- రానున్న వంద రోజులు కష్టపడండి
- చంద్రబాబును తిరిగి సీఎంగా చూడాలి
- జయహో బీసీ వర్క్‌షాపులో టీడీపీ నేతలు కొల్లు, కాలవ, పితాని, తదితరుల పిలుపు
అమరావతి, చైతన్యరథం: జయహో బీసీ పేరుతో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా 40రోజుల పాటు నిర్వహించ నున్న కార్యక్రమానికి సన్నాహకంగా గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ బీసీ సాధికార సమితి అధ్యక్షులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ వర్క్‌షాపులో టీడీపీ నేత లు మాట్లాడుతూ జగన్‌రెడ్డి బీసీల ద్రోహిలా మారాడని, బీసీలను అణగతొక్కడమే పనిగా పెట్టుకున్నాడని, అటు వంటి జగన్‌రెడ్డిని బీసీలంతా ఐక్యంగా పని చేసి ఇంటికి పంపించాల్సిందేనని స్పష్టంచేశారు. రానున్న వంద రోజు లు బీసీలంతా కష్టపడిచేసి బీసీల బాంధవుడయిన చంద్ర బాబును తిరిగి సీఎంగా చేయాలని పిలుపునిచ్చారు.
బీసీలపై రెడ్ల పెత్తనం: కొల్లు
ఈ వర్క్‌షాప్‌లో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలు గుదేశం పాలనలో బీసీల అభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యం గా అడుగులు వేశా మని అన్నారు. జగన్‌రెడ్డి వచ్చాక నిధులు లాక్కున్నాడు. విధులు లాక్కున్నాడు. అధికారాలు దూరం చేశాడు. అన్ని కీలక పదవుల్లో రెడ్లను పెట్టి బీసీలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. వందలాది మంది ప్రాణాలు తీశాడు. చేతి వృత్తులు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. జగన్ రెడ్డి వారి జీవితాలను రోడ్డున పడేశాడు. రూ.75 వేల కోట్లు దారి మళ్లించాడు. నామినేటెడ్ పదవులు, పను ల్లో మనకు అవకాశాలు లేకుండా ఒకే వర్గానికి ధారా దత్తం చేస్తున్నాడు. చదువులు దూరం చేస్తున్నాడు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు నాశనం చేశాడు. రాజ కీయంగా అవకాశాలు తొక్కి పెట్టాడు. బీసీలను జగన్ రెడ్డి కుటుంబ పెద్దల ముందు మోకరిల్లేలా చేస్తున్నాడు. రాష్ట్రాన్ని ఐదుగురు రెడ్లకు రాసిచ్చి బడుగు బలహీన వర్గాల వారిపై పెత్తనం చెలాయి స్తున్నాడు. ఇలాంటి జగన్ రెడ్డిని పరిగెత్తించేలా బీసీలు పని చేయాలన్నారు. అనంతరం ‘జయహో బీసీ’ కార్యక్రమానికి సంబంధిం చిన విధి విధానాలు వివరించారు. వచ్చే 40 రోజుల్లో దాదాపు 962 మండలాల్లో బీసీ కులాలను ఏకం చేస్తూ ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో ని ప్రతి బీసీ వ్యక్తినీ కలిసి వారి సమస్యలు పరిష్కరించ డమే ధ్యేయంగా అడుగులు వేయాలని కొల్లు పిలుపునిచ్చారు.
జగన్మోహన్‌రెడ్డి బీసీ ద్రోహి: పితాని
ఈ వర్క్‌షాప్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీనేనన్నారు. తెలుగుదేశం బీసీల పార్టీ. జగన్మోహన్ రెడ్డి బీసీ ద్రోహి. జగన్ రెడ్డి పాలనలో బడుగు, బలహీన వర్గాలు వేధింపులకు గురయ్యాయి.
ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లపాలు చేశారు. బీసీలకు జగన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళదాం. కులవృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఆర్థిక భరోసా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని పితాని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ పాలన ఎప్పుడూ బీసీలకు స్వర్ణయుగమే: దువ్వారపు
ఈ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ బీసీల అభివృద్ది, అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. వేదిక మీద ఉన్న నాయకులంతా టీడీపీలో ఎదిగిన వారే. టీడీపీ పాలనలో ఎప్పడూ బీసీలకు స్వర్ణయుగమే. బీసీలకు టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యత మరే ఇతర పార్టీ ఇవ్వదు. చంద్రబాబు నాయుడు బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేసి అనేక మందికి రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ హయాంలో బీసీ సబ్ ప్లాన్ కి ఏటా రూ. 10 వేల కోట్లు కేటాయించి నాలుగున్నరేళ్లలో సుమారు రూ. 36 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే. 2014-19 లో బీసీలకు 30 సంక్షేమ పధకాలు అమలు చేస్తే జగన్ రెడ్డి అన్నిటినీ రద్దు చేశాడు. విదేశీ విద్య, కార్పోరేషన్ రుణాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కమ్యూనిటీి భవన్‌లు అన్నీ నిలిపివేశారు. బీసీ రిజర్వేషన్లు 34 శాతానికి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే. జగన్ రెడ్డి ఆ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి 16,800 మందికి స్థానిక సంస్థల్ల్లో రాజకీయ పదవులు దూరం చేశారు. టీడీపీ హయాంలో కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కానీ జగన్ రెడ్డి నేడు కులగణన అంటూ బీసీల్ని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని దువ్వారపు పిలుపు ఇచ్చారు.
బడుగుల భగవంతుడు చంద్రబాబు: బీటీ నాయుడు
ఈ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బడుగుల భగవంతుడు చంద్రబాబు అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు స్వర్ణ యుగాన్ని అందించారు. ఈ ఐదేళ్ల పాలనలో జగన్ మోహన్ రెడ్డి.. బీసీలను బానిసలుగా చూశారు. తెలుగుదేశం నాయకుల్ని భయపెడితే ప్రజలు కూడా భయపడతారని కింజరాపు అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారు. ఆ రోజే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. యనమల రామకృష్ణుడు పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడిపైన అక్రమంగా రేప్ కేసు పెట్టి బీసీలను అణగదొక్కారు. చంద్రన్న హయాంలో మెజార్టీ శాఖలన్నీ బీసీ నాయకులకి ఇచ్చి గౌరవించారు. జగన్ పాలనలో బీసీలకు 56 కార్పోరేషన్లు అని చెప్పి కేవలం కుర్చీలు, టేబుళ్లకే పరిమితం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం రాబోతోంది. బీసీలకు గతంలో ఇచ్చినటువంటి పదవులకంటే ఉన్నతమైన స్ధానాలు రాబోతున్నాయి. యుగపురుషుడు నందమూరి తారక రామారావు గ్రామస్థాయిలో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించారు. చంద్రన్న స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేశారని దువ్వారపు రామారావు విమర్శించారు.
బీసీలను రాజకీయంగా అణగదొక్కారు: గణబాబు
ఈ వర్క్‌షాప్‌లో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ గతంలో రాచరికాలు ఉన్నప్పుడు సామంతరాజుల పరిపాలన చూశాం.. ఆ విధంగా రాష్ట్రాన్ని జగన్ మోహన్‌రెడ్డి 5 జోన్లుగా విభజించి కనీసం ఒక్క బీసీకి కూడా న్యాయం చేయలేదు.. అన్ని జోన్లకు రెడ్డి సామాజిక వర్గాన్ని సామంతులుగా ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా బల్ల గుద్ది మరీ బీసీ నాయకులతో చెప్పించారు. ఇలాంటి అబద్ధాలు చెప్పించడానికి మాత్రమే బీసీ నాయకులను వాడుకునే వ్యక్తి జగన్ రెడ్డి. గౌరవ ప్రదమైన పదవుల్లో ఉన్న నాయకులను కించపరిచేలా చేస్తున్నాడు జగన్ రెడ్డి. వైసీపీ పాలనలో ఓ వైపు అరాచకాలు, ఓ వైపు అక్రమ కేసులతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆర్థికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. విద్య, ఉపాధి, అణగారిన ప్రజలకు ఇచ్చే నిధులు అన్నీ రద్దయ్యాయి. విదేశీ విద్యతో బీసీలు ఉన్నతమైన స్థానాల్లో ఉండి సంపాదనా పరులవుతారనుకుంటే ఆ కార్యక్రమాలు రద్దు చేశారు. ఇక రాజకీయంగా ఉన్నతమైన పదవులు వస్తాయనుకుంటే బీసీలను రాజకీయంగా అణగదొ క్కారు. రాష్ట్రంలో ప్రజలు ఆర్థికంగా ముందుకు వెళ్లా లంటే అది ఒక్క చంద్రబాబు ద్వారానే సాధ్యమవు తుందని గణబాబు అన్నారు.