- ఎంపీ పదవితో ప్రజల సొమ్ము దోచుకున్న భరత్ రామ్
- జగన్‌రెడ్డి మెప్పు కోసం వ్యక్తిగత విమర్శలు తగదు
- ఆవ భూములపై మాట్లాడే ధైర్యం భరత్‌రామ్‌కి ఉందా?
- మాజీ మంత్రి కె.ఎస్.జవహర్
అమరావతి: జగన్ రెడ్డి మెప్పుకోసమో, తాడేపల్లి పెద్దల కరుణ కోసమో పిల్ల మనస్తత్వంతో ఎంపీ భరత్ రామ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ హితవు పలికారు. మం గళవారం ఆయన జూమ్ ద్వారా విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. కోతికి కొబ్బరి చిప్పలా భరత్‌రామ్‌కి ఎంపీ పదవి దొరికింది. దాన్ని అడ్డుపెట్టుకొని సంపద పోగేసుకోవడమే గానీ, ప్రజా సమస్యలు, అభివృద్ధిపై ఆయ నకు ఏమాత్రం అవగాహన లేదు. ఆవ భూముల్లో జరిగిన అక్రమార్జన గురించి భరత్ బయటకు చెప్పగ లడా? ఆవ భూముల్లో దోచుకున్నదెంత? తన పార్టీ వారితో ఆయనకు రావాల్సిన వాటాలు తేలాయా? ఆ భూముల్లో ఇళ్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తున్నారో ఎంపీ చెప్పాలి. భరత్‌రామ్ ఎంపీగా రాజ మహేంద్ర వరానికి ఏంచేశాడో చెప్పగలడా? పబ్లిసిటీ స్టంట్ కోసమే భరత్ రామ్ ప్రజల్లోకి వస్తాడు. తన పార్టీ ఎంపీ అయిన రఘురామరాజుపై ఫిర్యాదులు చేయడంలో చూపుతున్నశ్రద్ధలో సగమైనా తన నియోజకవర్గ సమస్యలపై చూపితే బాగుండేది. ఉభయగోదా వరి జిల్లాలకు ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ మూడున్నరేళ్లలో ఏంచేశారో భరత్ చెప్పగలడా? కొవ్వూరు నియోజకవర్గంలో జరిగే ఇసుక దోపిడీపై భరత్ ఎందుకు మాట్లాడడు? అమరావతి రైతులకు నిరసనగా నల్లబెలూన్లు ఎగరేస్తే గొప్పనాయకులు కారని వైసీపీ ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలి. హైదరాబాద్ గురిం చి మాట్లాడే వైసీపీ నేతలంతా ఆ నగరం ఒక్కరోజు లోనే అభివృద్ధి చెందలేదని ఎందుకు తెలుసు కోలేకపోతున్నారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం వృద్ధిలోకి వస్తుందన్న విషయం వైసీపీ వారికి తప్ప, ప్రజలందరికీ తెలుసు. ఆదానీకి పోర్టులు కట్టబెట్టడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందా? భరత్ రామ్ ఏమీ తెలియని పసికూన.. ఏదో గాలిలో గెలిచి, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.