చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

కొండవీటి వాగు, పాలవాగులపై బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి

by చైతన్యరధం
Jun 14, 2026 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,393 మాత్రమే
  • కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కంటే తక్కువ ఖర్చు
  • గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమే
  • మున్సిపల్ మంత్రి నారాయణ స్పష్టీకరణ
  • కొండవీటి వాగు, పాలవాగులపై బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి

అమరావతి (చైతన్య రథం): అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి నిర్మాణాలపై వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే రాజధానిలో నిర్మిస్తున్న భవనాల వ్యయం పూర్తిగా సహేతుకంగానే ఉందని చెప్పారు.

అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ నివాస సముదాయాలకు రూ.984 కోట్లతో టెండర్ ఖరారైందని, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు కేవలం రూ.3,393 మాత్రమే అవుతోందని తెలిపారు. అలాగే గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణానికి రూ.1,003 కోట్లతో టెండర్ ఖరారైందని, చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమే వ్యయం అవుతోందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,234 కోట్లతో టెండర్ ఖరారైందని, దాని నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,945గా ఉందని మంత్రి వెల్లడించారు. ఈ గణాంకాలను పోల్చి చూస్తే అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్, గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కంటే తక్కువగా ఉందని స్పష్టమవుతోందన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

రాజధానిలో నిర్మిస్తున్న అనేక భవనాలు సాధారణ భవనాలు కాదని, రాష్ట్ర ప్రతిష్ఠను చాటే ఐకానిక్ నిర్మాణాలని మంత్రి తెలిపారు. భవిష్యత్తు అవసరాలు, ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. అందువల్ల కొన్ని ప్రత్యేక భవనాలకు వ్యయం ఎక్కువగా కనిపించినా, వాటి నాణ్యత మరియు ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో పార్లమెంట్ భవనం నిర్మాణం, తెలంగాణ సచివాలయం నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో కూడా మొదట పిలిచిన టెండర్ల అంచనాలతో పోలిస్తే పనులు పూర్తయ్యే సమయానికి వ్యయం పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే అమరావతి నిర్మాణాల విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగులపై జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి, రాజధాని నిర్మాణంలో వరద నీటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కొండవీటి వాగు, పాలవాగులపై మొత్తం 69 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని, అందులో వాగులపై 43 బ్రిడ్జిలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు వివరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జిల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థలు, నీటి ప్రవాహ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బ్రిడ్జిల నిర్మాణం వల్ల నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గకుండా అన్ని సాంకేతిక ప్రమాణాలు పాటిస్తున్నామని పేర్కొన్నారు.

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం కానుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఒకే ప్రాంతంలో పనిచేసే విధంగా అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు అమరావతి నిర్మాణాలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ప్రజలకు వాస్తవాలు తెలుసునని, అభివృద్ధిని అడ్డుకునే విధంగా అసత్య ప్రచారాలు కొనసాగిస్తే ప్రజల నుంచి మరింత తిరస్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అమరావతి నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని, ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Previous Post

మద్యపాన నిషేధం మాట తప్పి రూ.3500 కోట్లు దోచుకున్నారు

Next Post

తుది దశకు విశాఖ`రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist