- చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన అధికారులు
- నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేకాధికారులు
- ఆగస్టు 15 నుంచి ఇంటి దగ్గరకే వైద్యసేవలు ప్రారంభం
- ఆయా జిల్లాలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి చర్యలు
- అడవుల విస్తీర్ణం పెంపునకు 13.5 కోట్లతో విత్తనాలు
- 4జీ కనెక్టివిటీ కోసం 5,423 గ్రామాల్లో 2,305 టవర్లు
- పర్యాటకాభివృద్ధి కోసం స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్టులు
- రాష్ట్రంలో రూ.192 కోట్లతో రోడ్ల మరమ్మతులు ప్రారంభం
అమరావతి(చైతన్యరథం): కలెక్టర్ల సదస్సులో ఆయా శాఖలకు సంబంధించి ఐఏఎస్ అధికారులు తమ శాఖల్లోని వివరాలను వెల్లడిరచారు. ప్రైమరీ, సెకండరీ సెక్టార్లలోని అంశాలపై చర్చ జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సీఆర్డీఏ, హెల్త్ సెక్టార్, అటవీశాఖ, పరిశ్రమలు/మౌలిక సదుపాయాలు, హౌసింగ్, టూరిజం, పంచాయతీరాజ్ విభాగాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆయా శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాలు, అమలవుతున్న పథకాలు, కోర్టుల్లో ఉన్న కేసులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు. అలాగే ఆయా శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాలను ఆయా శాఖల అధిపతులు వెల్లడిరచారు.
నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేకాధికారులు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో నిత్యావసరాల ధరల నియంత్రణ కోసం జిల్లాకో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 వేల చౌక దుకాణాల్లో త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. చౌక దుకాణాల్లో ప్రతినెలా స్టాకు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధాన్యం సేకరణ కూడా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, పంట పండిరచిన కౌలు రైతులకే వారి పంట సొమ్ము దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రైమరీ సెక్టార్‌లోని అంశాలపై చర్చ
ప్రైమరీ సెక్టార్‌పై చర్చలో వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బి.రాజశేఖర్ ఆయా విభాగాలకు సంబంధించి కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ముఖ్యంగా లైవ్ స్టాక్ సెన్సస్, రివ్యూ ఆఫ్ ఆల్ వెటర్నరీ క్లినిక్స్, సీడ్ డిస్ట్రిబ్యూషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ పశుసంవర్థక శాఖ లక్ష్యాలు, చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. అనంత రాము మాట్లాడుతూ చేంజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ అంశం గురించి వివరించారు.
ఏపీఐఐసీ భూ సమస్యలు పరిష్కరించాలి
ఎన్.యువరాజ్ మాట్లాడుతూ క్రిటికల్ రోల్ ఫర్ ఇంప్రూవింగ్ ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ గురించి వివరించారు. సెకండరీ సెక్టార్/ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని ఇండస్ట్రీస్, హ్యాండ్‌లూమ్స్/టెక్స్‌టైల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్, ఎనర్జీ, టీఆర్‌బీ అంశాలపై చర్చించారు. ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల ప్లాన్ గురించి తెలిపారు. ఏపీఐఐసీ భూ సమస్యలు, కోర్టుల్లో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ మేటర్స్, ఎంఎస్‌ఎంఈ అంశాల్లో తీసుకో వా ల్సిన చర్యలు వివరించారు. కె.సునీత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయు క్తంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించారు. నాబార్డు ఆధ్వర్యంలో తీసుకుంటు న్న చర్యలను తెలిపారు. ఏటికొప్పాక బొమ్మలు, వెంకటగిరి చీరలు, కలంకారీ, మాడుగుల హల్వా, కోనసీమ కొబ్బరి, కాకినాడ కాజ, గోంగూర, బనానా ప్రసిద్ధి, రాష్ట్రంలో ఉత్పత్తుల గురించి పేర్కొన్నారు.
శరవేగంగా పోర్టుల నిర్మాణాలు
పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.సురేష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. 9 ఫిషింగ్ హార్బర్లలో 4 హార్బర్ల నిర్మాణం జరుగుతోందని, బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, ఓడరేవు, కొత్తపట్నం ప్రారంభం కావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో విమానాశ్రయా లను అప్ గ్రేడ్ చేస్తున్నామని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 32 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో సదుపాయాలు మెరుగు పర్చేందుకు చర్యలు చేపడుతున్నామని, తిరుపతి విమానాశ్రయంలో రన్ వే పెంపు, టోర్మినల్ అప్ గ్రేడ్‌కు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం, పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లో విమానాశ్రయాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు పైప్ లైన్ గ్యాస్ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు కార్యాచరణ, ప్రణాళికను వివరించారు. కె.విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ రంగం, జిల్లాల్లో కరెంట్ సరఫరా గురించి వివరించారు. పీఎం – సూర్య ఘర్, ముఫ్ట్ బిజిలి యోజన రాయితీల గురించి తెలిపారు.
సామాజిక సంక్షేమంపై చర్చ
సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ వెల్ఫేర్, ఉమెన్/ చైల్డ్ వెల్ఫేర్ అంశాలపై చర్చలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కె.కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రీ మెట్రిక్ హాస్టల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, రెసిడెంట్ స్కూల్స్ సంఖ్యా వివరాలు వెల్లడిరచారు. 2023`24 ఏడాది అడ్మిషన్లను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలను వెల్లడిరచారు. వచ్చే ఏడాదికి సోషల్ సెక్టార్‌లో లక్ష్యాలను విశదీ కరించారు. జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు, ఈడబ్ల్యూఎస్ పి.భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ వెల్ఫేర్ స్థితిగతుల గురించి వివరించారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యద ర్శి కె.హర్షవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములు, వాటి సర్వే వివ రాలు, 2025, 2026, 2027 లక్ష్యాలను తెలిపారు.
మహిళా శిశు సంక్షేమంపై చర్చ
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శి ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాస్తవ పరిస్థితుల గురించి వెల్ల డిరచారు. 18 ఏళ్లు నిండక ముందే జరుగుతున్న బాల్య వివాహాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పోషకాహారాల లెక్కలను తెలిపారు. జన రద్దీ ఉండే బస్టాండ్‌లు వంటి ప్రాంతాల్లో తల్లులు పిల్లలకు పాలిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఆగస్టు 15 నుంచి ఇంటికే వైద్యసేవలు
హెల్త్ సెక్టార్‌పై చర్చలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ 2027 నాటికి టీబీ నోటిఫికేషన్ 100 శాతం, 2027 నాటికి ఫైలేరియా జీరో కేసులు, 2027 నాటికి లెప్రసీ జీరో కేసులు లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. 14416 నెంబరుతో టెలి మానస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డి అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎన్‌క్యూఎస్ సర్టిఫికేషన్‌లో 760 ఫెసిలిటీస్ సర్టిఫై చేయించామని, 2025-26 ఏడాది నాటికి వంద శాతం సెంటర్లను ఎన్‌క్యూఎస్ సర్టిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్నామని తెలిపారు. ఆగస్టు 20న డీ వార్మింగ్ డే సందర్భంగా 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేయాలని సూచించారు. చంద్రన్న సంచార రథం ద్వారా పీహెచ్‌సీ వైద్యులను గృహ వైద్యసేవలకు పంపిస్తున్నామని వివరించారు. ఆగస్టు 15 నుంచి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 1.56 కోట్ల పీఎం జేఏవై ఆయుష్మాన్ భారత్ కార్డులు నమోదు జరిగిందని, 38 లక్షల మందిని నమోదు చేయాల్సి ఉందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవలో 4.3 కోట్ల మందికి అర్హత ఉందని, వీరిలో 1.94 కోట్ల మందికి పీఎం జేఏవైలో అర్హత ఉందని వెల్లడిరచారు.
ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, సీఆర్డీఏ, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ, సెర్ప్, ఆర్‌డబ్ల్యూఎస్) అంశాలపై చర్చలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.కె.సింఘాల్ మాట్లాడుతూ 39,399 మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు, 120 టిడ్కో కాలనీలకు సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. 12.66 లక్షల ఇళ్లకు ఏఎంఆర్‌యూటీ, ఏఎంఆర్‌యూటీ 2.0, ఏపీయూ డబ్ల్యూఎస్‌ఎస్‌ఎంఐపీ తదితర పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లు, సెప్టెంబర్ 23న మరో 83 అన్న క్యాంటీన్లు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద 7,013 టీపీడీ కెపాసిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేయడం జరిగిందన్నారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద రూ.317 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు.
పంచాయతీరాజ్ పథకాలపై చర్చ
పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. పంచాయతీరాజ్ ఇనిస్టి ట్యూషన్స్ (3 టైర్ సిస్టమ్), ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, జలకళ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ (సెర్ప్), ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, జల్‌జీవన్ మిషన్, స్టేట్ డెవలప్‌మెంట్ స్కీమ్, ఎన్టీఆర్ సుజల, రూరల్ రోడ్స్, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్ర మాల విశిష్టతను వెల్లడిరచారు. వచ్చే ఏడాది సెర్ప్ లక్ష్యాలను పేర్కొన్నారు.
నిర్మాణ దశలో 87,184 ఇళ్లు
హౌసింగ్, టూరిజం, యూత్/స్పోర్ట్స్, ఐటీఈ అంశాలపై చర్చలో అజయ్ జైన్ మాట్లాడుతూ గృహ నిర్మాణ రంగంలో డెవలప్‌మెంట్, వెల్ఫేర్, ఎంప్లాయిమెంట్ జనరేషన్, పావర్టీ ఎలివేషన్ వంటి కార్యక్రమాల వివరాలను వెల్లడిరచారు. పీఎంఏఎంవై (అర్బన్), పీఎంఏఎంవై (రూరల్), పీఎం జన్‌మన్, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కార్యక్రమాల వివరాలు వెల్లడిరచారు. మొత్తం 26,28,353 ఇళ్లకు అనుమతి లభించగా 11,42,049 ఇళ్లు ఇప్ప టికే పూర్తయ్యాయని తెలిపారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 5,44,113 ఇళ్లు మం జూరైతే ఇప్పటికే 4,56,929 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని, 87,184 నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు.
స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్టులు
వినయ్‌చంద్ మాట్లాడుతూ సింహాచలం, అన్నవరం, వేదగిరి ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశ్ దర్శన్ 2.0 కింద అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లంబసింగి, కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టుల వివరాలను వివరించారు. అలాగే నంద్యాల జిల్లా అహోబిళం, పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ వద్ద చేపట్టిన ప్రాజెక్టుల స్థితిగతులను పేర్కొన్నారు. పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, నోవాటెల్ హోటల్స్, హయ్యత్ రీజెన్సీ హోటల్, మే ఫెయిర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ నిర్మాణాలు చేపట్టినట్టు వివరించారు.
4జీ కనెక్టివిటీ కోసం 2,305 టవర్లు
సౌరభ్ గౌర్ మాట్లాడుతూ పబ్లిక్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్, సీఎం కోర్ డాష్ బోర్డ్, డిస్ట్రిక్ట్ ఆర్టీజీ సెంటర్స్, సీసీ కెమెరాలు, ఈ ప్రొక్యూర్‌మెంట్ తదితర అంశాల గురించి వెల్లడిరచారు. జిల్లాల వారీగా 4జీ కనెక్టివిటీ వివరాలను వివరించారు. 5,423 గ్రామాల్లో 2,305 టవర్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
రూ.192 కోట్లతో రోడ్ల మరమ్మతులకు చర్యలు
రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు గురించి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,653 కిలోమీటర్ల స్టేట్ హైవేలు, 32,725 కిలోమీటర్ల నేషనల్ హైవేలు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 45,378 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. 11,038 కిలోమీటర్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. రూ.192 కోట్లతో 3,971 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు జరుగుతు న్నాయని తెలిపారు. రూ.284 కోట్లతో 7,067 కిమీ మేర రోడ్లకు మరమ్మతులకు ప్రభు త్వం అనుమతులు ఇచ్చిందని తెలిపారు. రూ.2,153 కోట్లతో 5,731 కిమీ మేర కొత్త రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
అడవుల విస్తీర్ణం పెంపునకు చర్యలు
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరామ్ మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉపాధి హామీలో భాగంగా గతంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగేదని, గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఇది జరగలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ మొక్కలు నాటే కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించాలని సూచించారు. అలాగే వనం-మనం, నీరు చెట్టు, వనం పిలుస్తోంది వంటి కార్యక్రమాలు పెద్దఎత్తున చేట్టాలని ఆదేశిం చారు. రాష్ట్రంలో హరిత ఛత్రం (గ్రీన్ కవర్) విస్తరించడానికి కావాల్సిన చర్యలు తీసుకో వాలని సూచించారు. అడవుల విస్తీర్ణం పెంచే చర్యల్లో భాగంగా రూ.13.5 కోట్లతో విత్తనాలు వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి జిల్లాలో 50 లక్షల విత్తనాల సీడిరగ్ పనులు చేపట్టే కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షించాలని కోరారు.