- ఆపదలో ఆదుకున్న కూటమి ప్రభుత్వం
- అక్కరకొచ్చిన చంద్రబాబు ముందుచూపు
- కూటమి బీమా పాలసీతో అన్నదాతల్లో ధీమా
పీడ కలలాంటి పాలనందించి ‘‘వైనాట్ 175’’ అంటూ ప్రగల్బాలకు పోయి 11 సీట్లతో చెంపదెబ్బలు కొట్టించుకున్నప్పటికీ జగన్ రెడ్డి తీరులో ఏమాత్రం మార్పురాలేదు. తన ఓటమికి ప్రజలే కారణమని నిందిస్తూ తమకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని ఒక్కొక్కరుగా బైబై జగన్ అంటూ పార్టీని వీడుతున్నప్పటికీ జగన్‌రెడ్డి ప్రదర్శిస్తున్న మేకపోతు గాంభీర్యాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. దారుణ ఓటమి తరువాత నానా తిప్పలు పడి సర్వ శక్తులనూ కూడదీసుకుని వీధికెక్కాడు. ప్రజా సమస్యలంటూ రోడ్డు మీదకు వచ్చి కొత్త నాటకాలకు తెరలేపాడు. అయితే ఇప్పటివరకు వైసీపీ చేసిన రెండు ధర్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆరు నెలల కూటమి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా అని సాధన చేసి మరీ జనంలోకి వచ్చాడు. కానీ జగన్‌రెడ్డికి జనం తగిన విధంగా గుణపాఠం చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. మూడు పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇదిలావుండగా తన రోత పత్రికను అడ్డంపెట్టుకుని నీచమైన రాతలతో చేసిన తప్ఫులను కూడా ఒప్పులుగా చూపించడానికి నానా యాగి చేస్తున్నాడు. అందులో భాగంగానే రైతులకు ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం దూరం చేసిందంటూ అంటూ తప్పుడు రాతలు రాయిస్తూ జగన్ రెడ్డి తన వంకర బుద్ధిని చాటుకున్నాడు
జగన్ వికృత పాలనలో అన్నదాతకు తప్పని ఆత్మహత్యలు
టీడీపీ హయాంలో రైతుల సగటు అప్పు రూ.70వేలు ఉంటే తుగ్లక్ జగన్ హయాంలో అది రూ.2.5లక్షలకు చేరింది. కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమ రైతాంగంపై కనీస కనికరం లేని కఠినాత్ముడు జగన్‌రెడ్డి. అతగాడు చేసిన పాపాల వల్ల రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఇటీవలి నివేదికల ప్రకారం, జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట నష్టాలు, అప్పులు, ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడం రైతుల అత్మహత్యకు కారణాలుగా కనిపిస్తున్నాయి. రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించడంతో పాటు కరువు సీమలో ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం తంగడంచ గ్రామంలో జైన్ ప్రాజెక్ట్‌ను చేపట్టి 632 ఎకరాలను కేటాయించింది. సైకో జగన్ దానిని అడ్డుకుని తన పైశాచిక పాలన గురించి చెప్పకనే చెప్పాడు. జగన్ వికృత చేష్టలకు ఇదొ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కన్నీళ్లు పెట్టించే కౌలు రైతులు ఆత్మహత్యలు
కౌలు రైతు ఆత్మహత్యల్లో వైసీపీ పాలనలో దేశంలోనే రాష్ట్రం 2 స్థానంలో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 2019లో 1918 మంది రైతులు, 2020 లో 889 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇది అధికారిక లెక్కలు మాత్రమే. కానీ దాదాపు 4500 మందికి పై చిలుకు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని అంచనా. ఆత్మహత్య చేసుకున్న రైతులకు, కౌలు రైతులకు రూ.7 లక్షలు నష్ట పరిహారం ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న జగన్ రెడ్డి తన హయాంలో ఎంత మందికి పరిహారం ఇచ్చారో లెక్కలు తీస్తే ఆ బండారం కూడా బయటపడుతుంది.
పంటల బీమాను అస్తవ్యస్తం చేసిన జగన్
గత వైసీపీ పాలనలో ఉచిత పంటల బీమాను జగన్ రెడ్డి గందరగోళంగా మార్చాడన్నది అక్షర సత్యం. చంద్రబాబు 2018-19 లో 16 లక్షల మంది రైతులకు రూ.1875 కోట్ల పంట నష్టపరిహారం అందించారు. 2023 ఖరీఫ్‌కి జగన్‌రెడ్డి కేవలం 16 మంది రైతులకే పంటల బీమా ప్రీమియం కట్టాడు. ఇదే జగన్ పదే పదే చెప్పే రైతు పక్షపాతం. కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 2018-19 లో కట్టిన ప్రీమియం కంటే అధికంగా 172.8 శాతం బీమా సొమ్మును నష్టపరిహారంగా చెల్లించి రైతు పక్షపాతి చంద్రన్న అంటూ రైతులు జై జై నాదాలు పలికారు. దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ను నిలిపిన ఘనత టీడీపీ సర్కారుదే. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు.
నాడు చంద్రబాబు ప్రభుత్వం కట్టిన ప్రీమియం సొమ్ముతో పోలిస్తే రైతులకు చెల్లించిన బీమా సొమ్ము 100 శాతం కంటే ఎక్కువగా అంటే 117.05 శాతం సొమ్ము చెల్లించారు. 2017-18 లో మరో రూ.740.02 కోట్లను 7.1 లక్షల మంది రైతులకు, 2018-19 లో అత్యధికంగా రూ.1875 కోట్లను 16.02 లక్షల మంది రైతులకు చెల్లించింది టీడీపీ సర్కార్. ఈ వివరాలన్నీ కేంద్ర వ్యవసాయ శాఖ వార్షిక నివేదిక 2022-23 లోనే ఉన్నాయి.
సాధారణ బీమా కంపెనీ పేరుతో జగన్ నయవంచన
2016లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2019 వరకు చంద్రబాబు రైతులకు రూ.3,569 కోట్ల బీమా సొమ్ము చెల్లించారు. చెల్లించిన ప్రీమియంతో పోలిస్తే, దేశంలోనే అత్యధిక క్లెయిమ్ సొమ్ము పొందిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తమకు వద్దన్నాడు. తానే స్వయంగా రైతులను ఆదుకుంటానన్నాడు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరుతో ఒక కంపెనీ పెట్టి ఊడబొడిచేస్తానని ప్రగల్భాలు పలికాడు. కానీ ఐఆర్‌డీఏఐ వెబ్ సైట్లో చూస్తే మన దేశంలో పబ్లిక్ ప్రైవేటు సెక్టార్లలో లైసెన్స్ పొందిన కంపెనీలు 34 ఉన్నాయి. కానీ అందులో జగన్ రెడ్డి చెప్పిన కంపెనీ మాత్రం ఎక్కడా లేదు. అటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి, ఇటు జగన్ రెడ్డి పెడతానన్న కంపెనీ లేక ఏపీ రైతాంగాన్ని రెంటికీ చెడ్డ రేవడిగా చేసి దారుణంగా వంచించాడు. జగన్ రెడ్డి జమానాలో 2023 ఖరీఫ్ సీజన్‌కు గాను కేవలం 16 మంది రైతులకే ప్రీమియం కట్టే దుస్థితికి వైసీపీ ప్రభుత్వం దిగజారింది. రైతుల పక్షాన నిలిచి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచింది చంద్రబాబేనని కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెప్పాయి. ఈ పథకం 2016 నుండి 2019 వరకు బాబు హయాంలో అద్భుతంగా అమలయిందన్నది నిప్పులాంటి నిజం.
ప్రకృతి విపత్తులలో అన్నదాతకు అందని సాయం
గత వైసీపీ పాలనలో పదిసార్లు వివిధ రకాల ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. దాదాపు 60 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2020లో వచ్చిన నివర్ తుఫాన్ వల్ల 17.3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 2020 ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో వచ్చిన వరదలవల్ల 19.8లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం, 2021లో గులాబ్ తుఫాన్ వల్ల, ఇతర వర్షాలతో 3లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే రైతులకు దాదాపు రూ.2వేలకోట్ల నష్టం వాటిల్లింది. 2021 నవంబర్లో కురిసిన భారీ వర్షాలతో దాదాపు 13.2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు రూ.3,300 కోట్ల వరకు నష్టపోయారు. మిగ్ జాం తుఫాన్ వల్ల రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, సుమారు రూ.10 వేలకోట్ల నష్టం వాటిల్లింది. ఈ విధంగా జగన్ రెడ్డి పాలనలో 60 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, రైతులు రూ.30వేల కోట్లకు పై చిలుకు నష్టం వాటిల్లింది. అయితే అంత మొత్తం నష్టపోయినా రైతులకు జగన్ రెడ్డి ఇన్ పుట్ సబ్సీడీ కింద చెల్లించింది రూ.2వేల కోట్లు మాత్రమే. పంట దెబ్బతిన్న ఏ రైతును అడిగినా జగన్ రెడ్డి మోసాన్ని ఏకరువు పెడతాడు. అంకెల గారడీ చేస్తూ తుగ్లక్ జగన్ అన్నదాతలను నమ్మించి మోసం చేశాడు. వేలాది కోట్ల సాయం చేశానంటూ వందలాది కోట్లతో ప్రకటనలు ఇస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాడు. వెయ్యి మంది రైతుల్లో ఒకరిద్దరికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇదీ రైతులపై జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి. పైగా ఇప్పుడు రైతులపై తనకేదో ప్రేమ పొంగిపొర్లుతోందన్నట్లు తన రోత పత్రికలో తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను మళ్లీ మోసగించాలని పడరాని పాట్లు పడుతున్నాడు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా తగిన గుణపాఠం చెబుతారు.
వరదల్లో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం పంట వేసిన ప్రతి రైతుకు అంటే పత్తి, వేరు శెనగ, వరి, చెరుకు, తొలి పంటలకు హెక్టారుకు రూ. 25,000 చొప్పున అందించింది. సజ్జలు, మినుములు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, జ్యూట్, కొర్రలు, సామలకు రూ.15 వేలు పరిహారం. అలాగే తమలపాకు తోటలకు హెక్టారుకు రూ. 75 వేలు అరటి, పసుపు, కంద, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ, యాపిల్ బేర్, సపోటా, జీడిమామిడి, డ్రాగన్ ప్రూట్ తోటలకు హెక్టారుకు రూ.35 వేలు. కూరగాయలు, బొప్పాయి, టమాటా, పువ్వులు, ఉల్లిపాయలు, పుచ్చ తోటలు, నర్సరీలకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున, ఆయిల్ పామ్, కొబ్బరిచెట్లు ఒక్కో దానికి రూ. 1500 చొప్పున కూటమి ప్రభుత్వం నష్టపరిహారం అందించారు. రైతుకు వెన్నుదన్నుగా మేముంటాం అంటూ హామీ ఇచ్చి నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు.
పంటల బీమా పథకం
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2016 నుండి 2019 వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు చేసింది. ఈ కాలంలో, ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లు పూర్తిస్థాయిలో, సకాలంలో చెల్లిం తర్వాత, దాని స్థానంలో, రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇది కేవలం ఖరీఫ్ సీజన్‌కు పరిమితం అయ్యింది. రబీ 2018-19 తర్వాత ఏ రబీ సీజన్లోనూ బీమా పరిహారం చెల్లించలేదు. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు జరుగుతున్న విధానం, తీరు తెన్నుల సమీక్ష కోసం ప్రభుత్వం ముగ్గురు సభ్యుల క్యాబినెట్ సబ్ -కమిటీ ఏర్పాటయింది. మంత్రుల కమిటీ జూలై 22, 2024న సమావేశమై ఖరీఫ్ 2024కు అప్పటికే అమలులో వున్న ఉచిత పంటల బీమాను కొనసాగించి, రబీ 2024-25 నుండి స్వచ్ఛంద నమోదుకు సిఫార్సు చేశారు. ఈ రబీ నుండి రైతులకు బీమా పథకంలో వారి వారి అవసరాల మేరకు స్వచ్ఛందంగా చేరే వెసులుబాటు కల్పించినట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు మామిడి పంటను రబీ 24-25 నుండి వాతావరణ బీమా పథకం కింద కవరేజ్ చేయడానికి అనుబంధ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఆ మేరకు, ప్రస్తుత రబీ 2024-25 నుండి ఆసక్తి గల రైతులు తక్కువ ప్రీమియంతో బీమా పథకంలో చేరవచ్చు. ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5% , వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% ప్రీమియంతో బీమా అందుబాటులో ఉంది. మిగిలిన ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లిస్తాయి. ఒకవేళ ఏదైన పంటకు రైతు చెల్లించవలసిన ప్రీమియం తక్కువగా నిర్ధారించినట్లైతే రైతులు ఆ మేరకు తగ్గిన ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
పారదర్శకంగా నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నిర్దేశించిన విధం గా వెబ్ ల్యాండ్‌లో భూమి వివరాలను, కౌలుదారులు సమాచారం కలిగిన సీసీఆర్సీ డేటాబేస్, ఆర్వోఎఫ్‌ఆర్ భూములను రెవిన్యూ శాఖ సహకారంతో కేవలం రెండు నెలల వ్యవధిలో నేషనల్ పోర్టల్ తో అనుసంధానం జరిగిందని పేర్కొంది. ప్రస్తుతం బీమా పథకంలో కవరేజీ కోసం నిర్ణయించిన అతి తక్కువ ప్రీమియం చెల్లించడానికి రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. దాదాపు ఆరున్నర లక్షల దరఖాస్తులు ఇప్పటికే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్సు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు 8.8 లక్షల ఎకరాల విస్తీర్ణం బీమా పరిధిలోనికి తెచ్చారు. బీమా నమోదుకు ఈ నెలాఖరు వరకు రైతులకు అవకాశం కల్పించారు. అయితే బ్యాంకులకు గడువులోగా ప్రీమియం చెల్లించి పోర్టల్‌లో పూర్తి వివరాలు నమోదు చేయడానికి కూటమి ప్రభుత్వం అదనంగా 15 రోజుల వరకు వెసులుబాటు కల్పించింది. బీమా కంపెనీలు, భారత ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అనుమతి పొంది జీడి మామిడి పంటకు అదనంగా 7 రోజులు (22-11- 2024 వరకు) వారి మినహా మిగిలిన అన్ని పంటలకు 31-12-2024 వరకు ప్రీమియం చెల్లింపు గడువు తేదీలను పొడిగించారు. వరి పంటకు గడువు తేదీ ఈ నెలాఖరుకు ముగుస్తుండగా అదనంగా మరో 15 రోజులు అనుమతించాలని బీమా కంపెనీలను సంప్రదించారు. ఇక బీమా కంపెనీల నిర్ణయం రావలసి ఉంది.
తోట నిర్మలాజ్యోతి
అనలిస్టు