చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆధునిక సాంకేతికతతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ

రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ

by చైతన్యరధం
Aug 21, 2024 at 7:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
ఆధునిక సాంకేతికతతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ముఖ్యమంత్రి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్‌ పార్టీ విచారణ
  • నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపర చర్యలు
  • రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ
అమరావతి(చైతన్యరథం): ఆధునిక సాంకేతికతతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్‌ పార్టీ విచారణ జరుగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా గృహ నిర్మాణ సమీక్షా సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఆప్షన్‌-3 కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కొన్ని ఏజెన్సీలు బేస్‌మెంట్‌ వరకు పనిచేసి పేమెంట్స్‌ తీసుకున్నాయని.. ఆ తర్వాత పని ఎగ్గొట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అదే విధంగా మరికొన్ని ఏజెన్సీలు నాణ్యత లేకుండా నిర్మాణాలు చేసినట్లు తెలిసిందన్నారు. ఫిర్యాదులపై త్వరలోనే విచారణ నివేదిక రానుందని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
మెటీరియల్‌ దుర్వినియోగం చేసినా, పరిమితికి మించి మెటీరియల్‌ తీసుకున్నా, ఉద్దేశపూర్వకంగా లబ్ధిదారులకు నష్టం చేకూర్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ కింద లక్షా 25 వేల ఇళ్ల నిర్మాణాల పూర్తికి, అదే విధంగా 7 లక్షల ఇళ్లను రాబోయే ఏడాది కాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పీఎంఏవై-1.0.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతున్న నేపథ్యంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను ప్రోత్సహించి ఆలోగా నిర్మాణాల పూర్తికి అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నట్లు తెలిపారు. గడువు ముగిస్తే భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం చేజారుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అదనపు సహాయం అందించే విషయమై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. 500లోపు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే మేస్త్రీల గ్రూపులకు ర్యాండమ్‌ తనిఖీలు చేసి చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడిరచారు.
మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని.. కొన్ని స్థలాలు నివాసయోగ్యంగా లేవని, అదే విధంగా అక్కడికి వెళ్లేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని, మరికొన్ని నిర్మాణాలకు అనువుగా లేవని శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చారని.. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్లింత్‌ పూర్తయ్యాక ఫిల్లింగ్‌ చేసేందుకు మట్టి కోసం ఇబ్బంది ఉన్న దృష్ట్యా ఫ్లైయాష్‌ ఫిల్లింగ్‌కు గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  ఇది పటిష్టంగా కూడా ఉంటుందని వివరించారు. 2014-19 మధ్యకాలంలో పూర్తయిన ఇళ్లకు చెల్లింపుల విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని.. ఈ సమస్యను పరిష్కరించి నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందం కలిగిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే
పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని, ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. మంగళవారం ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో గృహ నిర్మాణంపై జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ పి.రాజాబాబు, జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన, జాయింట్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా,  మైలవరం, తిరువూరు శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్‌, కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం నోఖ్వాల్‌ తదితరులు హాజరుకాగా.. జిల్లాలో మంజూరైన ఇళ్లు, పూర్తయిన ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్లు, తదితరాలను కలెక్టర్‌ సృజన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.
ఎన్‌టీఆర్‌ జిల్లాలో పీఎంఏవై అర్బన్‌ (బీఎల్‌సీ) కింద 1,08,836 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటికే 18,820 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అదే విధంగా 40,536 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. పీఎంఏవై-గ్రామీణ్‌ కింద 6,567 ఇళ్లు మంజూరు కాగా.. 2,127 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. నరేగా కాంపొనెంట్‌, మెటీరియల్‌ స్టాక్‌, లేఅవుట్లలో మౌలిక వసతులు, ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణాలు, నియోజకవర్గాల వారీగా ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి తదితరాలను కలెక్టర్‌ వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటిని చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పార్థసారథి దిశానిర్దేశం చేశారు.
లబ్ధిదారులను ప్రోత్సహించాలి
వివిధ లేఅవుట్లలో విద్యుత్‌, నీరు, అంతర్గత రహదారులు, తదితర వసతులు ఉన్నందున త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేందుకు అధికారులు చొరవ చూపాలని, ఇందులో భాగంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి పార్థసారథి సూచించారు. గృహ నిర్మాణం, డీఆర్‌డీఏ, మెప్మా, మునిసిపల్‌, డ్వామా, లీడ్‌ బ్యాంక్‌, మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, తదితరులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్‌ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఎన్‌టీఆర్‌ జిల్లాలో పీఎంఏవై అర్బన్‌ (బీఎల్‌సీ), గ్రామీణ్‌ పరిధిలో దాదాపు 9 వేల ఇళ్ల నిర్మాణాలు లింటెల్‌ లెవెల్‌, రూఫ్‌ లెవెల్‌, రూఫ్‌ క్యాస్ట్‌ లెవెల్‌లో ఉన్నాయని.. 100 రోజుల ప్రణాళికలో భాగంగా వీటిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా మిగిలిన ఇళ్ల నిర్మాణాల పూర్తికి చొరవ చూపాలన్నారు. ఎక్కడైనా ఫిల్లింగ్‌కు సమస్యలు ఉంటే ఫ్లైయాష్‌ను కూడా ఉపయోగించుకోవడంపై దృష్టిసారించాలన్నారు. నిర్దేశిత డిజైన్‌ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని.. క్షేత్రస్థాయి అధికారులు నిరంతర పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేశారు. అవసరం మేరకు అర్బన్‌ లేఅవుట్ల మౌలిక వసతులకు సంబంధించి అమృత్‌ ప్రాజెక్టులను రూపొందించాలని మంత్రి పార్థసారథి సూచించారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తో పాటు మైలవరం, తిరువూరు శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్‌, కొలికపూడి శ్రీనివాసరావు తమ తమ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఇళ్ల నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ, ఏజెన్సీల పనితీరు, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన తదితరాలపై ఎంపీ మాట్లాడగా.. చెల్లింపుల్లో 2019కి ముందు జరిగిన ఇళ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం, భూ సేకరణ, గృహ నిర్మాణ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది కొరత, సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణాలు, గృహ నిర్మాణ సామగ్రి, ఆప్షన్‌-3 ఇళ్లు తదితరాలపై శాసనసభ్యులు సమావేశంలో చర్చించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.
సమావేశంలో హౌసింగ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జీవీ ప్రసాద్‌, ఎన్‌టీఆర్‌ జిల్లా హౌసింగ్‌ పీడీ రజనీకుమారి, ఆర్‌డీవోలు బీహెచ్‌ భవానీ శంకర్‌, ఎ.రవీంద్రరావు, కె.మాధవి, కేఆర్‌సీసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఇ.కిరణ్మయి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డ్వామా పీడీ జె.సునీత, విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ కేవీ సత్యవతి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్‌ ఇంజనీర్లు, మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2025

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిపై మంత్రి లోకేష్‌ దిగ్భ్రాంతి

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు

Previous Post

గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు

Next Post

మరణించిన ఏకలవ్య టీచర్ల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, ఉద్యోగం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2025

కార్యకర్త
@ May 14, 2025
ఆపదలో అన్న గుర్తుకు రాలేదా శీనూ!
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిపై మంత్రి లోకేష్‌ దిగ్భ్రాంతి

చైతన్యరధం
@ May 14, 2025
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు

చైతన్యరధం
@ May 14, 2025
త్వరలో రాష్ట్రానికి 91 పెద్ద కంపెనీలు
ఆంధ్రప్రదేశ్

త్వరలో రాష్ట్రానికి 91 పెద్ద కంపెనీలు

చైతన్యరధం
@ May 14, 2025
మద్యం కేసు కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్‌
ఆంధ్రప్రదేశ్

మద్యం కేసు కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్‌

చైతన్యరధం
@ May 14, 2025
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
ఆంధ్రప్రదేశ్

ఇరిగేషన్‌ రంగంలో..గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నాం

చైతన్యరధం
@ May 14, 2025
ఎంఎస్‌ఎంఈ పార్కులతో భారీగా ఉపాధి కల్పన
ఆంధ్రప్రదేశ్

ఎంఎస్‌ఎంఈ పార్కులతో భారీగా ఉపాధి కల్పన

చైతన్యరధం
@ May 14, 2025
దళితుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన
ఆంధ్రప్రదేశ్

దళితుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన

చైతన్యరధం
@ May 14, 2025
Load More

ముఖ్య వార్తలు

నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

చైతన్యరధం
@ May 14, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

జీవో 3పై అధ్యయనం

చైతన్యరధం
@ May 13, 2025
సీఎం చంద్రబాబు ఎమోషనల్‌ ట్వీట్‌

మాటలు కావవి తూటాలే!

చైతన్యరధం
@ May 13, 2025
కుటుంబానికి రూ.50 లక్షల సాయం

కుటుంబానికి రూ.50 లక్షల సాయం

చైతన్యరధం
@ May 12, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరో అడుగు ముందుకి..!

అమరావతికి వైభవం..తెలుగువారి ఆశలకు జీవం

చైతన్యరధం
@ May 2, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆపదలో అన్న గుర్తుకు రాలేదా శీనూ!

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిపై మంత్రి లోకేష్‌ దిగ్భ్రాంతి

చైతన్యరధం
@ May 14, 2025
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు

చైతన్యరధం
@ May 14, 2025
త్వరలో రాష్ట్రానికి 91 పెద్ద కంపెనీలు

త్వరలో రాష్ట్రానికి 91 పెద్ద కంపెనీలు

చైతన్యరధం
@ May 14, 2025
మద్యం కేసు కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్‌

మద్యం కేసు కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్‌

చైతన్యరధం
@ May 14, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist