- ఉచితంగా ఇచ్చిన ఇసుకలో అక్రమాలు జరిగాయట
- జగన్‌రెడ్డి రివర్స్ పాలనలో కేసులు కూడా రివర్స్‌లోనే నమోదు
- లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందని అక్రమ కేసు
- ఉన్న స్కిల్ సెంటర్లు లేవని అక్రమ కేసు
- తాజాగా ఉచితంగా ఇచ్చిన ఇసుకలో అక్రమ కేసు
- చంద్రబాబును ప్రజల్లోకి రాకుండా చేసే కుట్ర
అమరావతి:టీడీపీ అధినేత చంద్ర బాబుపై జగన్‌రెడ్డి ప్రభుత్వం మరో అక్రమ కేసు పెట్టింది. చంద్ర బాబును ప్రజలతో మమేకం కాకుండా అడ్డు కునే కుట్రలో భాగంగానే జగన్‌రెడ్డి ఈ కేసుల పరంపరకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది. జగన్ రివర్స్‌పాలన లో కేసులు కూడా రివర్స్‌లోనే నమోదు చేస్తున్నారు. లేని ఇన్నర్ రింగ్‌రోడ్డు ఉందని కేసు.. ఉన్న స్కిల్ సెంటర్లు లేవని కేసు.. తాజాగా ఉచితంగా ఇచ్చి న ఇసుకలో అవినీతి అని కేసు పెట్టారు. వేల కోట్ల రూపాయల మేర భారీ దోపిడీ జరుగుతోందంటూ టీడీపీ ఏ అంశంపై అయితే ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతోందో.. ఆ అంశాల పైనే చంద్రబాబుపై కేసులు పెట్టడం జగన్‌రెడ్డి నేరస్వభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. చంద్రబాబు హయాంలో ఇసుక ఉచితంగా ఇచ్చిన విధానంలో ఆర్థికంగా అక్రమాలు జరిగా యంటూ తాజాగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం చంద్రబాబు పై స్కిల్ డెవ లప్‌మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్, ఫైబర్ నెట్,అమరావతి అసైన్డ్ భూముల వ్యవ హారాల్లో కేసులు నమోదు చేసింది. అదే విధంగా అంగళ్లు, పుంగనూరుల్లో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేసి,
ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టింది. మొన్న టికి మొన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోగ్యకార ణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరై చంద్రబాబు జైలు నుండి విడుదలవుతున్న రోజే ఆయనపై గతంలో మద్యం కంపెనీలకు అనుమతుల జారీలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. తాజాగా గతంలో టీడీపీ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక లో అక్రమాలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెం కటరెడ్డి ఫిర్యాదు మేరకు గురువారం సీఐడీ కేసు నమో దు చేసింది. అప్పటి మంత్రి పీతల సుజాత ఏ 1గా, చంద్రబాబును ఏ 2గా పేర్కొంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏ 3గా, అప్పటి ఇరి గేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏ 4గా పేర్కొంది. కేసులు, చట్టాలు అంటే రాష్ట్రపాలకుల చేతు ల్లో ఆట వస్తువుల్లా మారిపోయాయి. ఎలాంటి ప్రాథ మిక ఆధా రాల్లేకుండా.. కేసులు పెట్టేయడం.. అను కున్న వారిని అరెస్టుచేయడం పరిపాటిగా మరిపోయిం ది. స్కిల్ కేసు పేరుతో హడావుడి చేసి.. పది పైసల అవినీతిని నిరూ పించలేకపోయారు. తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లు పెట్టేసి.. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలి గించారని, దారి మళ్లించేశారని.. ఎఫ్‌ఐఆర్‌లు నింపేస్తున్నారు. తాజాగా ఇసుక విషయం లోనూ అలాగే కేసు పెట్టారు. మూడు రోజుల కిందట మద్యం కేసుకూడా అలాగే పెట్టారు. ఇవన్నీ న్యాయస్థా నాల్లో నిలుస్తాయా లేదా అన్నసంగతి తర్వాత. నిలువ వు అని తెలుసు కూడా. అరెస్టులు చేయటం, వీలైనంత కాలం రిమాండ్ లో ఉంచటంతోనే సరిపెడుతున్నారు. తరువాత ఏ కేసులోనూ కనీసం ఛార్జిషీటు కూడా దాఖ లు చేసే పరిస్థితి ఉండటం లేదు. గతంలో అచ్చెన్నా యుడి విషయంలో నైనా, కొల్లు రవీంద్ర కేసు విషయం లోనైనా, తాజాగా స్కిల్ కేసులో చంద్రబాబు విషయం లోనైనా ప్రభుత్వాని ది, సీఐడీది అదే ఫార్ములా.
జగన్ పాలనలో నాలుగున్నరేళ్లు గడిచాక, మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఇలా వరుసగా ఒకదాని తరువాత మరో కేసు పెట్టడం జగన్‌లోని కరడుగడ్డిన నేర స్వభావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చట్టాలంటే లెక్కలేదు. న్యాయస్థానాలంటే వెరపు లేదు. వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో వణికిపోతున్న జగన్‌రెడ్డి.. చంద్రబాబు ప్రజల్లో తిరగకుండా అడ్డుకునేందుకు ఈ కేసులు పరం పరకు తెరతీశాడనేది స్పష్టమవుతోంది. న్యాయస్థానాల్లో నిలబడని కేసుల్లో, సాగదీత విధానాల్లో చంద్రబాబును వీలైనంత కాలం జుడిషయల్ రిమాండ్‌లో ఉంచేలా చూడాలన్నదే జగన్ ఎత్తుగడగా తెలుస్తోంది.
కేసులైతే నిమిషాల వ్యవధిలో పెట్టేస్తారు. కోర్టుల్లో కౌంటర్లుదాఖలు చేయాల్సి వస్తే మాత్రం వారాలకు వారాల సమయం అడుగుతారు. మద్యం అనుమతుల్లో అక్రమాలంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే.. వాదనలు వినిపించడానికి తమకు రెండువారాల సమయం కావా లని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. కేసుపెట్టి నప్పుడు,అందులో చంద్రబాబుప్రమేయం ఉందని నిర్ధా రించినప్పుడు అప్పటికప్పుడు కోర్టులో వాదనలు వినిపి ంచడానికి వచ్చిన అడ్డేమిటో తెలియదు.తప్పుడుకేసులు పెట్టిమీడియా ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ఏఏజీ, సీఐడీ చీఫ్‌లు కోర్టుకు మాత్రం ఆధారాలు ఇవ్వ రు.కానీ వారాల తరబడి వాయిదాలు కోరుతూ ఉంటా రు. ఇప్పటి వరకూ..స్కిల్ కేసులో డబ్బులు చంద్రబాబు కు వచ్చాయని నిరూపించలేదు. టీడీపీకి వచ్చిన విరా ళాలు అవినీతి సొమ్ము కావచ్చొంటూసన్నాయి నొక్కులు నొక్కుతూ, ఆ వివరాలు కావాలంటూ బ్యాంకుల్ని అడు గుతున్నారు.ఎలాంటి ఆధారాలు లేవని తమ చర్యల ద్వారా సీఐడీ అధికారులే నిరూపిస్తున్నారు. న్యాయ వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలతో ఆడుకుంటూ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధిస్తున్నారు. అయితే ఈ ఆటలు ఎల్లకాలం సాగబోవని నేర ప్రవృత్తి గల పాలకులు తెలుసుకుంటే మంచిది.