- అంగన్వాడీల తొలగింపునకు ఉత్తర్వులు
- ఛలో విజయవాడను అడ్డుకునేందుకు ఎక్కడిక్కడ అరెస్ట్‌లు
- అర్ధరాత్రివేళ అంగన్వాడీల దీక్షలు భగ్నం
- నిర్బంధాన్ని ఎదిరించి బిఆర్‌టిఎస్ రోడ్డుకు చేరుకున్న అంగన్వాడీలు
- 24న ఏపీ బంద్‌కు పలు సంఘాల పిలుపు
అమరావతి, చైతన్యరథం: తమ సమస్యల పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్‌రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మె చేస్తున్న అంగన్వా డీలను తొలగించాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభు త్వం సోమవారం ఆదేశాలు జారీచేసింది. విధు లకు హాజరుకాని అంగన్వాడీలను సోమవారం సాయంత్రానికి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఎస్మా చట్టంలోని నిబంధ నలు ప్రకారం ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. ప్రభుత్వ నోటీసులకు అంగన్వాడీలు రిప్లై ఇవ్వగా దాని పట్ల సంతృప్తి చెందలేదని అధికారులు చెబుతున్నారు. కాగా.. అంగన్వాడీ లతో పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగిస్తామంటూ అంగన్వాడీలు పట్టుబట్టారు. సమ్మెలో భాగంగా సోమవారం ఛలో విజయవాడకు అంగన్వాడీలు పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల తొలగింపునకు జిల్లా కలెక్టర్లు టెర్మినేషన్ ఆర్డర్లను సిద్దం చేశారు. 80 వేల మందికి పైగా అంగన్వాడీలను తొలగిస్తూ టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధమయ్యాయి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు విధుల్లో చేరాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నోటీసుల జారీతో 20శాంతం మంది అంగన్వా డీ వర్కర్లు, హెల్పర్లు విధుల్లో చేరారు. తొలగిం చిన అంగన్వాడీల స్థానంలో కొత్తవారి భర్తీకి 26న దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్లు నిర్ణ యించారు. ఈ నెల 24న అంగన్వాడీల టెర్మి నేషన్‌పై గెజిట్ నోటిఫికేషన్ చేయాలని నిర్ణ యించారు. కొత్తవారి నియామకంపై 25న నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వ చర్యలకు భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. తమ సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు. మరోవైపు అంగన్వా డీల సమ్మెకు మద్దతుగా, ప్రభుత్వ నిర్బంధకాం డను నిరసిస్తూ ఈనెల 24వ తేదీన ఏపీ బంద్‌కు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. అం గన్‌వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం, ఉద్యమంపై నిర్భంధం, తొలగింపునకు నిరసన గా రాష్ట్రబంద్ చేపడుతున్నట్లు సంఘాలు పేర్కొ న్నాయి. అంగన్‌వాడీల ఆందోళనకు మద్దతుగా వామపక్షాలతో పాటు, కార్మిక సంఘాలు, ఉద్య మసంఘాల బంద్‌కు పిలుపునిచ్చాయి. కనీస వేతనం పెంచాలని, సమాన పనికి సమాన వేత నం ఇవ్వాలంటూ 42 రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.
కదం తొక్కిన అంగన్వాడీలు.. ఉద్రిక్తం..
అంగన్వాడీల సోమవారం తలపెట్టిన చలో విజయవాడ ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం నివాసాన్ని అంగన్వాడీలు ముట్టడిస్తారని తాడే పల్లి సీఎం నివాసానికి వెళ్ళే రహదారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి మరీ పంపారు. ఐరన్ ఫెన్సింగ్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. విజయవాడలో కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లుచేశారు. ధర్నా చౌక్, బిఆర్‌టిఎస్ రోడ్డులో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా మహి ళా కానిస్టేబుళ్లను విజయవాడకి రప్పించారు. అంగన్వాడీలను అరెస్ట్ చేసేందుకు మహిళ కానిస్టేబుళ్లను దించారు. ప్రభుత్వం నిర్భందాన్ని ఎదరించి చలో విజయవాడలో భాగంగా నగ రంలోని పలుప్రాంతాల్లో అంగన్వాడీలు కదం తొక్కారు. ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని మరీ పలు జిల్లాల నుంచి అంగన్వాడీలు విజయవాడ కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీ సులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రభు త్వ ఉత్తర్వులపై అంగన్వాడీ ఉద్యమ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తొలగింపు ఉత్తర్వు లను కోర్టుల్లో సవాల్ చేస్తామని అంగన్వాడీ ఉద్యమ నేతలు తెలిపారు.
అర్ధరాత్రి దీక్షలు భగ్నం
విజయవాడ ధర్నా చౌకలో అంగన్వాడీలు చేస్తున్న దీక్షలను ఆదివారం అర్ధరాత్రి మూడు గంటల సమయంలో పోలీసులు భగ్నం చేశా రు. లైట్లు ఆర్పేసి బలవంతంగా దీక్షలు చేస్తున్న అంగన్వాడీలను అరెస్ట్ చేశారు.అనంతరం కొం తమందిని ఆసుపత్రికి తరలించారు. దాదా పు 20బస్సులను తీసుకొచ్చి దీక్షలు చేస్తున్న అంగ న్వాడీలను ఈడ్చుకెళ్లి వాటిల్లో పడేశారు. దీక్షల భగ్నం దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియాపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.