చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సంక్రాంతికి క్లీన్‌ రోడ్లు

పరవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

by చైతన్యరధం
Nov 3, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సంక్రాంతికి క్లీన్‌ రోడ్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.860 కోట్లు
  • డ్రోన్లతో రోడ్ల స్థితిగతులను అధ్యయనం చేస్తాం
  • రాష్ట్రానికి మంచి రోజులే కాదు, రోడ్లూ వస్తాయి
  • ఐదేళ్లలో సిమెంట్‌ రోడ్డు లేని వీధి ఉండదు
  • నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం
  • రూ.76 వేల కోట్లతో ఎన్‌హెచ్‌ రోడ్ల పనులు
  • రెండున్నర ఏళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యం..
  • వచ్చే ఐదేళ్లలో 1.25 లక్షల కోట్లతో ఎన్‌హెచ్‌లు
  • మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు పోర్టుల నిర్మాణం
  • ఉద్యోగ కల్పనకు ఎన్డీయే సర్కారు అధిక ప్రాధాన్యత
  • బెల్ట్‌ షాపులు పెడితే బెల్ట్‌ తీస్తా
  • ఆడబిడ్డలను విలాస వస్తువుగా చూస్తే ఖబడ్దార్‌
  • పరవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అనకాపల్లి (చైతన్య రథం): రాష్ట్రంలోని రోడ్లను వచ్చే సంక్రాంతికి గుంతలులేని రహదారులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్రాంతికి ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారు తమ రాష్ట్రంలోని రోడ్డును చూసి గర్వపడేలా రోడ్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.860 కోట్లతో చేపట్టిన గుంతలు లేని రహదారులు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి జిల్లా పరవాడలో శనివారం శ్రీకారం చుట్టారు. వెన్నెలపాలెం జంక్షన్‌ వద్ద రోడ్డు మరమ్మత్తు పనుల శిలాఫలకం ఆవిష్కరించి తానే స్వయంగా యంత్రాన్ని ఆపరేట్‌ చేసి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం కూటమి ప్రభుత్వం చేపట్టనున్న భవిష్యత్‌ కార్యాచరణను వివరించారు. సంక్రాంతి సమయంలో రోడ్లపైకి డ్రోన్లను పంపించి గుంతలను తనిఖీ చేయిస్తామని చెప్పారు. సకాలంలో రోడ్ల పనులను పూర్తి చేయని కాంట్రాక్టర్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

గత ఐదేళ్లలో రోడ్లను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలోని రోడ్లన్నీ నరకానికి రహదారులుగా తయారయ్యాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వీటన్నిటికీ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి రెండు నెలల్లో గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దే బాధ్యత రోడ్లు భవనాల శాఖపై పెట్టామన్నారు. రోడ్లు నాగరికతకు చిహ్నమని.. రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు రావడంతోపాటు అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని, మంచి రోడ్లు కూడా వస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అది పరవాడ నుంచే ప్రారంభమైందన్నారు.
రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో అన్ని రోడ్ల అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో రూ.76 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని, వీటిని రెండున్నరేళ్ల సమయలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. దీనికి అదనంగా మరో రూ.50 వేల కోట్లు ఖర్చు చేసి భోగాపురం- మూలపేట, అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు, విజయవాడ ఈస్ట్‌ బైపాస్‌ వంటి రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడిరచారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.1.25 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరగబోతున్నట్టు వెల్లడిరచారు

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2026

అభివృద్ధి కార్యక్రమాలతో స్వర్ణ కుప్పానికి నాంది

నలగంపల్లి నెట్ జీరో విధానం

దేశంలోనే అతిపెద్ద సముద్రతీరం రాష్ట్రానికి ఉందని, తద్వారా మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు అనేక పోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో రైల్వే రవాణా వ్యవస్థ అభివృద్ధికీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కోల్‌కతా చెన్నై మధ్య నాలుగు లేన్ల రైలు మార్గం ఏర్పాటు కానుందని, దీనివల్ల ప్రయాణ సమయం ఆదా కావడంతోపాటు ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతికి రైలుమార్గం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూ.2500 కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేసినట్టు సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా విశాఖకు రైల్వే జోన్‌ ఏర్పాటు కావలసి ఉందని, గత ఐదేళ్లలో రైల్వేజోన్‌కి అవసరమైన భూమిని కేటాయించడంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా ఆలస్యానికి కారణమైందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 52 ఎకరాల స్థలాన్ని ముడసరలోవ వద్ద కేటాయించడంతో త్వరలో రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు అధికంగా ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు అధిక ప్రోత్సాహకాలిచ్చేలా పారిశ్రామిక పాలసీ రూపొందించామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు, ఇంటికో పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దేలా అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోను ఒక ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నామని, తద్వారా యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించనునట్టు తెలిపారు. ఆయా గ్రామంలో లభించే వనరుల ఆధారంగానే చిన్నపాటి వ్యాపారాలు, పరిశ్రమలను ఏర్పాటు చేయించేలా చర్యలు చేపడతామన్నారు.

వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఎడమ కాల్వ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలవరం నీటిని అందించి అనకాపల్లిని కరవు, పేదరికం రహిత జిల్లాగా రూపొందిస్తామన్నారు అనకాపల్లి ప్రజలు నీతికి నిజాయితీకి మారుపేరు అని నిరూపించారని, మూడు రాజధానులు అనే పేరుతో మోసం చేయాలని చూసినా మూడు రాజధానులు మాకొద్దు అభివృద్ధి ముద్దు అంటూ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారని చంద్రబాబు అన్నారు.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌ అంటూనే.. దీన్ని లాభాల బాటలోకి నడిపేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు కేంద్రంతో చర్చిస్తామన్నారు.

రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో పెద్దఎత్తున సిమెంట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్డు లేని వీధి లేకుండా చేస్తామన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో 24 వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్లను నిర్మించిన విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చే ఐదేళ్లలో అన్ని రోడ్లను సిమెంట్‌ రోడ్లుగా మారుస్తామన్నారు. త్వరలోనే డ్వాక్రా మహిళలకు డ్రోన్లు అందజేయనున్నామని, వాటిని వినియోగించి రైతుల పంట పొలాల్లో పురుగు మందులు చల్లేవిధంగా చర్యలు చేపడతామన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీలో ఆడబిడ్డలే పైస్థానంలో ఉండేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళలు, ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మహిళను విలాస వస్తువుగా భావించే వారికి కఠిన దండన తప్పదని పేర్కొంటూ ఖబర్దార్‌ అన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళలపై అకృత్యాలను నిరోధించే విధంగా చర్యలు చేపడతామన్నారు.

మద్యం పాలసీ అమలు విషయంలో రాజీపడబోమని, ఎక్కడ బెల్ట్‌ షాపు పెట్టినా బెల్ట్‌ తీస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరదలు వంటి ప్రకృతి విపత్తుల సందర్భంగా డ్రోన్‌ టెక్నాలజీని వినియోగించే విధానానికి మన రాష్ట్రంలోనే శ్రీకారం చుట్టామన్నారు ఇటీవల విజయవాడ వరదల్లో బాధితులకు మందులు, నిత్యావసరాలు అందించేందుకు ప్రయోగాత్మకంగా డ్రోన్లను వినియోగించామని చంద్రబాబు వివరించారు. అలాగే, రాష్ట్రంలో గత ఐదేళ్లలో గాడితప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సభలో నవ్వులు పూయించిన సీఎం
దీపం పథకంలో మహిళలకు ఉచితంగా వంట గ్యాస్‌ సిలిండర్‌లను అందించే కార్యక్రమం ద్వారా తాను కూడా టీ చేయడం నేర్చుకున్నానని చెబుతూ సబికులను నవ్వించారు. ఉద్యోగానికి వెళ్లివచ్చిన భార్యలకు మగవారు టీ చేసివ్వడం లాంటి చర్యలతో తమతో సమానంగా మహిళలను గౌరవించవచ్చన్నారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్‌ అండ్‌ బి కాంట్రాక్టర్‌లకు చెల్లించాల్సివున్న రూ.1061 కోట్ల బకాయిలు చెల్లించడంతో పాటు, రోడ్ల మరమ్మతులకు రూ.860 కోట్లు మంజూరు చేయడం ద్వారా తమ శాఖ తలెత్తుకునేలా చేశారని చెప్పారు.

రోడ్లు భవనాలు శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై ప్రజంటేషన్‌ ఇస్తూ.. రాష్ట్రంలో 20 వేల కిలోమీటర్ల రహదారులు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని సీఎంకు వివరించారు. వెంటనే వివిధ పద్దులకింద రూ.860 కోట్లను రోడ్ల మరమ్మతు పనుల కోసం మంజూరు చేశారని చెప్పారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేసి గుంతలు లేని రహదారులుగా రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, శాసన సభ్యులు పంచకర్ల రమేష్‌ బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, సుందరపు విజయ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌, అర్బన్‌ మౌలిక వసతుల కార్పొరేషన్‌ చైర్మన్‌ పివిజి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

ప్రజా కోర్టులో చర్చించాలి

Next Post

రెండురోజుల్లో సూపర్‌ ప్లాన్‌!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2026

కార్యకర్త
@ July 6, 2026
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి కార్యక్రమాలతో స్వర్ణ కుప్పానికి నాంది

చైతన్యరధం
@ July 6, 2026
నలగంపల్లి నెట్ జీరో విధానం
ఆంధ్రప్రదేశ్

నలగంపల్లి నెట్ జీరో విధానం

చైతన్యరధం
@ July 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-07-2026

కార్యకర్త
@ July 5, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026

కార్యకర్త
@ July 4, 2026
ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ
ఆంధ్రప్రదేశ్

ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ

చైతన్యరధం
@ July 4, 2026
మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు
ఆంధ్రప్రదేశ్

మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు

చైతన్యరధం
@ July 4, 2026
రైతు పొట్టగొట్టే కుట్రలా?
ఆంధ్రప్రదేశ్

రైతు పొట్టగొట్టే కుట్రలా?

చైతన్యరధం
@ July 4, 2026
Load More

ముఖ్య వార్తలు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి కార్యక్రమాలతో స్వర్ణ కుప్పానికి నాంది

చైతన్యరధం
@ July 6, 2026
నలగంపల్లి నెట్ జీరో విధానం

నలగంపల్లి నెట్ జీరో విధానం

చైతన్యరధం
@ July 6, 2026
ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ

ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ

చైతన్యరధం
@ July 4, 2026
మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు

మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు

చైతన్యరధం
@ July 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist