(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ఒక అబద్దాన్ని పదేపదే నిజమని చెప్పడం, పది మందితో చెప్పించడం ద్వారా వాస్తవాన్ని మరుగున పెట్టి జనాన్ని మోసగించడం జె-గ్యాంగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అమరావతి రాజధాని విషయంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో కూడా జె-గ్యాంగ్ ఇదే ఫార్ములాను ప్రయోగించి మరోసారి రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించింది. రాజధా ని విషయంలో నిన్న సుప్రీంకోర్టులో జరిగిన వాదోప వాదాలు, తర్వాత కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆ తర్వాత జె-గ్యాంగ్ చేస్తున్న ప్రచారం చూసిన తర్వాత ఈ ముఠా చిన్నప్పుడు స్కూలుకెళ్లి అరకొరగా కాకుండా సక్రమంగా చదువుకొని నిజాయితీగా పరీక్షలు రాసి డిగ్రీలు సంపాదించిఉంటే వారికి ఈఖర్మ పట్టేది కాదే మోనని అన్పిస్తోంది. ఈరోజు ఘనతవహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిద్దాం.‘‘రాష్ట్ర ప్రజల శ్రేయ స్సు కోసం ప్రభుత్వపరంగా, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి .. మేము ఏమి అనుకు న్నామో.. ఈరోజు సుప్రీం కోర్టు కూడా అదే చెప్పిం ది’’. దీనినిబట్టి సజ్జలగారి క్వాలిఫికేషన్ పైన కూడా అనుమానం కలుగుతోంది. కోర్టు తీర్పును లోతుగా పరిశీలించినట్లుయితే రాయలసీమలోహైకోర్టు అంటూ జె-గ్యాంగ్ ఆడుతున్ననాటకం బట్టబయలైంది. సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా న్యాయమూర్తి జె. జోసెఫ్ ‘‘»Where do you want the High Courtµµ ’’ (మీకు హైకోర్టు ఎక్కడ కావాలి)అని ప్రభుత్వం తరపు న్యాయ వాది వేణుగోపాల్‌ను ప్రశ్నించినపుడు ‘‘It ought to be in Amaravati’’(అమరావతిలోనే ఉండాలి) అని సమా ధానమిచ్చారు. దీనికి అర్థం ఏమిటి సజ్జల గారూ? ఒకపక్క సుప్రీంకోర్టుకు అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెబుతూ..మరోపక్క జనం వద్దకు వచ్చి రాయలసీమ న్యాయరాజధాని అని తప్పుడు కూతలు కూయడం వెనుక అంతర్యమేమిటి? ఇంకా ఎంత కాలం అమాయక రాయలసీమ ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్నారు? అమరావతిలో హైకో ర్టు ఏర్పాటు కోసం చాలా ఖర్చుచేశారన్న ధర్మాసనం.. ఇప్పుడు కర్నూలులో పెట్టాలని ఎందుకు ప్రతిపాదిస్తు న్నారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించిన పుడు ‘‘అదంతా ముగిసిపోయింది.. కర్నూలులో పెట్టా లన్న ప్రతిపాదన ఇప్పుడేమీ లేదు’’ అని మీ ప్రభుత్వ తరపు న్యాయవాది వేణుగోపాల్ చెప్పిన విషయం వాస్తవం కాదా? సుప్రీంకోర్టు నుంచి చీవాట్లు తప్పిం చుకోవడానికి అక్కడేమో అమరావతిలోనే హైకోర్టు అని చెప్పి. జనం వద్దకువచ్చి కర్నూలు హైకోర్టు అనిచెప్ప డం ప్రజలను మోసగించడం కాదా? ఇంకా ఇలాంటి తప్పుడు మాటలతో ఎంతకాలం ప్రాంతీయ విద్వేషాల ను రెచ్చగొట్టి ప్రజలను మోసగిస్తారు? ఒక సారి మీ మాయమాటలకు మోసపోయిన జనం మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నవిషయం సీనియర్ పాత్రికేయుడు కూడాఅయిన మీరు గుర్తిస్తే మంచిది.
ఇక ఎ2 నోటికి అడ్డూఅదుపే లేదు
ఇక దేశంలోనే గజదొంగగా పేరొందిన ఎ2 ట్విట్టర్ వేదికగా పెట్టేపోస్టులను పరిశీలిస్తే అబద్ధాలు చెప్పడానికి ఆయన నోటికి అడ్డూ,అదుపులేదని మరో మారి స్పష్టమైంది. ‘‘హైకోర్టు ఆదేశాలకు వక్రభాష్యం చెప్పే బరితెగింపునకు పాల్పడిరది కులమీడియా, సుప్రీం స్టేపైనా ఏడుపులు,పెడబొబ్బలు,ఆక్రందనలు పెడుతోంది పచ్చకుల మీడియా’’ అంటూ ఎ2 విజయ సాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. సుప్రీం ఇచ్చిన ఆదేశాలను ఎ2 ఈవిధంగా అర్థం చేసుకోవడాన్ని పరి శీలించాక ఇలాంటి మిడిమిడి జ్జానం సన్నాసిని పద్దుల గుమాస్తాగా పెట్టుకోవడంవల్లే జగన్‌రెడ్డి 16నెలలు చిప్పకూడు తిన్నాడేమోనని అన్పిస్తోంది.సుప్రీం స్టేఇస్తే పచ్చకులమీడియా ఏడుపులు,పెడబొబ్బలు పెట్టింది. నువ్వు స్కూలురోజుల్లో సరిగా చదువుకునే ఉంటే నీకు ఈ కష్టాలు తప్పేవి. సుప్రీం ఏమందో బహిరంగ వేది కపై న్యాయకోవిదుల సమక్షంలో చెప్పడానికి తెలుగు దేశంపార్టీ సిద్ధంగా ఉంది. నువ్వు నిజంగా దొంగవి కాకపోతే మా సవాల్ ను స్వీకరించు సాయిరెడ్డి. ఇదిగో..అమరావతి విషయంలో సుప్రీంకోర్టు అన్నమాటలను మీ ముందుంచుతున్నాం… కాదని చెప్పే
దమ్ము నీకు, నీ ఎ1కు ఉందా?
- రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన హైకోర్టును మార్చాలని ఎలా ప్రకటిస్తారని ధర్మాసనం.. పదే పదే ప్రశ్నించలేదా?
- పార్లమెంటు చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా మార్చగలదన్న ధర్మాసనం ప్రశ్నించలేదా?
- విభజన చట్టంలో ది క్యాపిటల్ అనిమాత్రమే ఉంది కదా.. దీనిపై ఏం చెబుతారని ప్రశ్నించలేదా?
- పార్లమెంటులో చేసిన చట్టంలో సవరణ చేసే అధి కారం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు అందులో ఉన్న అంశాలను సవరించే అధికారం ఎలా ఉం టుందని ప్రభుత్వాన్ని నిలదీయలేదా?
- భూ సమీకరణలో రైతులకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారన్న ధర్మాసనం ప్రశ్నిం చలేదా?
- ప్రభుత్వ హామీని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారని సుప్రీం అడగలేదా?
- ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయకపోతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కాదా ధర్మాసనం ప్రశ్నింలేదా?
విజయసాయీ..నీకు ఎలాగూ అక్షరజ్జానం తక్కు వని తేలిపోయింది కాబట్టి నీదగ్గర ఉన్న పాపపు సొమ్ముతో మంచి లాయర్‌ను పెట్టుకొని ఒకసారి సుప్రీంలో జరిగిన వాదనలు తెలుసుకొని మరోసారి నువ్వు స్పందిస్తే మంచిది. లేకపోతే ఎప్పటిమాదిరి గానే నువ్వు మాకు, 5కోట్ల ఆంధ్రప్రజలకు దొరికి పోవడం ఖాయం.