- వివేకా హత్యకేసులో జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- విచారణలో జ్యాప్యాన్ని ప్రశ్నించిన సునీత
- జగన్‌రెడ్డిని సీబీఐ ఎందుకు ప్రశ్నించలేదు?
- హంతకులకు ఎందుకు అండగా ఉంటున్నారు
- దోషులను శిక్షిస్తానన్న హామీ ఏమైందీ?
- తన పోరాటానికి ప్రజలు మద్దతు కోరిన సునీత
- ఎన్నికల్లో పోటీ చేసే సంకేతం
- అన్న జగన్ వ్యక్తిత్వాన్ని ఎండగట్టిన చెల్లెలు
గత ఐదేళ్ళుగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్న వివేకానందరెడ్డి హత్య విషయంలో అన్న జగన్‌మోహన్‌రెడ్డి పాత్రపై చెల్లెలైన డాక్టర్ సునీతా రెడ్డి శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు కోరారు. ఢల్లీి లో నిర్వహించిన ప్రతికా సమావేశంలో తండ్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య, గత ఐదేళ్ళుగా విచారణలో జరిగిన జాప్యం, ఈ మొత్తం కాండలో జగన్‌రెడ్డి పాత్ర గురించి సుదీర్ఘంగా ఆమె వివరించారు. వివేకా హత్యకేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ ముందు, పలు కోర్టుల్లోనూ వాంగ్మూలాలిచ్చిన సునీత కేసుకు సంబంధించిన విషయాలపై బాధ్యతాయుతంగా ఆచితూచి మాట్లాడారు.
అయితే.. జగన్‌రెడ్డి పార్టీకి మాత్రం రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయవద్దని ప్రజలకు సూటిగా, స్పష్టంగా సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలా చేయడానికి కారణాలను కూడా ఆవిడ వివరించారు. హంతకులు పాలకులుగా ఉండరాదని కుండబద్దలు కొట్టి చెప్పారు. సమాజంలో ప్రముఖుడైన తన తండ్రి వివేకానందరెడ్డి హత్యకు గురైనా.. సంబంధిత కుట్రదారులు, హంతకులెవరో ఇంతవరకు గుర్తించలేదని, అలాంటి దుర్మార్గులకు తగు శిక్ష పడకపోతే సమాజమంతా నేరమయమవుతుందని, కుట్రదారులు, హంతకులకు అండగా ఉండేవారు అధికారంలో ఉంటే ఇలాగే జరుగుతుందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ళుగా తాను న్యాయపోరాటం చేస్తున్నానని, కేసు విచారణలో ఆశించిన ప్రగతి జరగలేదని, తన పోరాటానికి ప్రజల మద్దతు కావాలని ఆవిడ కోరారు. ఇటువంటి నేపథ్యంలో.. ప్రజలు ఎటువంటి భయాలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలంటే రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వెయ్యవద్దని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం…
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఓటమికి పిలుపునిచ్చిన మీరు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ఒక విలేకరి అడుగగా.. అందుకు అవకాశాలున్నాయని, ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేదని సునీత తెలిపారు. ఒక వేళ పోటీచేస్తే వైఎస్ కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నా లేకపోయినా, న్యాయాన్ని సమర్థించే ప్రజల మద్దతు మాత్రం ఉంటుందన్నారు. తాను న్యాయ పోరాటం ప్రారంభించినప్పటి నుండి దాదాపు అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల వారు తనకు మద్దతు తెలిపారంటూ వారందరికి సునీత ధన్యవాదాలు తెలియజేశారు.
జగన్‌రెడ్డిని సీబీఐ ఎందుకు ప్రశ్నించలేదు?
తన తండ్రి హత్య గురించి జగన్‌రెడ్డి పరస్పర భిన్న మైన వ్యాఖ్యలు చేశారని, మొదట గుండెపోటుతో మర ణించారని వ్యాఖ్యానించి తరువాత గొడ్డలి వేటుకు బలై య్యారని చెప్పారని, ఈ మొత్తం కేసులో సీబీఐ ఆయన ను ఎందుకు ప్రశ్నించలేదని సునీత అన్నారు. వివేకా హత్య సమాచారం జగన్‌రెడ్డికి చేరిన వైనం నుంచి, అవినాష్‌రెడ్డి వంటి దోషులు అరెస్టు తప్పించుకొని తిర గటం, ఇతర దోషుల ప్రవర్తన, విచారణలో జరుగు తున్న తీవ్ర జాప్యం వరకు జగన్‌రెడ్డి సర్వం తానై వ్యవ హరించినట్లు స్పష్టమైందని, ఆయన మరల అధికారం లోకి రాకూడదని, వస్తే హంతకులకు అండగా ఉంటా రని సునీత పునరుద్ఘాటించారు. తనను, తన భర్తను సీబీఐ ప్రశ్నించిందని, విజయసాయిరెడ్డిని ఇంత వరకు ఎందుకు విచారించలేదని అడిగారు.
పత్రికా సమావేశం ఎందుకు?
రెండు కారణాలతో తాను పత్రికా సమావేశం పెట్టా నని సునీతారెడ్డి తెలిపారు. వివేకా హత్యకేసులో జరు గుతున్న తీవ్ర జాప్యాన్ని మీడియా ద్వారా వివరించి విచారణను సీబీఐ వేగిర పరిచేలాచేయడం,తన న్యాయ పోరాటానికి ప్రజల మద్దతుకోరటం ప్రధాన ఉద్దేశాలని సునీత వివరించారు.
హంతకులు పాలకులుగా ఉండకూడదని, సమాజ వికాసానికి తోడ్పడే ప్రజాస్వామ్యం గెలవాలని, కేవలం తన స్వార్థం, తన వారి మేలు మాత్రమే కోరుకునే వారి కి ప్రజలు మద్దతు ఇవ్వకూడదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు న్యాయం వైపు నిలబడి నిరంతరం మోసాలకు పాల్పడే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని ఓడిరచాలని డాక్టర్ సునీతా రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విచారణలో జాప్యం…
2019 మార్చిలో తన తండ్రి హత్యజరిగిన వెంటనే ప్రతిపక్ష నాయకునిగా సీబీఐ విచారణ కోరిన జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక తన వైఖరి మార్చుకోవడం, విచారణ జరుపుతున్న సీబీఐ అధికా రులపై కేసులు,వారికి అవరోధాలు సృష్టించడం, సహ కరించకపోవడం, పలురకాల ఒత్తిళ్లు తీసుకురావడం తో కేసు విచారణలో తీవ్ర జాప్యం జరిగి హంతకులు తప్పించుకు తిరగడంపై సునీతారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై 12 సీబీఐ కేసులు నమోదై 11 ఏళ్ళు పై బడినా ఇంకా న్యాయ విచారణ మొదలు కాలేదని..వివేకా హత్య కేసుకు కూడా అదే గతి పడుతుందేమోనన్న ఆందోళన ఉందని ఆమె అన్నారు. సీబీఐ విచారణ రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతుందని, విచారణను శీఘ్రతరం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అన్న జగన్‌రెడ్డి అండతో అవినాష్‌రెడ్డి స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడని.. ఆయనకు శిక్ష పడాలని.. తప్పకుండా పడుతుందని, అది జరగాలంటే త్వరలో న్యాయ విచారణ మొదలుకావాలని డాక్టర్ సునీతా రెడ్డి ఆశించారు. ఈ కేసులో తన పాత్ర ఏమీలేక పోతే శీఘ్ర నేరపరిశోధన, న్యాయ విచారణల పట్ల ఆత్రుత చెందవలసిన అవినాష్ రెడ్డి పలు వాయిదాలు కోరి జాప్యానికి కారణమవ్వడం గమనించవలసిన విషయమన్నారు.
జగన్‌రెడ్డిని ఎండగట్టిన సునీతారెడ్డి…
తనను గురించి తానుతరుచుగా ఘనంగా చెప్పు కునే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని డాక్టర్ సునీతారెడ్డి పత్రికా సమావేశంలో పలువిధాలుగా ఎండగట్టారు.
- మాటతప్పను.. మడమ తిప్పను అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి..తన తండ్రి హంతకుల ను వీలైనంత త్వరలో పట్టుకుని శిక్ష పడేలా చేస్తానని తనకు హామీ ఇచ్చి పూర్తిగా విద్రోహానికి పాల్పడ్డాడని.. ఇచ్చిన హామీకి పూర్తి భిన్నంగా వ్యవహరించాడని సునీత అన్నారు.
- నా అక్కలు.. నా చెల్లెళ్ళు అంటూ వల్లెవేసే జగన్‌రెడ్డి సొంత చెల్లెళ్ళకే అన్యాయం చేసారని సునీత వ్యాఖ్యానించారు.
- విశ్వసనీయత నా బలం అంటూ చెప్పుకునే ముఖ్య మంత్రి వివేకా హత్య కేసులో ఆది నుంచి వ్యవహరించిన తీరు అతన్ని నమ్మక ద్రోహిగా నిలబెట్టిందని ఆమె చెప్పారు.
- దుష్టచతుష్టయంతో పోరాడుతున్నానని చెప్పు కునే ముఖ్యమంత్రి సొంత బాబాయిని హత్య చేసిన దుష్టులకు ఎందుకు అండగా ఉంటున్నాడని నిలదీశారు.
- పెత్తందారులతో పోరాడుతున్నానని మాట్లాడే ముఖ్యమంత్రి సొంత బాబాయినే చంపిన పెత్తం దారుల పక్షాన ఎందుకు ఉంటున్నాడని చెల్లెలు సునీత ప్రశ్నించారు.