- అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి
- బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
అమరావతి(చైతన్యరథం): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అతిసారం కారణంగా ముగ్గురు మృతిచెందారన్న సమాచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. మరణాలు జరిగిన ప్రాంతంలో ప్రజల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయడంతో పాటు….అవసరాన్ని బట్టి ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. అతిసారం ప్రబలిన అభ్యుదయ కాలనీలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యాధికారులను ఆదేశించారు.