వెళ్లి నవ్వుతాడు…ఏం చెప్పాలి ఈ సిఎంకు? పోలవరం 72 శాతం పూర్తి చేసిన నన్ను పోలవరం వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలవరంలో కీలక పనులు అన్నీ నాడు పూర్తి చేశాం. 2019 మేలో జగన్ ఐరన్ లెగ్ వచ్చింది…పోలవరంపై పడిరది. బాధ్యత ఉండే సిఎం అయితే తెలియని విషయాలు తెలుసుకోవాలి. పుట్టుక తో అన్నీ తెలియవు…నలుగురితో మాట్లాడి తెలుసు కోవాలి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం రివర్స్ టెండర్చేశాడు. పోలవరం ప్రాజెక్టు నీళ్ల పాలు అయ్యింది. 7మండలాలు ఎపిలో కలిపితేనే సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని నాడుచెప్పాను. దీంతో 7 మండలాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పడక ముందే ఎపిలో కలిపారు. చిన్నబిడ్డను పెంచినట్లు పోలవరాన్ని పెంచాను. పోలవరంను చూసి ఇదేం ఖర్మ అని అనిపి స్తోంది. పోలవరం వచ్చి ఉంటే అన్ని ప్రాంతాల్లో నీళ్లు ఇచ్చే వాళ్లం. పోలవరం కల నిజం అయ్యే సమయం లో జగన్ వచ్చి నాశనం చేశాడు. పోలవరం ప్రాజెక్టు ను 41.15మీటర్ల వరకే కట్టిదాన్ని బ్యారేజ్‌గా మారు స్తాడట.పోలవరం నీళ్లువస్తే నాకు ఒక్కడికే లాభమా… ప్రజల కోసం పోలవరం కట్టాలి అనుకున్నాను.
నేను పోలవరం వెళ్లకూడదా?
నేను పోలవరం చూడడానికి వెళితే పోలీసు అధి కారులు రావడానికి వీలు లేదు అంటున్నారు. పోల వరం నిర్మాణం చేసిన నాకే వెళ్లడానికి హక్కు లేదు అంటే ఎలా? ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన నడు స్తుంది. ఈ సైకో పాలన వద్దు…సైకిల్ పాలన కావా లి. అప్పుడే మన జీవితాలు ఆనందంగా ఉంటాయి. తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలి అంటే మళ్లీ టిడిపి రావాలి అని జనం కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఇదే స్పందన కనిపిస్తుంది. తమ్ముళ్లూ… మళ్లీ జాబు రావాలి అంటూ బాబు రావాలి అని అంతా అంటున్నారు. 2014 తరువాత రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చాను. 5 లక్షల మందికి ఉద్యోగాలు తెచ్చాను. నాడు తెలంగాణలో నా తరు వాత వచ్చిన ముఖ్యమంత్రులు, వైఎస్ ఆర్ హైటెక్ సిటీ కూలగొట్టి ఉంటే హైదరాబాద్ అభివృద్ది జరి గేదా? జగన్ మూడున్నరేళ్లలో ఒక్క రూపాయి పెట్టు బడి తెచ్చాడా…ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చాడా? నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు…మళ్లీ గెలిస్తే నేనేమ న్నా రికార్డు క్రియేట్ చేస్తానా? ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సిఎంగా రికార్డు నా పేరుతోనే ఉం ది. నాకు సిఎం పదవి కాదు..నా అవేదన, తపన ఈ రాష్ట్రం గురించి.
జగన్ విధ్వంసపాలనతో అన్నదాత కుదేలు
పాలకులు ఏవైనా కొత్త పాలసీ తీసుకువస్తే పదిమందికి మేలు జరగాలని కోరుకుంటారు. కానీ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. స్వార్థం అవినీతి వల్ల ధాన్యం డబ్బులు కూడా దక్కని పరిస్థితి. జగన్ విధానం వల్ల ఆక్వా రంగం పూర్తిగా దబ్బతింది. దీనిపై ఆధారపడిన వారు నష్టపోయారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు. ఒక్కో రైతుపై సగటున రూ. 2.74 లక్షల అప్పు ఉంది. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఎపి మూడో స్థానంలో ఉంది. ఈ స్థాయిలో ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా తాకట్టు పెట్టారా…ఇన్ని అప్పులు చేశారా? మీరు ఇలాగే ఉంటే మీ ఆస్తులు కూడా తాకట్టు పెడతారు. అప్పులు చేసే ముఖ్యమంత్రి సమర్థుడా…సంపద సృష్టించేవారు సమర్థులా? సంపద సృష్టి తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టిన తరువాత అక్కడ ముఖచిత్రం మారిపోయింది.
కులంపేరుతో అమరావతిని చంపేశారు
హైదరాబాద్ లాగానే అమరావతిని అభివృద్ధి చేద్దా మని భావించాను. ఇందుకోసం రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారు. అమరావతి పూర్తి చేసి ఉంటే 3 లక్షల కోట్ల ఆస్తులు రాష్ట్రానికి వచ్చేవి. అమరావతికి కులం పేరు పెట్టి దాన్ని చంపేశారు. నేను ఎప్పుడైనా ఒక్క కులానికి మద్దతు ఇచ్చిన సందర్భం ఉందా? నా పక్కన నలుగురు ఉంటే… వాళ్లు ఎవరు అనేది కూడా చూసుకుంటా…అంత ప్రాధాన్యం ఇస్తాను. సిఎం, డిజిపి, సిఎస్, సలహా దారు సజ్జల అంతా కడప జిల్లానే. రాష్ట్రాన్ని సాయి రెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డికి అప్ప జెప్పాడు..మీ పార్టీలో ఇక వేరే మగాళ్లు లేరా…
అంతా ఒకవర్గం వాళ్లే ఉండాలా? వెనుకబడిన వర్గాలకు ఏం పదవులు ఇచ్చారో ఈ సిఎం చెప్పాలి. మేంబిసిలకు చేం చేశామోచెపుతాం..చర్చకు సిద్దమా?
నా జీవితం తెరచిన పుస్తకం
నా జీవితం తెరచిన పుస్తకం…ఎప్పుడూ తప్పు చెయ్యను. తప్పుడు మాటలతో అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే ఉతికి ఆరేస్తా. అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని జగన్ తీసి వేశాడు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌ను కొత్తగా వచ్చిన సిఎం స్టాలిన్ దాన్ని కొనసాగించాడు. అధికా రంలోకి వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్ ను ప్రతి మండలంలో పెడతాను. 200 రూపాయాల పెన్షన్ 2,000 చేసింది ఎవరు..ఇదీ సంక్షేమం అంటే. జగన్ పెన్షన్ 3 వేలు చేస్తాను అన్నాడు… చేశాడా? చంద్రన్న బీమా కింది సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.5 లక్షలు ఇచ్చాను. ప్రజలకు ఇచ్చే బీమా పైనా కోతలు పెట్టారు. విద్యార్థు లకు విదేశీ విద్య రావడం లేదు. రంజాన్ తోఫా రావడం లేదు..సంక్రాంతి కానుక రావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు న్యాయం చెయ్యకుండా ఏ చేశాడు ఈ సిఎం? నా కంటే ప్రజలు ఎక్కువ ఆవే శంగా ఉన్నారు. నేను సిఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయా… పోలీసులు అనవసరంగా గోడలు దూకారా..ఇప్పుడు ఎందుకు పోలీసులు అలా చేస్తున్నారు?ఈసారి రాష్ట్రాన్ని కాపాడుకోక పోతే.. 2024ఎన్నికలు రాష్ట్రానికి చివరిఎన్నికలు అవుతాయి.
రాష్ట్రప్రజల పాలిట భస్మాసురుడు
పిల్లలకు జగన్ కంసమామ… రాష్ట్రప్రజల పాలిట భస్మాసురుడు. శివుడి వద్ద వరం తీసుకుని భస్మాసురు డు శివుడినే భస్మం చెయ్యాలి అనుకున్నాడు. జగన్‌కు బ్లూ మీడియా ఉంది. వాలంటీర్లు ఉన్నారు. నా వెంట 5కోట్లమంది ప్రజలు ఉన్నారు. బ్లూ మీడియాను పెట్టు కుని జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. తన సభకు నల్ల చున్నీలతో వచ్చారని మహిళల చున్నీలు లాగేశారు. నాపై అవినీతి ఆరోపణలు చేసి తవ్వుతూనే ఉన్నాడు. తవ్వితవ్వి ఏం చేస్తాడు. ఎలుక తోకను కూడా పట్టుకోలేడు. మహిళలకు గౌరవం పెంచిన పార్టీ తెలుగు దేశం పార్టీ. మహిళలకు విద్యలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. ఆడ బిడ్డల తల్లిదండ్రులను గౌరవంగా చూసే పరిస్థితి తీసుకువచ్చింది టిడిపినే.
రాష్ట్రానికి పట్టిన శని జగన్ రెడ్డి
జగన్ రాష్ట్రానికి పట్టిన శని…దాన్ని వచ్చే ఎన్నిక ల్లో వదిలించుకుందాం. ప్రజల్లో ఉత్సాహం చూసిన తరువాత నాకు నమ్మకం కలిగింది.ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్‌ను, వైసిపిని బంగాళా ఖాతంలో కలప డానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. నీ ముద్దులుపోయి గుద్దులు మిగిలాయి అని జగన్‌కు చెప్పండి. గట్టిగా ప్రశ్నించండి. అడుగడుగునా జనం తరలి రావడంతో రోడ్ షోలు ఆలస్యం అవుతున్నాయి. పశ్చిమ గోదా వరి జిల్లాలో వందలసార్లు తిరిగిఉంటాను. పుష్కరాల్లో కూడా ఇక్కడే ఉన్నా. కానీ జీవితంలో ఇంత స్పందన ఎప్పుడూ చూడలేదు. తెలుగు తమ్ముళ్లు ఆవేశంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ను చిత్తు చిత్తుగా ఓడిరచాలని జనం ఊగిపోతున్నారని అన్నా రు. గతమూడున్నరేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారిపోయాయి. మంచి తిండి కూడా తిన లేని పరిస్థితి. కరెంట్‌చార్జీలు, ఆర్టిసి టిక్కెట్ ధరలు పెరిగాయి. చివరికి చెత్తమీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.