- టీడీపీ`జనసేన ప్రభుత్వంలో కొత్త కార్యక్రమం
- యువతతో సమావేశంలో నారా భువనేశ్వరి వెల్లడి
- ఉద్యోగాలు ఇచ్చే నాయకుడికి ఓటు వేయండి
- సీమ నుంచి వలసలు ఆగాలంటే చంద్రబాబు రావాలి
- నేటి పాలకులు రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు
- టీడీపీ`జనసేన ప్రభుత్వంలో కొత్త కార్యక్రమం
- ఉద్యోగాలు ఇచ్చే నాయకుడికి ఓటు వేయండి
- సీమ నుంచి వలసలు ఆగాలంటే చంద్రబాబు రావాలి
- నేటి పాలకులు రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు
- యువతతో సమావేశంలో నారా భువనేశ్వరి వెల్లడి
పత్తికొండ (చైతన్యరథం): ఆడబిడ్డల చదువులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ‘కలలకు రెక్కలు’ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు టీడీపీ అధినేత చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. టీడీపీ` జనసేన ప్రభుత్వం వచ్చాక.. ఇంటర్ పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే విద్యార్థినులకు ప్రభుత్వ గ్యారెంటీ తో బ్యాంక్ రుణాలు ఇప్పిస్తారు. విద్యార్థినులు బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ` జనసేన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని భువనేశ్వరి చెప్పారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపి ఈకార్యక్రమ బ్రోచర్ ను భువనేశ్వరి ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థి నులు కలలకు రెక్కలు.కామ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. నిజం గెలవాలి కార్య క్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలో పర్య టిస్తున్న నారా భువనేశ్వరి… మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం కోసం, యువత తమ భవిష్యత్ కోసం టీడీపీ – జనసేనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికలు మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధం, విధ్వం సానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం అన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పారదర్శకత లేని, అభివృద్ధి, సంక్షే మం ఇవ్వని నేతలను ప్రజలు ఎన్నుకున్నారని, దీని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని ఆమె అన్నారు. ప్రజల స్వేచ్ఛను లాక్కున్న ఆ పాలకుడు అధికారాన్ని తన ఆస్తి కూడబెట్టుకోవడానికి వాడుకున్నాడు అని విమర్శించా రు. అతని పాలనలో ధనికులు ఇంకా ధనికులు అయ్యారు. కానీ పేదవాడు మరింత పేదవాడు అయ్యాడన్నారు. ఇలాంటి పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడిరచాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.
యువత – మొదటి ఓటర్లు
మొదటి సారి ఓటు హక్కు వచ్చిన యువకులకు భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. మీ అమూల్య మైన ఓటును ఆలోచించి వినియోగించుకోవాలి అని చెప్పారు. మీ ఓటు మీ భవిష్యత్ ను నిర్ణయిస్తుంది అని చెప్పారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు మీ ఓటు హక్కుని వినియోగించాలి అని సూచించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని, ఓటు వేయాలని ఆమె సూచించారు. ఉద్యోగ అవకాశాలు సృష్టించి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత అన్నారు. ఇప్పటి నాయకు లు సమాజాన్ని విభజించి పాలించడమే ధ్యేయంగా చేసుకున్నారు. తమ అక్రమార్జన మాత్రమే నేటి పాలకు లకు ముఖ్యమైపోయిందని భువనేశ్వరి విమర్శించారు.
నిరంతర ప్రగతి శ్రామికుడు
చంద్రబాబునాయుడు మన బిడ్డలకు ఉద్యోగాల గురించే ఎప్పుడూ చర్చించేవారు. ప్రగతి కోసం నిరం తరం శ్రమించేవారు. నైపుణ్యాలు పెంచి మంచి ఉద్యో గాలు వచ్చేలా చేశారు. 2014 నుంచి 2019 మధ్య కర్నూలు జిల్లాలో, పత్తికొండలో కూడా చంద్రబాబు ఎంతో అభివృద్ది చేశారు.సీమ ప్రాంతంలో సాగునీటిపై దృష్టిపెట్టారు. తెలుగు గంగ వంటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశారు. ముచ్చుమర్రి లిఫ్ట్, పులకుర్తి లిఫ్ట్, సిద్దాపురం లిఫ్ట్,గోరకల్లు రిజార్వాయర్,అవుకు టన్నెల్, పులికనుమ లిఫ్ట్ప్రాజెక్టులు పూర్తిచేశారు.ప్రపంచంలోనే మూడో పెద్ద సోలార్‌పార్కు కర్నూల్లో వచ్చేలా చేశా రు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టుని 18నెలల్లో పూర్తిచేశారు. కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ,ఐఐఐటీ, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేశారంటూ కర్నూలు జిల్లాలో గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను భువనేశ్వరి వివరించారు.
అరాచక పాలనపై యువత పోరాడాలి
కానీనేటి ప్రభుత్వపాలనలో రాయలసీమ యువత, ప్రజలు ఉపాధి కోసం వలస వెళుతున్నారు. ప్రజల జీవితాలు నేడు భారంగా మారాయి. ఇన్నీ చూసి లోకేష్ మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత కర్నూలుని వ్యవసా య పరికరాల ఉత్పత్తి కేంద్రంగా, వ్యవసాయ పరిశోధ నలకు కేంద్రంగా మారుస్తాం. చిత్తూరుని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా, అనంతపూర్ని ఆటోమొబైల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే…18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడ బిడ్డకి నెలకి రూ.1,500, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి కోసం ఏడాదికి రూ.15,000 సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని ప్రకటించారు.
అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా కొత్త ఓటర్లు మనస్సాక్షితో అడుగులు వేయాలని భువనేశ్వరి కోరారు. తెలుగుదేశం గెలిస్తేనే సామా న్యులు, పేదలకు న్యాయం జరగుతుందన్నారు. మీరు టీడీపీకి ఓటు వేయడం ద్వారా ఈ ధర్మ యుద్ధంలో పాల్గొని ఈ అరాచక పాలనపై పోరాడాలి. ధర్మాన్ని కాపాడాలి, శాంతిని తీసుకురావాలి అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు.