ఒక్క ఛాన్స్ అంటూ ఓటేసి గెలిపించిన పాపానికి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చి పోతూపోతూ అప్పుల కుప్పని బహుమతిగా ఇచ్చి వెళ్లాడు జగన్‌రెడ్డి. ఆయన అధికా రం నుంచి దిగిపోయే నాటికి రూ.13.50 లక్షల కోట్ల అప్పు ఉంది. రాష్ట్రంలో ప్రతిఒక్క రిపై రూ.2 లక్షల భారం పడనుంది. పుట్టిన పసిబిడ్డపై కూడా రూ.2 లక్షల భారం మోపాడంటే రాష్ట్రాన్ని ఎంత అధ్వానస్థితికి చేర్చాడో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్ల ద్వారా కుప్పలుతెప్పలుగా జగన్ ప్రభుత్వం అప్పులు చేసింది. సంపద సృష్టించడంపై దృష్టిసా రించని జగన్ మరో పదేళ్లు పోయినా గుర్తు చేసుకుంటేనే అమ్మో జగన్ అని… భయపడేలా ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థికభారం మోపాడు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని కాస్త అథ:పాతాళానికి పడేసి రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసిన జగన్ ఎన్నికల ముందు కూడా అప్పులు చేసి కూటమి ప్రభుత్వంపై మరింత భారం మోపి వెళ్లాడు. ఎన్నికల కోడ్ ఉండగా హడావుడిగా కేంద్రం నుంచి అప్పుల సమీకరణకు అనుమతులు తీసుకుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమూ కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటిది ఏప్రిల్, మే నెలలతో పాటు జూన్ 4 వరకు ఏకంగా రూ.20,000 కోట్ల రుణం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి తీసుకోవాల్సిన అప్పుల్లో మూడోవంతు అప్పు మొదటి రెండు నెలల్లోనే తీసుకుని కూటమి ప్రభుత్వం నెత్తిన భారం మోపాడు.
తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అథ:పాతాళానికి తీసుకెళ్లిన జగన్ అప్పుల వేటలో మాత్రం కొత్త రికార్డులనే సృష్టించాడు. బాండ్లు, పూచీకత్తులు, ఆస్తుల తాకట్టు కూడా దాటేసి..మద్యం ఆదాయాన్ని కుదవ పెట్టేసి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. కేంద్రం వారించినా, ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసినా, ఆర్థిక వేత్తలు నెత్తీనోరు కొట్టుకున్నా డోంట్ కేర్ అంటూ చివరగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి వెళ్లాడు. గత ఐదేళ్లుగా జగన్ సాగించిన అరాచకం పాలకుల ఎంపిక విషయంలో ప్రజలకు మేలుకొలుపు అనుకోవచ్చు. అప్పులు చేయడమే కాకుండా ప్రజలపై రకరకాల పన్నులు వేసి ఆ మొత్తాన్ని జేబులో వేసుకుని ఆర్థిక విధ్వంసం సృష్టించాడు. ఐదేళ్లలో విపత్తు నిధులు, పోలవరం, గ్రామ పంచాయతీలు సహా కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించాడు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి తాడేపల్లి ఖజానా నింపుకున్నాడు. పేపర్లపై ఉన్న సొమ్ములు ఖాతాల్లో లేవు. దేనికి ఖర్చుచేశారో తెలియదు. జగన్ తెచ్చిన అప్పునంతా ఎవరికి ధారపోశాడో, ఏం చేశాడో తెలియదు కానీ అందరికీ బకాయిలు మాత్రం పెట్టేశాడు.
ఆదాయానికి గండి..పడిపోయిన వృద్ధి రేటు
అభివృద్ధి లేక ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. విభజనానం తరం తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చంద్రబాబు అనేక అడ్డంకులు, సవాళ్లను అధిగ మించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథóంలో నడిపించారు. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో 14 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే నెంబర్ 1గా అభివృద్ధిలో ముందుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధి రేటు 10.93 శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు 4.06 శాతం తగ్గింది, ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి రూ.30 వేల కోట్లు ఆదాయానికి గండి పడిరది. విభజన జరిగినప్పుడు తలసరి ఆదాయం ఏపీ, తెలంగాణ మధ్య 35 శాతం తేడా ఉండేది. మనకంటే తెలంగాణ 35 శాతం అధికంగా తలసరి ఆదాయం ఉంటే, 2014- 2019 మధ్య కాలంలో ఏపీలో చంద్రబాబు సుపరిపాలన ద్వారా వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించారు. జగన్ నిర్వాకం వల్ల 2024కి ఏపీ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే 44 శాతం తక్కువగా ఉంది.
ఆర్థికలోటులో దేశంలోనే నెంబర్ 1
అప్పులతో పాటు ఆర్థికలోటులో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపిన చరిత్ర జగన్ రెడ్డిదే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఉత్త కబుర్లతో ఐదేళ్ల పాటు కాలక్షేపం చేసిన జగన్ రెడ్డి రాష్ట్రం నుంచి రూ.10 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయేలా చేశాడు. రూ.75 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు కల్పించే ఫాక్స్ కాన్, రూ.9,500 కోట్లు పెట్టుబడులు, 10 వేల ఉద్యోగాలు కల్పించే అమర్‌రాజా, రూ.2,200 కోట్ల పెట్టుబడులు, 7 వేల ఉద్యోగాలు కల్పించే లులూ, రూ.10 వేల కోట్లు, 9 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ (%జువీూ%), రూ.22 వేల కోట్ల పెట్టుబడులు, 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఏసియన్ పేపర్ మిల్స్ లాంటి రాష్ట్రం నుంచి తరలిపోయేలా చేసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల లూటీ, దుబారా కారణంగానే రాష్ట్ర ఆదాయాలు అడుగంటాయి, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. జీఎస్‌డీపీ (స్థిరధరల ప్రకారం) 2014-2019 మధ్య టీడీపీ హయాంలో రెండంకెల వృద్ధి ఉంటే, వైసీపీ పాలనలో నెగెటివ్ గ్రోత్(-2.58)కు దిగజా ర్చారు. తలసరి ఆదాయం(స్థిరధరల ప్రకారం) టీడీపీ హయాంలో రెండంకెల్లో ఉంటే, వైసీపీ ఐదేళ్లలో సింగిల్ డిజిట్(1.03 శాతం)కు పడిపోయింది. అంతేకాకుండా తన ధన దాహంతో రాష్టంలోని 33 సంస్థల నుంచి, వాళ్లు దాచుకున్న డబ్బులు రూపాయి లేకుండా మొత్తం లాగేశారు.
గత ప్రభుత్వం ఏపీ స్టేట్ ఫైనాన్స్ లిమిటెడ్ 33 సంస్థల నుంచి తీసుకున్న నిధులు
సీరియల్ సంస్థ తీసుకున్నది(కోట్లలో)
1 స్త్రీనిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ రూ.750 కోట్లు
2 ఏపీ మారిటైమ్ బోర్డు రూ.1200 కోట్లు
3 ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ.555 కోట్లు
4 ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రూ.400 కోట్లు
5 కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్‌మెంట్ రూ.300 కోట్లు
6 ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రూ.240 కోట్లు
7 ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ రూ.200 కోట్లు
8 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూ.190 కోట్లు
9 ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ.145 కోట్లు
10 ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రూ.105 కోట్లు
11 ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రూ.100 కోట్లు
12 ఇతర సంస్థలు(22) రూ.553 కోట్లు
మొత్తం రూ.4,738 కోట్లు
జగన్ ధనవంతుడయ్యాడు…ప్రజలు పేదలయ్యారు
గడిచిన ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం అప్పులు, ఆర్థిక విధ్వంసమే కాకుండా ప్రజల నుంచి అనేక రూపాల్లో ముక్కు పిండి పన్నులు వసూలు చేసింది. చెత్త పన్ను, ఆస్తి పన్ను వసూలుకు వైసీపీ ప్రభుత్వం దా’రుణ’ పద్ధతులను అవలంభించింది. చెత్త పన్ను కట్టని షాపుల ముందు చెత్తపోయడం, ఆస్తి పన్ను కట్టని ఇళ్లలోకి అధికారులు, సిబ్బంది జొరబడి సామాన్లు బయటపడేయడం, జప్తు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. గతంలో ఎప్పు డూ లేని విధంగా పన్ను కట్ట లేదని ఇళ్లకు తాళాలు వేయడం, సీజ్ చేయడం, నీటి కొళాయి కనెక్షన్లు తొలగించడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అనాగరిక పన్ను వసూలు పద్ధతులు ప్రజలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వివిధ పన్నులను తగ్గించడమే కాకుండా చెత్త మీద పన్నును పూర్తిగా ఎత్తివేసింది. మిన్ను మన్నుని వదలక లూటీ చేసిన జగన్‌రెడ్డికి అధికారం కోల్పో యాక కూడా కనువిప్పు కలగలేదు. తన హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిం చింది చాలక ఆ పాపాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగడుతూ తన విష పత్రికలో కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తుందంటూ ప్రతి రోజూ విషం చిమ్ముతున్నాడు.
కూటమి వచ్చాక వివిధ రంగాలకు చేసిన ఖర్చులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చేసిన అప్పు రూ.24,000 కోట్లు. ఇందులో సింహ భాగం రూ.12,508 కోట్లు సామాజిక పెన్షన్ల కోసం ఖర్చు చేసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కలిపి సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు చేసింది. జగన్ రెడ్డి హయాంలో చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులకు 60,000 కోట్లు వడ్డీగా చెల్లించాలి. జగన్ హయాంలో ప్రభుత్వంలోని వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ నిధు లు బొక్కేసి లక్ష కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విడుదల చేసిన బకాయిలు
84,724 మంది రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)కి జగన్‌రెడ్డి పెట్టిన పాత బకాయిలు రూ.700 కోట్లు చెల్లించింది. నీరు-చెట్టు బిల్లులకు సంబంధించి రూ.256 కోట్లు విడుదల చేసింది. రాజ ధాని రైతులకు పెండిరగ్‌లో పెట్టిన వార్షిక కౌలు రూ.400 కోట్లు, గత ప్రభుత్వం గుడ్లు, చిక్కీ కాంట్రాక్టర్లకు బకాయి పెట్టిన రూ.178 కోట్లు చెల్లించింది. 640 మంది విద్యార్థులకు ఎన్టీఆర్ విదేశీ విద్య బకాయిలు రూ.33 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ బడుల్లో పని చేసే ఆయాలు, వాచ్‌మెన్ల గౌరవ వేతన బకాయిలు రూ.87.90 కోట్లు మంజూరు చేసింది. ఎప్పటినుంచో పెండిరగ్‌లో ఉన్న రూ.42 కోట్ల ఉపాధి హామీ బిల్లులు, రూ.33 కోట్ల రవాణా, గోతాముల బకాయిలు ఇచ్చారు. పేదల గృహ నిర్మాణ బకాయిలు రూ.50 కోట్లు చెల్లించారు. మదనపల్లె డిగ్రీ కాలేజీ సిబ్బందికి 23 నెలలుగా బకాయిపడ్డ జీతాలను విడుదల చేసింది. ఏడు నెలల తర్వాత సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కార్మికులకు 536 మందికి రూ.30 కోట్ల వేతన బకాయిలు చెల్లించింది. జూలైలో భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలకు రూ.36 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ, సెప్టెంబరులో సంభవించిన వరదలకు సం బంధించి నష్టపరిహారం రూ.782 కోట్లు విడుదల చేసింది.
సౌజన్య బొర్రా, అనలిస్ట్