చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు

పంచాయతీరాజ్‌ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలను సీఎంకు వివరించిన డిప్యూటీ సీఎం

by చైతన్యరధం
Aug 21, 2024 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పంచాయతీరాజ్‌ శాఖను బలోపేతం చేస్తాం
  • ప్రతి ఇంటి, గ్రామ, ప్రాంత అవసరాలు గుర్తించి, సదుపాయాలు కల్పిస్తాం
  • వచ్చే జనవరి నుండి జన్మభూమి 2.0 కార్యక్రమం
  • గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములను చేస్తాం
  • పంచాయతీ రాజ్‌ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990 కోట్లు
  • జల్‌జీవన్‌ మిషన్‌ పథకానికి రాష్ట్ర వాటా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామన్న సీఎం
  • సమీక్షకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, అధికారులు
  • పంచాయతీరాజ్‌ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలను సీఎంకు వివరించిన డిప్యూటీ సీఎం

అమరావతి(చైతన్యరథం): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 2014-19 మధ్య చేపట్టిన పలు కార్యక్రమాల ద్వారా నాడు గ్రామాల రూపు రేఖలు మార్చితే….గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చిందని సీఎం అన్నారు. మళ్లీ గ్రామాల్లో వెలుగు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీ రాజ్‌ శాఖకు జవసత్వాలు అందిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏమి అవసరమో గుర్తిస్తాం…సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఒక ఇంటికి అవసరమైన విద్యుత్‌, గ్యాస్‌, టాయిలెట్‌, నీటి కుళాయి వంటి వాటిని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. అలాగే ఒక గ్రామానికి అవసరమైన వీధి లైట్లు, డ్రైనేజీ కాలువలు, సిమెంటు రోడ్లు, తాగునీటి సరఫరా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ కేంద్రాల వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు.

గ్రామం నుంచి సమీప ప్రాంతాల అనుసంధానం కోసం రోడ్లు, మార్కెట్‌ ప్లేస్‌ లు వంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. వీటిని కూడా కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీ రాజ్‌ శాఖ సమగ్రమైన ప్రణాళికతో రానున్న రోజుల్లో పనిచేయాలని సూచించారు. వచ్చే జనవరి నుంచి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని, గ్రామాల అభివృద్ధికి ముందుకు వచ్చే వారితో కలిసి పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని సీఎం తెలిపారు. సచివాలయంలో మంగళవారం పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలపై సీఎం సమీక్ష చేశారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

రాబోయే 5 ఏళ్లలో 17,500 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం తీరుతో గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లాయి. దీని వల్ల కనీస స్థాయిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ప్రస్తుతం పంచాయతీ రాజ్‌ శాఖకు రావాల్సిన రూ.990 కోట్లను ఆర్థిక శాఖనుంచి విడుదల చేస్తున్నాం. ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీళ్లు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని గత ప్రభుత్వం ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జల్‌ జీవన్‌ మిషన్‌ పనుల్లో రాష్ట్రం 19వ స్థానానికి దిగజారిపోయిందంటే.. అది నాటి ప్రభుత్వ అలసత్వానికి ఉదాహరణ. జల్‌ జీవన్‌ మిషన్‌ కోసం రాష్ట్ర వాటా కింద ఆర్థిక శాఖ నుంచి రూ.500 కోట్లు వెంటనే విడుదల చేస్తాం. కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగునీరు అందిస్తాం.

అలాగే రాబోయే ఐదు సంవత్సరాల్లో 17,500 కిలో మీటర్ల మేర సిమెంట్‌ రోడ్లు నిర్మాణం, 10 వేల కి.మీ సీసీ డ్రైనేజీ కాలవల నిర్మాణం జరపాలి. ఈ పనుల పూర్తికి ఎంత సమయం పడుతుంది…ఏడాదికి ఎంతమేర పనులు చేయగలరు అనేది లక్ష్యంగా నిర్దేశించుకుని వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎల్‌ఈడి విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేస్తే తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటి నిర్వహణ కూడా చేపట్టకుండా వదిలేసిన వైనాన్ని అధికారులు వివరించారు. ఇప్పుడు గ్రామాల్లో 60 శాతం లైట్లు మాత్రమే వెలుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి రూ.482 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందని..గత 5 ఏళ్లుగా ఆ నిధులు విడుదల చేయకపోవడం వల్ల కొత్త లైట్లు ఏర్పాటు, నిర్వహణ మూలన పడిరదని అధికారులు తెలిపారు. అయితే దశల వారీగా ఈ చెల్లింపులు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని పంచాయతీల భవనాల ద్వారా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని సీఎం సూచించారు. అలాగే గ్రామాల్లో చేపట్టే నరేగా పనులపై ఆయా గ్రామాల్లో తప్పనిసరిగా గ్రామ సభలు నిర్వహించాలన్నారు. కొత్త వ్యవస్థలు వచ్చినా గ్రామ సర్పంచిని గౌరవించుకోవాల్సిన అసవరముందని సీఎం అన్నారు. గత ప్రభుత్వ తీరువల్ల మూలనపడ్డ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ కేంద్రాలను మళ్లీ ప్రారంభించాలని సీఎం చెప్పారు. నరేగా పనులపై చర్చించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలన్నిటినీ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 2014-19 మధ్య ఎన్టీఆర్‌ జలసిరి కింద 32,693 బోర్లు వేసి పంపు సెట్లు బిగిస్తే…గత ప్రభుత్వం కేవలం 2,580 పంపు సెట్లు మాత్రమే ఇచ్చిందని అధికారులు వివరించారు. రానున్న రోజుల్లో 10 వేల కిలోమీటర్ల డ్రైన్‌లు, 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని….అలాగే 5 లక్షల ఫామ్‌ పాండ్స్‌ తవ్వకాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అధికారులు వివరించారు.

ప్రజలను ప్రకృతికి చేరువ చేయండి
రాష్ట్రంలో అడవుల పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. హార్టికల్చర్‌తో కలుపుకుని రాష్ట్రంలో 50 శాతం గ్రీన్‌ బెల్ట్‌ సాధించాలని సీఎం అన్నారు. నగర వనం కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాల్లో, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు చేపట్టాలని సీఎం తెలిపారు. ప్రకృతితో ప్రజలు మమేకమయ్యే పరిస్థితి కల్పించాలని ఆయన సూచించారు. పచ్చదనం పెంచేతే ప్రజలు ఆ ప్రాంతాలకు వచ్చి సేదతీరుతారని, అలాంటి వాతావరణం కల్పించాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టులకు అనేక అవకాశాలున్నాయని, ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అడవుల్లో టూరిజం అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

డిపోల్లో ఉన్న ఎర్రచందనం నిల్వలను పరిరక్షించాలని సూచించారు. 6 నెలలకు ఒక్క సారి ఎర్రచందనం వేలం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మడ అడవుల అభివృద్ధి, పరిరక్షణ కోసం రాజీ లేకుండా పనిచేయాలన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖలో గత కొద్ది రోజుల్లో తీసుకున్న పలు నిర్ణయాలను, సంస్కరణలను ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షలో వివరించారు. గ్రామాల ముఖచిత్రం మార్చడంలో కీలకమైన పంచాయతీ రాజ్‌, రూరల్‌ డెవలెప్మెంట్‌ శాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, నేడు మళ్లీ నిధులు, కొత్త విధానాల ద్వారా గ్రామాల్లో సమూల మార్పులు తీసుకువస్తామని ముఖ్యమంత్రికి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Previous Post

అమరావతి నిర్మాణంలో భాగం పంచుకోండి

Next Post

ఆధునిక సాంకేతికతతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist