- చంద్రబాబు ఆరోపణలు నిజమేనని తేల్చిన కేంద్రకమిటీ
- అక్రమ తవ్వకాలతో రూ.56 వేల కోట్లకు పైగా దోచుకున్న జగన్
- చంద్రబాబు పూర్తి ఆధారాలతోనే మాట్లాడతారని నిర్ధారణ
- జగన్ శిబిరంలో కలవరం.. మౌనమే శరణ్యం
- సుప్రీంకోర్టులో జరగనున్న పరిణామాలపై తీవ్ర భయాందోళనలు
- కోర్టు పరిణామాలతో రాజీనామా చేసే నైతికత జగన్‌కు ఉందా?
ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రి, అధికారపార్టీపై ఇష్టారీతిన, యథాలాపంగా ఆరోపణలు చేస్తాయని, ముఖ్యంగా అవినీతికి సంబంధించి అలా చేస్తాయని, అట్టి ఆరోపణలకు ప్రామాణికత ఉండదని సాధారణ అభిప్రాయం. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు లక్షలకోట్ల అవినీతి ఆరోపణలు చేస్తుండటం దీనికి కొంత కారణం. అయితే … ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుకదోపిడీపై ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని నిర్ధారణ కావడంతో అటువంటి అపోహలు అన్ని సందర్భాల్లో వాస్తవం కాదని తేలింది.
జగన్ ఇసుక దోపిడీ రూ.56 వేలకోట్ల పైనే..
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అప్పటి వరకు నాలుగు న్నరేళ్ల పాలనలో అక్రమ ఇసుకతవ్వకాల ద్వారా రూ.40 వేలకోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారని సరిగా 6 నెలల క్రితం.. గత సంవత్సరం ఆగస్ట్‌లో తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు,సాక్ష్యాధారాలతో సహా ఒక ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అప్పటి వరకు మొత్తం 40కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేసి జేబులు నింపుకున్నారని ఆయన తెలిపారు. ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి కనుసన్నల్లో రేయింబవళ్లు సాగుతున్న ఇసుక దోపిడీ ప్రజలకు తెలిసినా.. అంతమేరకు తవ్వకాలు, అక్రమార్జన నిజంగా జరిగి ఉంటాయా అని కొందరు సందేహించి ఉండవచ్చు.
అటువంటి సందేహాలను తొలగిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్రప్రభు త్వం నియమించిన ఒక ఉన్నతస్థాయి కమిటీ ఇసుక దోపిడీ నిజమేనంటూ సంచలనాత్మకమైన ఒక సుదీర్ఘ నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు (ఎన్‌జీటీ) మం గళవారం నాడు సమర్పించింది. కేంద్ర అటవీ, పర్యా వరణ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక సంయుక్త కమిటీ సమర్పించిన ఈ నివేదికలోని అంశా లను చూసి ఎన్జీటీ న్యాయమూర్తులు నివ్వెరపోయారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం రూపొందించిన అన్ని నియమాలు, మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో రేయింబవళ్లు యథేచ్ఛగా ఇసుక తవ్వ కాలు జరుగు తున్నాయని కేంద్ర కమిటీ నిర్ధారించింది. పూర్తి వివరాలు బుధవారం నాడు జరిగిన ఎన్జీటీ విచారణ సందర్భంగా వెల్లడయ్యాయి.
తాము పరిశీలించిన ఇసుక రీచ్‌ల్లో రోజుకి 1,000 నుంచి 2,000 టన్నుల వరకు భారీ యంత్రాలద్వారా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్రకమిటీ నిర్ధారించింది. సగటున రోజువారీ తవ్వకం 1,500 టన్నులు అనుకుంటే ప్రతి నెలా ప్రతి ఇసుక రీచ్ నుంచి 45 వేల టన్నుల ఇసుక తవ్వకం ద్వారా, నెలకు రూ.4.50 కోట్లు జగన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో 500లకు పైగా ఉన్న ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలను బట్టి..కనీసంగా ఇప్పటివరకు రూ.56 వేలకోట్ల అక్రమార్జన జరిగినట్టు రూఢీ అయ్యింది. ఈ దోపిడీ 6 నెలల క్రితం చంద్ర బాబు వెల్లడిరచిన ఇసుకాసురుడు జగన్‌రెడ్డి అక్ర మార్జన చరిత్రతో సరిపోతుంది.
చంద్రబాబు విశ్వసనీయత..
ఇసుకాసురుడు జగన్‌రెడ్డి దోపిడీపై ప్రతిపక్ష నాయ కుడు చంద్రబాబు వెల్లడిరచిన వివరాలను కేంద్ర కమిటీ నివేదిక నిర్ధారించడం ఆయన విశ్వసనీయతకు అద్దం పట్టింది. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేయరని.. అన్ని విషయాలను లోతుగా పరిశీలించి క్షేత్రస్థాయిలోని వాస్తవాల ఆధారంగా ఆయ న మాట్లాడతారని తాజాగా నిర్ధారణ అయ్యింది.
రాష్ట్రంలో భారీగా సాగుతున్న అక్రమ మద్యం వ్యాపారం, గనులు,ఇతర సహజ వనరుల దోపిడీ, భూ కబ్జాలు, అక్రమ టెండర్లు, పలు ఇతర మార్గాల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దోచుకున్నలక్షలాది కోట్ల అక్రమార్జనకు సంబంధించి ప్రతిపక్షనాయకుడు చంద్ర బాబు వెల్లడిరచిన సమాచారం పూర్తి విశ్వసనీయతతో కూడి ఉందని జగన్‌రెడ్డి ఇసుక దోపిడీ చరిత్ర నిర్ధారించింది.
వైసీపీ శిబిరంలో కలవరం.. జగన్‌రెడ్డి మౌనం
ఇసుక తవ్వకాలపై కేంద్ర కమిటీ వెల్లడిరచిన వివరాలు 6 నెలల క్రితం జగన్ అక్రమార్జన గురించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేసిన ఆరోపణలతో పూర్తిగా సరితూగడంతో ముఖ్యమంత్రి శిబిరం తీవ్ర కలవరానికి గురైనట్టు సమాచారం. బుధవారం మధ్యా హ్నం కేంద్ర కమిటీ నివేదికలోని అంశాలు బహిర్గత మైనా ఇంతవరకు జగన్‌రెడ్డి ప్రభుత్వం గానీ, అధికార పార్టీ గానీ స్పందించలేదు. అధికార శిబిరంలో నైరా శ్యంతో కూడిన మౌనరాగం తాండవిస్తోంది అనడానికి ఇది ప్రత్యక్ష తార్కాణం. చీటికిమాటికీ నోళ్లేసుకొని విరగబడే జగన్‌రెడ్డి ప్రధాన సలహాదారు, అధికారపార్టీ అగ్రనేతలు ఇంతటి ప్రధాన విషయంపై మౌనాన్ని ఆశ్రయించడం తమ ఇసుకదోపిడీని పూర్తిగా అంగీక రించినట్టేనని రాజకీయ పరిశీ లకులు భావిస్తున్నారు.
రాజీనామా చేసే నైతికత ముఖ్యమంత్రికి ఉందా?
ముఖ్యంగా కేంద్ర కమిటీ నివేదికలోని అంశాలపై ఎన్జీటీ న్యాయమూర్తుల వ్యాఖ్యలు, ఆ నివేదికను సుప్రీం కోర్టుకు పంపాలని వారిచ్చిన ఆదేశాలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, ఆయన బృందాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, భయానికి గురిచేసినట్టు సమాచారం. కేంద్రకమిటీ అక్రమ తవ్వకాలను నిర్ధారించినా..అలాంటిదేమీ లేదని 25 జిల్లాల కలెక్టర్లు రిపోర్టులు ఇవ్వడంపై ఎన్జీటీ విస్మ యం వ్యక్తం చేసింది. పర్యావరణానికి సంబంధించిన ఉల్లంఘనలను సాధారణంగా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాల బాగోతం త్వరలో సుప్రీంకోర్టు విచారణకు రానున్నందున నివేదిక ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలిస్తుందో, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో అన్న భయం జగన్ బృందాన్ని ఆవహించింది.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బస్సురూట్ల జాతీయీకరణ విషయంలో, మెడికల్ కాలేజీల అనుమతుల విషయంలో హైకోర్టు వ్యాఖ్యలతో అప్పటి ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తనకు ప్రతికూలంగా వస్తే, ప్రజాభిప్రాయానికి తలవంచి ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి రాజీనామా చేస్తారా.. లేక ఎట్టి నైతిక విలువలు పాటించిన తన నైజానికి అనుగుణంగా నడుచుకుంటారా? అన్న చర్చ ప్రజల్లో మొదలైంది. ముఖ్యమంత్రి ఇప్పటికే తప్పు ఒప్పుకొని రాజీనామా చేసి ఉండాల్సిందని కూడా పలువురి అభిప్రాయం. ఏది ఏమైనా .. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇసుక దోపిడీ రానున్న ఎన్నికల తరుణంలో ఆయనను వెంటాడటం తథ్యమని, తన దోపిడీతో సామన్యులు, 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కడుపుకొట్టిన జగన్ రెడ్డి తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రజాభిప్రాయం.