- విచక్షణా రహితంగా లాఠీచార్జి
- ఈడ్చుకుంటూ బస్సుల్లో తోసేశారు
- చలో విజయవాడపై ఉక్కుపాదం
అమరావతి: తమ సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి విజయ వాడ బయలుదేరిన ఆశా వర్కర్లను ఎక్కడి క్కడ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎదో విధం గా విజయవాడ చేరుకున్న ఆశావర్కర్ల పట్ల జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిం చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతా లకు చేరుకున్న వందలాది మంది ఆశా వర్కర్లపై విచక్షణా రహితంగా లాఠీచార్జి చేశారు. వందలాది మంది అశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. దౌర్జన్యంగా రోడ్లపై ఈడ్చుకుంటూ వాహనాల్లో కుక్కేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం సుందరయ్య విజ్ఞా నకేంద్రంలో సుమారు 100 మందిని పోలీ సులు నిర్బంధించారు.వీరంతా గేట్లు దూకి, చెన్నై కోల్‌కతా జాతీయ రహదారిపైకి చేరు కుని కొంతపేపు రాస్తారోకో చేశారు. అక్క డికి చేరుకున్న పోలీసులు వారిపై తిరిగి లాఠీచార్జి చేశారు.వారిని చెదరగొట్టి దొరికి క వాళ్లను దొరికినట్లుగా అరెస్ట్ చేసి, వాహ నాల్లోకి తేసేసి అక్కడి నుండి తీసుకెళ్లారు. కాజా టోలేట్ వద్ద 15 మందిని అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరిని ఆశావర్కర్లతో పాటు సీఐటీయూ నేతలు తీవ్రంగా ఖండిర చారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కనీస వేతనం అమలు, పనిభారం తగ్గింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలపై వారు గతకొంతకాలంగా ఆందోళన కొనసాగిస్తున్నారు.