- పారదర్శకతా లోపం.. రాజ్యాంగ విరుద్ధం
- సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు
- వివరాలు వెల్లడిరచాలంటూ ఎస్బీఐకి ఆదేశం
ఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే పథకంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ‘ఎన్నికల బాండ్లు’ రాజ్యాంగ విరుద్ధమని, అది సమాచార హక్కును హరిస్తుందంటూ `సార్వత్రిక ఎన్నికలకు ముందు తీర్పు వెలువడటం రాజకీయపార్టీలకు గొంతులో పచ్చి వెలక్కాయే. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో ఉటంకించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునివ్వడం గమనార్హం. ఎటువంటి వివరాలు తెలియని
ఎన్నికల బాండ్లను స్వీకరించడమంటే సమాచార హక్కు ను ఉల్లంఘించడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నల్ల ధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదంటూనే, ఆ కారణంతో సహచట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడిరది. విరాళాలు ఇచ్చినవారి పేర్లు రహస్యంగా ఉంచడం ఎంతమాత్రం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్నీ ఉల్లంఘించడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అను మతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయ పడిరది. కంపెనీలిచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయో జనాలకు అనుకూలంగా ఉండటంతో పాఠదర్శకత లోపిం చిందని, అందువల్ల ఎన్నికల బాండ్లతో వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్రఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం ఆదేశాలు జారీచేసింది.మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది.
రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకు వచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయాఠాకుర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడా నికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.ఈ క్రమంలోనే గతేడాది అక్టోబరు లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా నేడు తీర్పును వెలువరించింది.
ఎన్నికల బాండ్లు అంటే..?
ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యం అవుతాయి.. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాలకు విని యోగించు కుంటాయి.
రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పార దర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవ సరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
మొత్తం.. రూ.16,500 కోట్ల బాండ్లు
గత కొన్నేళ్లుగా ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు రూ.వేల కోట్ల విరాళాలు అందాయి. ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు దక్కిన విరాళాల్లో అత్యధిక వాటా బీజేపీదే. ఇప్పటివరకు 30 విడతల్లో దాదాపు 28వేల ఎన్నికల బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. వీటి మొత్తం విలువ రూ.16.518 కోట్లుగా ఇటీవల కేంద్రమంత్రి పంకజ్ చౌదరి లోకసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడిరచారు. 2017-18 నుంచి 2022-23 వరకు ఈ బాండ్ల ద్వారా ఏయే రాజకీయ పార్టీకి ఎంత విరాళం దక్కిందన్న వివరాలను సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో పేర్కొంది. భాజపాకు రూ.6,505 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1,122 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.1,093 కోట్లు, బిజూ జనతాదళ్‌కు రూ.773 కోట్లు, డీఎంకేకు రూ.617కోట్లు, వైకాపాకు రూ.382.44 కోట్లు, భారాసకు రూ.383 కోట్లు, తెదేపాకు 146 కోట్లుగా ఉంది.
ఓటు శక్తిని చాటి చెప్పేలా..
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. డబ్బుకంటే ప్రజలు వేసే ఓటుకే బలమెక్కువ అనే వాస్తవాన్ని ఈ తీర్పు బలపర్చిందని పేర్కొంది. ‘‘ఎన్నికల బాండ్లను మోదీ సర్కారు కమీషన్లకు మాధ్యమంగా మార్చేసింది. ఈ రోజు ఇది కోర్టులో రుజువైంది’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
‘పారదర్శకత కోసమే..’
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అదే సమయంలో సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే తీర్పుపై స్పందిస్తామని వ్యాఖ్యానించారు.