వైసిపి నేత తన పొలాన్ని ఆక్రమించి, భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నాడని చేజర్ల మండలం కాళాయపాలెంకు చెందిన బొర్రా రామయ్య యువనేత లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. నాయుడుపల్లి క్యాంప్ సైట్ లో యువనేత లోకేష్ తమభూమిని వైసిపి నేత ను కలిసి తమ సమస్యను తెలియజేశాడు. నాగులవెల్లటూరు పంచాయతీ కాళాయపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 10/3 లో 2.03సాగు చేసు సెంట్లు, పక్కనే ఉన్న అసైన్ మెంట్ 2 ఎకరాల భూమి నా పేరు మీద ఉంది. దీన్ని మేము 45 ఏళ్లుగా కుంటున్నాము.
అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత దాపాటి రవీంద్ర నాయుడు ఆయనకున్న 35ఎకరాలతోపాటు మా 4ఎకరాలు కూడా కౌలుకు తీసుకుని గతంలో సాగు చేసుకున్నాడు. తర్వాత మా పొలం మేము సాగు చేసుకుంటామని చెప్పడంతో, ఆయన పొలం పక్కన నుండి వచ్చే కాల్వ నీటిని మా పొలంలోకి రాకుండా అడ్డుకున్నారు. మాకున్న 4 ఎకరాల పొలం తనదేనని, నా ఎంజాయ్ మెంట్లో ఉందని అన్నాడు. మా 4ఎకరాలకు తన పేరుపై పట్టా ఇవ్వాలని భూరక్ష సర్వే సమయంలో అధికారులను ప్రలోభపెట్టాడు.
1-బి అడంగల్ లో ఇప్పటికీ నా పేరుమీదే పొలం వివరాలు ఉన్నాయి. తహసీల్దార్ కు కూడా జరిగిన విషయాన్ని తెలిపగా, పొలం మీ పేరు మీదనే ఉందన్నారు. అయినా వైసీపీ నేత రవీంద్ర నాయుడు మీ భూమి నాకు అమ్మారంటూ దొంగ పత్రాలు చూపిస్తూ, పొలంలోకి రానివ్వకుండా బెదిరిస్తున్నాడు, మీరు మాకు న్యాయం చేయాలని విన్నవించాడు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డులను పరిశీలించి న్యాయం చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.