- 40నెలల్లో విశాఖలో దోచింది రూ.40వేలకోట్లు
- విశాఖ అభివృద్ధిపై అర్థరూపాయైనా ఖర్చుచేశారా?
- మిస్టర్ సిఎం.. ఇంకా ఎంతకాలం ఈ జగన్నాటకం?
విశాఖపట్నం : తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్ల ప్రజా ధనాన్ని దోచేసి 16నెలల చిప్పకూడుతిన్న జగన్‌రెడ్డి.. విశాఖ రాజధాని పేరుతో గత కొంతకాలంగా కురిపిస్తున్న అవ్యాజ్యమైన ప్రేమ వెనుక అంతులేని దోపిడీ కథ ఉంది. తమ సామంతరాజులుగా వేణుంబాకం విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను నియమించు కున్న జగన్మోహన్‌రెడ్డి గత 40నెలలుగా విశాఖలో దోచుకున్న సొమ్ము అక్షరాలా రూ.40వేలకోట్లు. రాబో యే రోజుల్లో ఈ దోపిడీని మరింత ఉద్ధృతం చేయడం ద్వారా మరో 60వేల కోట్లు కొట్టేసేందుకు ప్లాన్ చేసిన జగన్ రెడ్డి ఎ2 ఒక్కడే అందుకు సరిపోడనే ఉద్దేశంతో తాజాగా తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని కూడా ఉత్త రాంధ్రను గుండుకొట్టించే ఆపరేషన్ కోసం నియమిం చారు. వైసిపిలోని కొందరు ప్రజాప్రతినిధులకు ఈ దోపిడీపర్వం తెలిసినా తర్వాత జరిగే పరిణామాలకు భయపడి నోరెత్తకుండా ఉండిపోగా, మరికొందరు జె-గ్యాంగ్ దోపిడీకి తమవంతు సహకారం అందిస్తూ పుట్టినగడ్డకు తీరని ద్రోహం చేస్తున్నారు. అధికారం లోకి వచ్చినప్పటి నుంచి రాజధాని పేరుతో నాటక మాడుతున్న జగన్‌కు నిజంగా విశాఖపై ప్రేమే ఉంటే 40నెలల్లో 4ఇటుకలు కూడా ఎందుకు పెట్టలేకపో యారు? విశాఖలో ఏదేని అభివృద్ధి పని కోసం కనీసం పట్టుమని పదికోట్లు ఖర్చుపెట్టిన దాఖలాలు ఉన్నాయా? విజ్ఞులు చైతన్యవంతులైన విశాఖ వాసు లు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
అడుగడుగునా దోపిడీ పర్వమే!
రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి ఉత్తరాంధ్రను ఎ2 విజయసాయిరె డ్డికి అప్పగించేశారు.వైఎస్‌హయాంలో జగన్‌రెడ్డి దోపి డీకి సహకరించిన, దొంగలెక్కలు రాయడంలో దిట్ట అయిన ఎ2కి విశాఖలో ఎంత దోచుకోవాలో టార్గెట్ ఇచ్చి పంపించారు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. విశాఖ ఏజన్సీలో లాటరైట్ పేరుతో బాక్సయిట్‌తవ్వకాల ద్వారా రూ.15వేల కోట్ల దోపిడీకి వ్యూహం రూపొందించి ఇప్పటికే జె-గ్యాంగ్ పని ప్రారంభించింది.
బాక్సయిట్ పేరుతో రూ.15వేల కోట్లు
విశాఖ మన్యంలోని భమిడిక లొద్దిలో 121 హెక్టా ర్లలో జార్త లక్ష్మణరావు అనే బినామీకి వైసిపి ప్రభు త్వం లాటరైట్ గనులను కేటాయించింది. భమిడి కలొ ద్ది క్వారీలో లాటరైట్ పేరుతో తవ్వుతున్న బాక్సయిట్ ను ప్రతిరోజూ భారతి సిమెంట్స్ పేరుతో ఉన్న వంద లాది లారీల్లో తూర్పుగోదావరి రౌతుల పూడి మీదుగా కడపజిల్లాకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి,ఆయన భాగ స్వామి లవకుమార్‌రెడ్డి పర్యవేక్షణలో అటవీచట్టాలను యథేచ్చగా ఉల్లంఘిస్తూ బాక్సయిట్ దోపిడీ కొనసాగుతోంది.
22ఎ భూముల క్రమబద్దీకరణ పేరుతో 6వేల కోట్లు!
విశాఖపరిసరాల్లో ఎ2 విజయసాయిరెడ్డి నేతృత్వం లో నిషేధిత జాబితాలో22ఎలో 3వేల ఎకరాల భూ ములను క్రమబద్దీకరించారు. వీటిద్వారా సుమారు 6వేల కోట్లరూపాయలకుపైగా దోచుకున్నారు. అదేవి ధంగా పంచగ్రామాల పరిధిలో రెగ్యులరైజేషన్ పేరు తో 1200 ఎకరాలను బినామీపేర్లతో కొట్టేసి 2,500 కోట్లు ఆర్జించారు. తాజాగా విశాఖ నడిబొడ్డున ఉన్న 15 ఎకరాల దసపల్లా భూములను నిబంధలను విరు ద్దంగా యజమానితో ముందుగా ఒప్పందం చేసుకొని ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా విభజించి విక్రయించి 3వేలకోట్లు దోచుకున్నారు.
రుషికొండను గుండుకొట్టించి రూ.3వేలకోట్లు
నిబంధనలకు విరుద్దంగా చారిత్రక రుషికొండను 60ఎకరాలకు పైగా గుండుకొట్టించడం ద్వారా 3వేల కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ వేశారు. రుషికొండ లో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధన లను ఉల్లంఘించి 60ఎకరాలను చదును చేశారు. అప్పటికే ఉన్న హరిత రిసార్ట్స్ కూల్చివేతతో రూ.200 కోట్లరూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశా రు. ఇక్కడ కొత్తగా నిర్మాణాలకు 200కోట్లు వెచ్చిస్తుం డగా,రోడ్ల నిర్మాణం, భూమి చదును,గ్రావెల్ అమ్మకా ల పేరుతో మరో రూ.200 కోట్లను జె-గ్యాంగ్ కొట్టే సింది. రుషికొండకు సమీపంలో కార్తీకవనం భూము లను కొట్టేసి రాడిసన్ బ్లూ రిసార్ట్స్ నిర్మిస్తున్నారు. బేపార్కు పేరుతో 450 కోట్లరూపాయలు విలువచేసే తొమ్మిదెకరాల భూమిని కైవసం చేసుకున్నారు.
ఎన్ సిసి భూముల ద్వారా రూ.1500కోట్లు
ఎన్ సిసి కంపెనీ పేరుతో ప్రస్తుత మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడి బినామీ కంపెనీకి 97 ఎక రాల భూములు కట్టబెట్టడం ద్వారా రూ.1500 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. భోగాపురంలో తప్పుడు పేర్లతో బినామీలకు పరిహారం అందించడం ద్వారా రూ.500 కోట్లు, భోగాపురం నుంచి విశాఖ వరకు రహదారి వెంట భూములను బలవంతంగా కొట్టేయ డం ద్వారా ఎ2 విజయసాయిరెడ్డి 1500 కోట్ల రూపా యలు దోచుకున్నారు. తమ బినామీ హెటిరో డ్రగ్స్‌కు కాలుష్యనివారణ ట్యాంక్ నిర్మాణం పేరుతో 81.4 ఎకరాలను కారుచౌకగా కేటాయించి 400 కోట్ల అవి నీతికి పాల్పడ్డారు. హయగ్రీవ రియల్ ఎస్టేట్ సంస్థకు 1.2 ఎకరాల కేటాయింపు ద్వారా రూ.240 కోట్ల రూపాయలు మింగేశారు.
మిషనరీ ఆస్తుల కూడా స్వాహా!
తాము ఆరాధించే క్రీస్తు మిషనరీ ఆస్తులను సైతం జగన్‌రెడ్డి వదల్లేదు. సిబిసిఎసి చర్చికి చెందిన 5.5 ఎకరాలను కాజేయడంద్వారా 600కోట్లు దోచుకున్నా రు.వందలాది అంధవిద్యార్థులకు ఆశ్రయమిచ్చిన ప్రే మ సమాజం భూములను కైవసంచేసుకోవడం ద్వారా రూ.200 కోట్లరూపాయల అవినీతికి పాల్పడ్డారు.